
ఈర్షే ఓ పరీక్ష
-చందలూరి నారాయణరావు
కాలానికి సైతం
నచ్చని నిజమొకటి ఉంది నాలో.
దాని ఈర్షే ఓ పరీక్ష.
కొలిచినా చిన్న చూపే.
కలసిరాని పగ దానిది.
రుచిని వేధిస్తు ఆకలిని నిషేధిస్తుంది.
ఆశకు విలువ లేకుండా చేసి
మంచిని నటిస్తు దేన్నీ రానివ్వదు.
బలగాలతో బలం చూపుతుంది
రేపు ఏదో ఓ రోజు
తను పల్లకీగా మారుతానని తెలిసే
ఈ లోపల ఇదంతా ఆ ఆటలా ఓ నాటకం.
కష్టం, సహనం, నమ్మకం, దైర్యం
ఎవరి ముఖంలో చూసినా
లొంగుబాటు ధోరణి దాని నైజం.
ఎదురుతిరిగి తిరిగిదాడి చేస్తేనే
కాలం తనతో సమానంగా
నిన్ను నీ పేరుతో గౌరవించేది.
*****
Please follow and like us:

పుట్టినది: ప్రకాశం జిల్లా జె. పంగులూరు.
వృత్తి: హైస్కూల్ఉపాధ్యాయులు
ప్రవృత్తి: వచన కవిత్వం
రచనలు: మనం కాసేపు మాట్లాడుకుందాం(2018) కవితా సంపుటి
