image_print

అనుబంధాలు-ఆవేశాలు – 8 (నవల)

అనుబంధాలు-ఆవేశాలు – 8 – ప్రమీల సూర్యదేవర భ్రమరలా మౌనంగా తనపని చూసుకునే తత్వం కాదు అంజమ్మది. అవకాశం ఉన్నంత వరకు తోటి ఖైదీలతో, కారాగార సిబ్బందితో మాటలు కలిపి చమత్కరిస్తుంది. ఒకసారి పారిపోవాలని పట్టుబడి ఫలితం అనుభవించింది. బిడ్డలు యాదుకొస్తున్నరని కళ్ళనీళ్ళు పెట్టుకుంటుంది. చదువు లేకపోయినా, అడవి, గూడెం తప్ప బయటి ప్రపంచం తెలియక పోయినా ఉట్టిపడే సంస్కారంతో తోటి వారిని పలుకరించే అంజమ్మ—-చదువు, సంస్కారం ఉండి తన కాళ్ళ మీద తను నిలబడకలిగే అవకాశం […]

Continue Reading

అనుబంధాలు-ఆవేశాలు – 7 (నవల)

అనుబంధాలు-ఆవేశాలు – 7 – ప్రమీల సూర్యదేవర ఇక్కడ కూడా ముందుగా సంఖ్యలే ఉన్నాయి. 586. రెండవ పేజీలో ఫోటో.  నిండుగా ఒతైన జుట్టుతో పెట్టిన కొప్పుముడి, నుదుట దిద్దిన కుంకుమబొట్టు ఉదయిస్తున్న సూర్యబింబంలా వెలిగి పోతుంది. చెవి తమ్మెకు మించిన దంతపు దిద్దులు, ముక్కుబుళాకి, మెడలో రంగు రంగుల పూసల దండలు, మోచేతి వరకు వేసుకున్న వెడల్పైన దంతపు గాజులు—–వయసు 40—45 సంవత్సరాల మధ్య ఉంటుంది. మనిషి బలిష్ఠంగ, ఆరోగ్యంగ కనుపిస్తుంది. కాటుకతో నిగనిగ లాడుతున్న […]

Continue Reading

అనుబంధాలు-ఆవేశాలు – 6 (నవల)

అనుబంధాలు-ఆవేశాలు – 6 – ప్రమీల సూర్యదేవర భ్రమర బోనులోకి వచ్చేటప్పుడు గదిలో కొంత అలజడి కలిగింది. అందరి కళ్ళు ఆతృతతో ఆమె వైపు చూశాయి. భ్రమర చేత ప్రమాణం చేయించి, “హత్య జరిగిన రోజు మీరు కాక ఇంకెవరైనా వున్నరా?” అని అడిగాడు న్యాయవాది. సమాధానం లేదు. “మీకు ఎవరి మీదనైన అనుమానం వున్నదా?” మౌనమె సమాధానం. “ఆ రోజు ఏం జరిగిందో మీకు గుర్తువున్నంత వరకు చెప్పగలరా?” “లే” దన్నట్లు తల ఊపింది. “కత్తిమీద […]

Continue Reading

అనుబంధాలు-ఆవేశాలు – 5 (నవల)

అనుబంధాలు-ఆవేశాలు – 5 – ప్రమీల సూర్యదేవర న్యాయస్థానంలో సురేష్ బోనులో నిల్చుని, భ్రమర హత్య చేయదని, వ్యాధితో బాధపడ్తున్న తమ తల్లిని ఎంతో ఓర్పుగా, ప్రేమగా చూసుకునేదని, తన అక్కకు సాయం చేయవలసిందిగ న్యాయవాదులను అతి దీనంగా వేడుకున్నాడు. తమ్నుడు మట్లాడే సమయంలో కూడ భ్రమర మానసిక స్థితిలో మార్పులేదు. ఇంటి ప్రక్క వారిని సాక్షులుగ న్యాయస్థానానికి రప్పించారు. యజమానిచేత ప్రమాణం చేయించి న్యాయవాది ప్రశ్నించాడు. “ఆ సమయంలో మీరెక్కడ నుండి వస్తున్నారు?” “ఈగ సినిమా రెండవ […]

Continue Reading

అనుబంధాలు-ఆవేశాలు – 4 (నవల)

