image_print

అరచేత మాణిక్యము & శ్రీమతి కె.వరలక్ష్మి గారితో ముఖాముఖి

అరచేత మాణిక్యము  శ్రీమతి కె.వరలక్ష్మి గారితో ముఖాముఖి- -చంద్రలత నాజూకైన ‘గాజు పళ్ళెం’లో, ‘మట్టినీ బంగారాన్ని’ ఒకేసారి వడ్డించేసి, లయతప్పిన ‘జీవరాగాన్ని’ శృతి చేస్తూ , ఏమీ ఎరుగని ‘పాప’లా, వరలక్ష్మి గారు నిమ్మళంగా నిలబడి, ఫక్కున నవ్వేయగలరు కళ్ళల్లో నీళ్ళు చిప్పిల్లేలా! గోదావరి మన్యం అంచుల్లో, పాడిపంటల నడుమ  విరిసిన పల్లె మందారం వరలక్ష్మి గారు. చిన్నతనాన వెన్నమీగళ్ళ గోరు ముద్దలను అమ్మ బంగారమ్మగారు తినిపిస్తే, నాన్న వెంకట రమణగారు పుస్తకలోకాన్ని రుచి చూపించారు. ఆ […]

Continue Reading
Posted On :

ఉనికి మాట- మూర్తిమత్వం అనంతమై…!

ఉనికి మాట మూర్తిమత్వం అనంతమై…! – చంద్రలత      అప్పటికింకా వెలుగురేకలు పూర్తిగా విచ్చుకోలేదు.  చేటంత చేమంతులు బద్దకంగా వళ్ళు విరుచుకొంటూ , తొలికిరణాల్లో వెచ్చదనాన్ని వెతుక్కుంటున్నాయి. జనవరి చివరి… ఢిల్లీ రోజులవి. ఫలహారశాలలో కాఫీ తేనీరులు దక్క,  మరే  ఫలహారాలు అప్పుడప్పుడే వడ్డించే ప్రసక్తి లేదని తెగేసి చెప్పారు.  ఇక చేసేదేమీ లేక , మరొక కప్పు తేనీరు నింపుకొని, కిటికీలోంచి చేమంతుల రేకులపై వాలుతోన్న పసుపువన్నెలు చూస్తూ ఉన్నా. ఎప్పటినుండి గమనిస్తున్నారో నన్ను, […]

Continue Reading
Posted On :

ఉనికి పాట -తెల్లగులాబీ, మళ్ళీ వికసించేదాకా!( నానా మొస్కోరి)

ఉనికి పాట తెల్లగులాబీ, మళ్ళీ వికసించేదాకా! ఏథెన్స్ శ్వేతగులాబీ, నానా మొస్కోరి – చంద్రలత  ప్రపంచాధిపతి కావాలని కలగన్న గ్రీకువీరుడు, అలెగ్జాండర్, జైత్రయాత్ర యాత్ర అర్హ్తాంతరంగా ముగియవచ్చుగాక ! ప్రపంచ యుద్ధానంతర సాంస్కృతిక పునర్జీవకాలంలో,అఖండసంగీత ప్రపంచపు జగజ్జేతగా వెలుగొందుతుంది మాత్రం గ్రీకు బిడ్డే.  నిస్సందేహంగా, నిఖార్సుగా. ఆమె ఒక   గ్రీకు జానపద గాయని. సాంప్రదాయ గ్రీకు వస్త్రాలంకరణలో, విరబూసిన తెల్లగులాబీ లాగానే ,ఆమె నడిచి వస్తుంది. పాదాల దాకా జీరాడే, పొడవు చేతుల దుస్తులలో , […]

Continue Reading
Posted On :

ఉనికి మాట-1 కొండ అద్దమందు (లే మిజరబుల్స్ తెలుగుసేతకు ముందుమాట)

ఉనికి మాట -1 కొండ అద్దమందు – చంద్రలత (విక్టర్ హ్యూగో “లే మిజరబుల్స్” తెలుగుసేతకు ముందుమాట) ఇంతకీ, ఏ నవలయినా ఏం చెబుతుంది? ఏదో ఒక కథ చెబుతుంది. మరి,గొప్పనవల ఏదో ఒక గొప్పకథ చెప్పేసి ఊరుకోదు.ఎప్పటి కథ చెప్పినా,ఎక్కడి కథ చెప్పినా,ఎవరి కథ చెప్పినా, ఆ నవల మన కథే చెబుతుంది! అసలు అందుకేగా ఆ నవల గొప్ప నవల అయ్యిందీ! స్థల,కాలాల అవధులు దాటి పదికాలాలు పదిలంగా నిలిచిందీ! ఇదుగోండి, ఈ “లే […]

Continue Reading
Posted On :

