image_print

గజల్

గజల్ -జ్యోతిర్మయి మళ్ళ ప్రేమే భ్రమయని తెలియనివాళ్ళు పిచ్చివాళ్ళు భ్రమయే బ్రతుకని తెలియనివాళ్ళు పిచ్చివాళ్ళు తడిపొడి మాటలు పొడిపొడి ప్రేమను  కప్పేస్తే అది మేకప్పేనని తెలియనివాళ్ళు పిచ్చివాళ్ళు ఎడారి మనసుకు ఒయాసిస్సులా కనిపిస్తుందది ఎండమావియని తెలియనివాళ్ళు పిచ్చివాళ్ళు సుఖాలవేటలొ ప్రేమను వెతికీ దుఃఖాలకె అది అడ్రస్సవునని తెలియనివాళ్ళు పిచ్చివాళ్ళు చరమాంకమె కద మరణం అంటే ప్రేమలొ పడితే మరునిముషమె అని తెలియనివాళ్ళు పిచ్చివాళ్ళు ***** జ్యోతిర్మయి మళ్లజ్యోతిర్మయి మళ్ళ బహుముఖ ప్రజ్ఞాశాలి. తొలి తెలుగు గజల్ వాగ్గేయకారిణి. హిందీ […]

Continue Reading

గజల్

గజల్ -జ్యోతిర్మయి మళ్ళ కనిపిస్తూనే ఎంతగ బాధిస్తున్నావో తెలియదు నీకూ ప్రేమిస్తూనే ఎంతగ వేధిస్తున్నావో తెలియదు నీకూ శరీరమంతా నువ్వే నరనరాన చొరవగ చొరబడిపోయీ నివసిస్తూనే ఎంతగ ప్రవహిస్తున్నావో తెలియదు నీకూ రవంత అలికిడి విన్నా అది నువ్వేనేమో అని పొరబడితే ఊరిస్తూనే ఎంతగ ఉడికిస్తున్నావో తెలియదు నీకూ కోపము తాపము మాయం నవ్వే కళ్ళతొ నువు కనపడగానే సాధిస్తూనే ఎంతగ శోధిస్తున్నావో తెలియదు నీకూ గిరగిర తిరుగుతు నామది విహంగమయ్యెను నువు గీచిన గిరిలో విడిపిస్తూనే […]

Continue Reading

గజల్

గజల్ -జ్యోతిర్మయి మళ్ళ చూపు ఎంత అలిసిందో తోడు ఉన్న చుక్కల్ని అడుగు ఓర్పు ఎంత విసిగిందో గోడు విన్న చంద్రుణ్ణి అడుగు వేచి ఉన్న ఘడియలన్ని వెక్కిరించి వెళుతుంటె అహం ఎంత అలిగిందో కమ్ముకున్న మౌనాన్ని అడుగు ఎన్ని కోర్కెలెన్ని కలలు గంగపాలు అవుతుంటే వలపు ఎంత వగచిందో సాక్ష్యమున్న వెన్నెల్ని అడుగు ప్రతి నిముషం నరకంగా రాతిరంత గండంగా గుండె ఎంత పొగిలిందో ఆదుకున్న సూర్యుణ్ణి అడుగు మనిషె కాదు ఉత్త మాట జాడ […]

Continue Reading

గజల్

గజల్ -జ్యోతిర్మయి మళ్ళ చూపు ఎంత అలిసిందో తోడు ఉన్న చుక్కల్ని అడుగు ఓర్పు ఎంత విసిగిందో గోడు విన్న చంద్రుణ్ణి అడుగు వేచి ఉన్న ఘడియలన్ని వెక్కిరించి వెళుతుంటె అహం ఎంత అలిగిందో కమ్ముకున్న మౌనాన్ని అడుగు ఎన్ని కోర్కెలెన్ని కలలు గంగపాలు అవుతుంటే వలపు ఎంత వగచిందో సాక్ష్యమున్న వెన్నెల్ని అడుగు ప్రతి నిముషం నరకంగా రాతిరంత గండంగా గుండె ఎంత పొగిలిందో ఆదుకున్న సూర్యుణ్ణి అడుగు మనిషె కాదు ఉత్త మాట జాడ […]

