అనుబంధాలు-ఆవేశాలు (నవల)

అనుబంధాలు-ఆవేశాలు – 12 – ప్రమీల సూర్యదేవర నాలుగవ బుధవారం భ్రమరను కలిసినప్పుడు, సురేష్ కలిసాడని చెప్పాను. చివ్వున తలెత్తి చూసింది. “అవును, మా ఇంటి చిరునామా ఎలా కనుక్కున్నాడో ఏమో వచ్చి కలిశాడు. మిమ్మల్ని ఇక్కడ్నుండి బయటకు తీసుకెళ్ళి పోవటానికి ఎలాంటి సహాయం కావాలన్నా చేయటానికి అతను వెనుకాడనని చెప్పమని చెప్పాడు. మీ విషయంలొ అతను చాలా బాధ పడ్తున్నాడు.” భ్రమర ముఖంలో మారుతున్న కవళికలు గమనిస్తూ అన్నాను. బల్ల మీదకు ఒంగి, మోచేతుల్లో ముఖం […]

Continue Reading
Posted On :

అనుబంధాలు-ఆవేశాలు (నవల)

అనుబంధాలు-ఆవేశాలు – 11 – ప్రమీల సూర్యదేవర సురేష్ వచ్చేవరకు ఏ పని మీద మనసు నిలువ లేదు. ఎప్పుడు సాయంత్రం అవుతుందా! అని పదే పదే గడియారం వైపు చూస్తూ గడిపాను. సుమారు ఆరుగంటల ప్రాతంలో వచ్చాడు సురేష్. పచ్చని పసుపుఛాయ, లేతగోధుమ రంగు కళ్ళు , నున్నటి పట్టుకుచ్చులాంటి జుట్టు , అందమైన ముఖం, ఎత్తుకి సరిపడ లావు—చూపరుల దృష్టిని ఇట్టె ఆకట్టుకుంటాడు. అతని ముఖకవళికల్లో భ్రమర పోలికలేమీ లేకపోవటంతో అక్క, తమ్ముడు అనుకోలేం. […]

Continue Reading
Posted On :

అనుబంధాలు-ఆవేశాలు (నవల)

అనుబంధాలు-ఆవేశాలు – 10 – ప్రమీల సూర్యదేవర ఆ రోజు రానే వచ్చింది. రాధాదేవి దగ్గర నుండి అనుమతి వచ్చింది. ముందుగా భ్రమరతో మాట్లాడాలని నిర్ణయించుకుని అమ్మ పాటించమని చెప్పిన జాగ్రత్తల జాబితా అందుకుని, గోవిందుని తీసుకుని ప్రయాణమయ్యాను. మేము మాట్లాడుకోవటనికి రాధాదేవి ఒక గది ఏర్పాటు చేసింది. భ్రమరను తీసుకు వచ్చిన తరువాత ఆమెతో వచ్చిన రక్షకభటులను ద్వారం బయటనే ఉండాలనీ, ఆమె కాళ్ళకు, చేతులకు వేసిన ఇనప గొలుసులు తీసి వేయాలనే నా రెండు […]

Continue Reading
Posted On :

అనుబంధాలు-ఆవేశాలు (నవల)

అనుబంధాలు-ఆవేశాలు – 9 – ప్రమీల సూర్యదేవర అంజమ్మ హత్య చేస్తుండగా చూసిన వారి సాక్ష్యం ఉన్నది. స్నేహితురాలిని హత్య చేయాలనే ఉద్దేస్యం కాకపోయినా అది అలా జరిగిపోయింది. అంజమ్మ నిర్దోషి అని నిరూపించే అవకాశమే లేదు. ఆ రెండు కుటుంబాల దురదృష్టం—పిల్లలు తల్లులు లేని వారయ్యారు. భ్రమర విషయం అలా కాదు. హత్య చేయగా చూసి సాక్ష్యం చెప్పిన వారు లేరు. కత్తిపై ఆమె చేతి గుర్తులు, రక్తసిక్తమైన దుస్తులు మాత్రమే సాక్ష్యం. ఇరువురు తాము […]

Continue Reading
Posted On :

విషమ పరీక్ష (క‌థ‌)

విషమ పరీక్ష -ప్రమీల సూర్యదేవర పిన్నీ పిన్నీ పిప్పళ్ళూ!! పిన్నీకూతురు జాలమ్మా !! అట్లాకాడా సుబ్బమ్మా !! అల్లూడొచ్చాడు లేవమ్మా !! నందు, చందు, అనూష ముగ్గురూ దొడ్లో చిక్కుడుతీగను పందిరిపైకి మళ్ళిస్తున్న అనిత చుట్టూ చేరి, చప్పట్లు చరుస్తూ పాడసాగారు. “ఒరే, గాడుదుల్లారా ఎవరు నేర్పారురా మీకు ఈ పాట?” అని నవ్వుతూ వారివెంట పడింది అనిత. చిక్కుడు, కాకర, దొండ పందిళ్ళ చుట్టూ తిరిగి వాములదొడ్లోకొచ్చారు. వాముల చుట్టూ పరుగెత్తి , అలసిపోయి పిల్లలు […]

Continue Reading
Posted On :

మాతృదేవత? (క‌థ‌)

మాతృదేవత? -ప్రమీల సూర్యదేవర నందివర్ధనం, మందార, కనకాంబరాలతో పూలబుట్ట నింపుకుని, ఆ మొక్కలకు నీరుపోసి, పసిపాపల లేత బుగ్గలు నిమిరినట్లు ఆ మొక్కలను ప్రేమతో తాకి, ఆనందంగా వరండా మెట్లు ఎక్కబోతూ, వరండా వైపు వస్తున్న వ్యక్తిని చూసి ఆగిపో యింది సుమతి. ముగ్గుబుట్టలా నెరసిపోయిన నొక్కులజుట్టు వ్రేలుముడి వేసుకుని, నుదుట కనుపించీ కనుపించకుండా కుంకుమ బొట్టు పెట్టుకుని, ముఖానికి మించిపోయి ఉన్న ట్లున్న కళ్ళద్దాలు, ముదురాకుపచ్చని అంచువున్న కోరారంగు చీరె, మెడలో బంగారు గొలుసు … […]

Continue Reading
Posted On :