చిత్రం-74

-గణేశ్వరరావు

అందవికారమైన చిత్రాలు చాలా ఉన్నాయి. మీకు అర్థంకానివి కొన్ని అయితే, ‘అర్థం కనుక్కో’ అని మీకు సవాల్ విసిరేవి మరి కొన్ని. కొన్ని చిత్రాలు చూడగానే వాటిలో అలజడి కలిగించే అంశాలు మనకు వెంటనే తెలిసిపోతాయి. కాగా కొన్ని చిత్రాలలో అర్థంకానివి ఎన్నో దాక్కుని ఉంటాయి. ముందు వాటిని గుర్తించాలి, తర్వాతే వాటి అర్థం వెతికి పట్టుకోవాలి. అలా తెలుసుకున్నాక కొన్ని మనల్ని నవ్విస్తాయి. కొన్ని మనల్ని పట్టుకొని కొంత కాలం వరకు వదలవు. ‘నిను వీడని నీడను నేనే’ అని భయపెడతాయి.

ఉదాహరణకు ఈ చిత్రాన్నే తీసుకోండి. ఇందులో మీకు కనిపిస్తున్న వారు డిస్నీ రాకుమార్తెలు. వాల్ట్ డిస్నీ తెలుసు కదా!. పోనీ ‘చందమామ’ లో పడ్డ మిస్టరీ సీరియల్ ‘విచిత్ర కవలలు’ జ్ఞాపకం ఉందా? అందులో ఒక పొట్టివాడు ఉంటాడు, వాడి గడ్డం మాత్రం మైలు పొడుగు. snow white, ఏడుగురు మరుగుజ్జులు, Belle ‘Beauty and Beast’, Rapunzel, Cinderella, Jasmine ఇత్యాదులు గుర్తొచ్చారా? దేశ విదేశాల కథలు, కొన్ని వేల సంవత్సరాల నాటి కథలు! సిండ్రెల్లా పుట్టింది చైనాలో అయితే ఫ్రెంచ్ వారు దాన్ని సొంతం చేసుకున్నారు. జాస్మిన్ పుట్టింది అరేబియాలో, స్నో వైట్ పుట్టింది జర్మనీలో. మరి మన పాతాళ భైరవి పుట్టింది రచయిత పింగళి- కళాదర్శకుడు గోఖలే కాల్పనిక జగత్తులో…వెలిసింది మద్రాస్ లోని విజయ స్టూడియోలో.

ఇంతకీ ఈ డిస్నీ రాకుమార్తెలు ఎవరెవరో గుర్తించారా? మీ మెదడుకు పదును పెట్టండి, ఆయా కథలు గుర్తుకు తెచ్చుకోండి! వాటిలోని నాయికలకు ప్రతీకలే, అలవోకగా చూడగానే అందరూ అందాల భరిణెలుగా కనిపించినా , పట్టి చూస్తే ఒక్కొక్కరిలో ఒక అవలక్షణం గుర్తిస్తారు.

అన్నీ మనల్ని వెంటాడేవే! అంత త్వరగా బాలల కథానాయికలను మరచిపోగలమా? డిస్నీ sense of humour ని మెచ్చుకోకుండా ఉండగలమా!

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.