నా పేరు డా. కరిమిండ్ల లావణ్య. నేను తెలంగాణ విశ్వవిద్యాలయంలోని తెలుగు అధ్యయన శాఖలో అసోసియేట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నాను. ఇంతవరకు నేను పది(10) పుస్తకాలు ప్రచురించాను. అందులో ‘పరిణతి’ అనే పేరుతో కూడిన పుస్తకం మహిళల ప్రత్యేక అధ్యయనంతో వెలువడింది. నేను రాసిన ఎం.ఫిల్. సిద్ధాంత వ్యాసం "ఆర్యసమాజ సాహిత్యంలో మహిళాభ్యుదయం" కూడా మహిళా ప్రత్యేక అధ్యయనమే. నేను వంద(100) వరకు వివిధ అంతర్జాతీయ, జాతీయ సదస్సులలో పరిశోధనా పత్రాలు సమర్పించాను. వివిధ ప్రక్రియలపై పరిశోధన వ్యాసాలు రాయడం నాకు నచ్చిన విషయం.
తెలంగాణ కవయిత్రులు -డా. కరిమిండ్ల లావణ్య తెలంగాణలో మహిళలు రాసిన కవిత్వం 19వ శతాబ్దం పూర్వార్థం నుంచే కనబడుతున్నది. నిజాం పరిపాలన ప్రభావం మహిళల విద్యపై ఉన్నప్పటికీ చదువుకున్న మహిళలు వారి కవిత్వం ద్వారా మహిళలను చైతన్యపరచాలనే ప్రయత్నం ఆనాటి కవిత్వంలో కనిపిస్తున్నది. 19వ శతాబ్దానికి పూర్వం క్రీ॥శ॥ 1230-1300 ప్రాంతంలో నివసించిన కుప్పాంబిక రంగనాథరామాయణం రాసిన గోన బుద్ధారెడ్డి కూతురు. ఈమె రాసిన పద్యాన్ని అయ్యలరాజు సంకలనం చేసిన గ్రంథంలో ఉన్నదని “తొలి తెలుగు కవయిత్రి […]
వైవిధ్యభావమాలికలు – “అమ్మ” సంగీత నృత్యరూపకాలు అత్యాధునిక తెలుగు సాహిత్యం–వస్తు, రూప పరిణామం (2000-2020) నెచ్చెలి & బెంగళూరు తెలుగు శాఖ అంతర్జాతీయ సదస్సు పత్రం -డా. కరిమిండ్ల లావణ్య మనిషి జీవితంలో బాల్యం అత్యంత ముఖ్యమైనదశ. ఈ దశపైనే వ్యక్తిత్వ వికాసం ఆధారపడి ఉంటుంది. అందుకు గేయ సాహిత్యం తోడ్పడుతుంది. దీనివల్ల బాలల్లో మానవ విలువల పరిరక్షణ పెరుగుతుంది. సృజనాత్మకత పెంపొందించబడుతుంది. భావ పరిపక్వత, మనోవికాసం కలుగుతుంది. మానవత్వ వికాసమే సాహిత్యపు ప్రధాన కర్తవ్యం. గేయ సాహిత్యం సామాజిక, సాంస్కృతిక వికాసంతో పాటు శాస్త్రసాంకేతిక విజ్ఞానాలను అందించడానికి ఉపయోగపడుతుంది. ఈ గేయాల్లో బాలసాహిత్యానికి […]