అనుబంధాలు-ఆవేశాలు – 4 – ప్రమీల సూర్యదేవర “మంత్రిగారి నుండి అనుమతి పత్రం తీసుకుని లోపలకు రావటానికి మీ అనుమతి పొందగలిగాను. ఇక్కడ మీ సహాయం, సహకారం లభిస్తాయని ఆశిస్తున్నాను.” ఈవిడ తీరు చూస్తే ముందుముందు నేను రావటానికి అనుమతినివ్వదేమోననే అనుమానం ఒకప్రక్క కలవర పెడ్తుండగా అన్నాను. “ఇదంతా మాకుక్రొత్త , పై అధికారులకు తెలియజేసి వారేం సలహా ఇస్తారో చూడాలి. మీరు–మేము–ఇద్దరం ఎలా మొదలు పెట్టాలో, ఎలా కొనసాగించాలో వారి నుండి అనుమతి రావల్సిందే. ఈ […]

Continue Reading

అనుబంధాలు-ఆవేశాలు – 3 (నవల)

అనుబంధాలు-ఆవేశాలు – 3 – ప్రమీల సూర్యదేవర “ఇక్కడి భద్రత విషయంలో ఎంత జాగ్రత్త వహిస్తామో మీకు ఈపాటికి అర్దమైపోయి ఉండాలి. జలజ లాంటి భద్రతా సిబ్బంది మొత్తం పన్నెండు మంది ఉంటారు. కాని ప్రతిరోజు విధుల్లో నలుగురు మాత్రమే ఉంటారు. ఈ పన్నెండు మంది రోజుకి ఎనిమిది గంటల చొప్పున పని చేస్తారు. వారంతా అతి జాగరూకతతో ప్రతిక్షణం అప్రమత్తతో ఉండ వలసిందే. ఏ మాత్రం ఏమరుపాటు ఉండ కూడదు. ప్రతి భద్రతావుద్యోగి క్రింద ఆరుగురు […]

Continue Reading

అనుబంధాలు-ఆవేశాలు – 2 (నవల)

అనుబంధాలు-ఆవేశాలు – 2 – ప్రమీల సూర్యదేవర ప్రహరీగోడ లోపల మరొక ఎత్తయినగోడ—దాదాపు ప్రహరీగోడతో సమానమైన ఎత్తు ఉన్నది కాని ముళ్ళ తీగ లేదు. ఈ రెండు గోడలకు మధ్య ఉన్న ఆవరణలో ఒకవైపు చిన్న పూదోట ఉన్నది. అందులో బంతి మొక్కలు ఎక్కువగా కనుపించాయి. అక్కడక్కడ గులాబీలు, మందారాలు, నందివర్దనం, ఇవేకాక కొన్ని క్రోటన్ మొక్కలునాయి. ఆ తోటకు ఎదురుగా ఉన్న ఖాళీ స్తలంలో రెండు కర్రలు పాతి ఒక నెట్‌ కట్టారు. ఆ ఆటస్థలం […]

Continue Reading

అనుబంధాలు-ఆవేశాలు – 1 (నవల) (ఈ నెల నుండి ప్రారంభం)

అనుబంధాలు-ఆవేశాలు – 1 (నవల) (ఈ నెల నుండి ప్రారంభం) – ప్రమీల సూర్యదేవర ముందుమాట ముఖంలో భావాలు తెలుపటానికి కళ్ళు అద్దాలవంటివని అంటారు. కాని గాజుకళ్ళలా ఉన్న ఆ కళ్ళల్లో భావాలు ఎక్కడ దాగి ఉన్నాయో!! క్షణికోద్రేకాలకు లోనైన వారి చర్యల ఫలితమే వారిని ఇక్కడకు చేర్చింది. ఒకానొకప్పుడు వారివారి కుటుంబాలతో కష్టసుఖాలు పంచుకుంటూ, వారివారి వృత్తులు నిర్వహించుకుంటూ ఉండేవారు. కిటికీకి ఈవలవైపున ఉన్న మనందరిలాగానే సమాజంలొ కష్టసుఖాలని ఎదుర్కొంటూ, వారివారి స్నేహితుల, బంధువుల ప్రేమాభిమానాలను […]

Continue Reading