ఉనికి పాట -ఇంద్రధనుస్సుకు ఆవలగా! జ్యూడీ గార్లాండ్

ఉనికి పాట ఇంద్రధనుస్సుకు ఆవలగా! జ్యూడీ గార్లాండ్ – చంద్రలత  “వద్దు! వద్దే వద్దు! వద్దంటే వద్దు! ” ముచ్చటగా మూడుసార్లు సినిమారికార్డుల్లోంచి ఆ పాట తొలగించబడింది. ‘గడ్డివాముల్లో దోబూచులాడుకొనే చిన్నపిల్ల గొంతులో ఇమడని ముది నాపసాని ఏడుపుగొట్టురాగంలా ఉంది,’ ‘ఆ మందగొండి పాట సినిమాని సాగదీస్తోంది’ అంటూ. వద్దన్నకొద్దీ కావాలని మొండిపిల్లల్లా పట్టుబట్టిన పెద్దల దార్షనికత వలన,మూడు తొలగింపుల తరువాత కూడా, ఆ పాట సినిమాలో చోటుచేసుకొంది.ఆ పాట స్వరంతోనే ఆ సినిమా మొదలవుతుంది. మాటల్లో […]

Continue Reading
Posted On :

ఉనికి పాట – అరటిపడవలొచ్చాయ్ పదండ్రోయ్! కలిప్సో మహారాజు : హ్యారీ బెలఫాంటే

ఉనికి పాట అరటిపడవలొచ్చాయ్ పదండ్రోయ్! కలిప్సో మహారాజు : హ్యారీ బెలఫాంటే – చంద్రలత            పంతొమ్మిదివందల యాభైదశకం ఆరంభం.ఒక ఉత్తేజ సంగీతకెరటం అమెరికన్ యువసంగీత ప్రపంచాన్ని ఉర్రూతలూపింది.ఉక్కిరిబిక్కిరి చేసింది.           అదే సమయాన, ఆ స్వరానికి సమాంతరంగా, చెప్పాపెట్టకుండా, ఊహాతీతంగా,సముద్రగర్భం నుండి ఉవ్వెత్తున ఎగిసిపడింది ఒక ద్వీపరాగాల  పెనుతూఫాను. అన్ని అమెరికన్ సంగీత కొలమానాలలో మొదటి స్థానంలో నిలబడుతూ.మొట్టమొదటిసారిగా,మిల్లియన్ సోలో LP రికార్డులు అమ్ముడుపోయాయి.దాదాపు 37 వారాల పైగా అన్ని జాబితాలలో ప్రప్రథమస్థానంలో నిలబడింది.సవినయంగా.సహజంగా.           మొదటి కళాకారుడు, రాక్ […]

Continue Reading
Posted On :

ఉనికి పాట – ‘మమ్మా ఆఫ్రికా ’ మిరియం మకీబ

ఉనికి పాట  “త్వరత్వరగా అమ్మా,  త్వర త్వరగా!” ‘మమ్మా ఆఫ్రికా ’  మిరియం మకీబ -చంద్ర లత “మా లయ కుదరగానే అన్నాను “చూసుకోండిక!” మరి ఇదేగా   పట పట!  అదంతే , యువతీ ఇదే పట పట !”  పట పట ఒక నాట్యం పేరు జొహెనెస్ బర్గ్ శివార్లలో మేం చేసే నాట్యం అందరం కదలడం మొదలు పెడతామో లేదో పట పట రాగం మొదలుతుంది   “ప్రతి శుక్రవారం, శనివారం రాత్రి. […]

Continue Reading
Posted On :

ఉనికి పాట – కదిలిందొక కాండోర్…! ఎల్ కాండోర్ పాసా…!

ఉనికి పాట  కదిలిందొక కాండోర్…!   ఎల్ కాండోర్ పాసా…! -చంద్ర లత *** కొండమీద “కో” అంటే, “కో… కో… కో…” అని అంటుంటాం. వింటుంటాం. కొండగాలి వాటున గిరికీలుకొడుతూ, ప్రతిధ్వనించే ప్రతి పలకరింపును  ప్రస్తావిస్తూ. కొండైనా కోనైనా, మాటకి మాట తోడు. మనిషికి మనిషి తోడు. అది ప్రకృతిసహజంగా అబ్బిన మానవనైజం. పలుకు పలుకులో ఉలికిపాటును నింపుకొని, చెక్కిన వెదురుముక్కలను వరుసగా కట్టి, తమ ఊపిరితో ఆయువుపాటకు ప్రాణం పోస్తూ, పర్వతసానువుల్లో,లోయల్లో,కనుమల్లో, సతతహరితారణ్యాల్లో, కొండకొమ్ము నుంచి […]

Continue Reading
Posted On :

ఉనికి పాట – వెలుగుని మరిచిన పూవు

ఉనికిపాట  వెలుగుని మరిచిన పూవు  – చంద్రలత     ఆశై ముగం మరందు పోశే  : సుబ్రమణ్య భారతి  సుబ్రమణ్య భారతి (1882 -1921) * అజరామరమైన పాటగా పదిలమైన కవిత గురించి ఒక మాట *          ఇది కొత్త విషయమేమీ కాకపోవచ్చు. కానీ,ఎవరికి వారం ఒకానొక ప్రపంచంలో జీవిస్తూ ఉంటాం.          ఒక అద్భుతమైన మానవ సంబంధాన్ని చేజార్చుకొన్నప్పుడు, ఆ ప్రపంచం అంతా దుఃఖ భరితం అయి,అంధకారబందురమైనపుడు,  ఆ మనసుకు కలిగే శోకం, క్లేశం అంతా ఇంతా […]

Continue Reading
Posted On :

ఉనికి పాట -ఓ వీధిదీపం నీడన

ఉనికి పాట ఓ వీధిదీపం నీడన -చంద్ర లత     అతనొక సామాన్యుడు.బడిపంతులు.అందమైన ప్రేయసి. కుదురైన జీవితం. కలల దుప్పటి కప్పుకొన్న యువకుడు. ఆమె ఒక కేబరే గాయని. నటనావిద్యార్థి. ఒక గాయపడ్డ గృహిణి.వంటరి తల్లి. సాంప్రదాయాలకు ఆవలగా విచ్చుకొన్న గొంతుక. అతనొక సైనికాధికారి. రాజద్రోహిగానిలిచిన దేశబహిష్కృతుడు. కరుకు నిబంధనల్లో విదిల్చిన సిరాచుక్క. ఆమె ఒక కళాకారిణి. నియంతృత్వం గీసిన గీటు దాటి గొంతెత్తితే,మరణదండనే. పాడమన్న పాట పాడలేక, ఖండాంతరాలు చేరిన కాందిశీకురాలు. భిన్నమైన మనుషులు,నేపథ్యాలు. భిన్నమైన […]

Continue Reading
Posted On :

ఉనికి పాట- ఆయువు పాట

ఉనికి పాట -చంద్ర లత        (అజరామరమైన పాటగా పదిలమైన కవిత గురించి ఒక మాట) చెలీ సెలవ్…! సెలవ్  సెలవ్ !   *** ఇక మనం మేలు కోవాలి  ఇక మనం తెలుసుకోవాలి    ఇక మనం మనకళ్ళు తెరిచిచూడాలి   ఇప్పుడే… ఇప్పుడే ఇప్పుడే !           మనం మేలైన రేపటిని నిర్మించుకోవాలి       ఆ పనిని మనం ఇప్పుడే మొదలుపెట్టాలి            […]

Continue Reading
Posted On :

ఉనికి పాట- పడాం…పడాం… !

 పడాం…పడాం… ! -చంద్ర లత ఎడిత్ పియెఫ్( 1915-1963) ఫ్రెంచ్ గాయని,నటి, గేయరచయిత, స్వరకర్త, ఛాసో నెట్. ఫ్రెంచ్ అభూత కల్పన గా  ప్రస్తావించే ఎడిత్ పియెఫ్ , అంతర్జాతీయ ఫ్రెంచ్ తార. “పడాం… పడాం… ” అన్న పాట ఒక వాల్ట్జ్ గీతం. ఇది సంగీత జ్ఞాపకాల గురించిన పాట. ఒక స్వరం వినబడగానే, జ్ఞాపకాల తుట్టి ఎలా కదిలించబడుతుందో ఈ పాట చెపుతుంది. తన ఇరవైఏళ్ల వయస్సు నాటి గతించిన ప్రేమ జ్ఞాపకాలు ఈ […]

Continue Reading
Posted On :

చూడలా గులాబిలా!

చూడలా గులాబిలా! -చంద్రలత లా వి యెనా రోజా ! ఎడిత్ పియెఫ్  ( La Vie en Rose *  Edith Piaf) బురదగుంటలో వేళ్ళూనుకొన్నప్పటికీ, తామరలా వికసించమంటాడు గౌతమ బుద్ధుడు. ముళ్ళకంపపై మొగ్గతొడిగినా, గులాబీలా జీవితాన్ని చూడమంటొంది ఎడిత్ పియెఫ్. అలాగని, ఎడిత్ పియెఫ్ తాత్వికురాలో దార్షనికురాలో కాదు. ఒక గాయని.తన పాటలు తానే రాసుకొని ,తనే స్వరపరుచుకొని పాడగలిగిన జనరంజక గాయని.ఫ్రెంచ్ దేశీయుల గుండెల్లో ప్రతిధ్వనించే  ఫ్రాన్స్ జాతీయ సంపద. ఫ్రెంచ్ గాయనీ […]

Continue Reading
Posted On :