Continue Reading

గజల్

గజల్ -జ్యోతిర్మయి మళ్ళ మౌనానికి మాటలనూ నేర్పిద్దాం కాస్త మనంచీకటికీ చిరుకాంతిని అరువిద్దాం కాస్త మనం కోకిలమ్మ పూలకొమ్మ కవులకెపుడు నేస్తాలుకాకి కథను కూడ రాసి చూపిద్దాం కాస్త మనం కులమతాలు పరపతులూ విభజించే జాడ్యాలునినదించే స్నేహగీతి వినిపిద్దాం కాస్త మనం లోపలొకటి పైకొకటీ కాపట్యం మనకెందుకుముసుగులేని ముఖంతోటి కనిపిద్దాం కాస్త మనం మేడలలో ప్రగతి జ్యోతి పూరిగుడిసె గతి చీకటిమనుషులంత ఒకటికాద? యోచిద్దాం కాస్త మనం *****  జ్యోతిర్మయి మళ్లజ్యోతిర్మయి మళ్ళ బహుముఖ ప్రజ్ఞాశాలి. తొలి […]

Continue Reading

గజల్

గజల్ -జ్యోతిర్మయి మళ్ళ నేను కాదు నిను తలచీ తుళ్ళినదీ నా మనసు మేను కాదు నిను వెతికీ వెళ్ళినదీ నా మనసు చంద్రుడేమొ అలుక బూనె రాత్రి కూడ బరువాయే తనువు కాదు గుబులురేగీ ఒరిగినదీ నా మనసు కనులేమో నిదురతోడు లేదంటూ ఆరోపణ రెప్ప కాదు మూతపడక నిలిచినదీ నా మనసు సింగారము హద్దుమీరె సొగసుకూడ తోడాయే సిగ్గు కాదు నునుబుగ్గల విరిసినదీ నా మనసు చుక్కలలో చంద్రుడివీ సాటిలేని ఒక్కడివీ కల్ల కాదు […]

Continue Reading

గజల్

గజల్ -జ్యోతిర్మయి మళ్ళ ఒక్కపాట పాడి తేలికవ్వగలద ఈ హృదయం లెక్కలేని విషాదాల మరువగలద ఈ హృదయం భరతమాత బిడ్డలంత తోబుట్టువులే! అందు రెక్కలేని పక్షులెన్నొ నిలువగలద ఈ హృదయం కడుపునిండి కునుకు ఉండి కుదురు లేదు! ఎందరో ఒక్కపూట కల్లాడె సహించగలద ఈ హృదయం ఇల్లు కదల కుండ నేను పదిలమె గానీ! అక్కడ డొక్కలెండి పోతుంటె భరించగలద ఈ హృదయం ఈ కరోన విలయానికి దేశమంత వొణుకుతుంటె అక్కరేమి లేక మిన్నకుండగలద ఈ హృదయం […]

Continue Reading

గజల్

గజల్ -జ్యోతిర్మయి మళ్ళ మంచిచెడులు కలిసుండును మర్మమదే తెలుసుకో హంసలాగ మంచినొకటె ఎంచడమే తెలుసుకో అల్పునిదే ఆర్భాటం సజ్జనునిది చల్లని పలుకు కంచువలె కనకం మోగదు సత్యమదే తెలుసుకో గోవుపాలు కాస్తచాలు కడివెడేల ఖరముపాలు భక్తితొ తినెడి కూడు పట్టెడు చాలునదే తెలుసుకో పరుల చోట పరుగు తగదు తగ్గి ఉండిన తప్పు కాదు కొండకూడ అద్దమందు కొంచమదే తెలుసుకో తనువు గాని కూడబెట్టిన ధనము గాని సొత్తు కాదు నీ ప్రాణమె  నీ సొత్తు కాదు […]

Continue Reading

కబళించే రక్కసి కరోనా (ఆడియో)

కబళించే రక్కసి కరోనా(ఆడియో) -జ్యోతిర్మయి మళ్ల కబళించే రక్కసి ఇది కరోనా దీని పేరు కన్నుమిన్ను కానకుండ కటువుగ కాటేస్తోంది దీన్ని.. తరిమెయ్యాలంటే పరిష్కారమొక్కటే కట్టడిగా ఉందాం కదలకుండ ఉందాం STAY HOME…. STAY SAFE…… పరదేశంలొ పుట్టింది ప్రపంచమంత పాకింది ప్రాణాలను మింగేస్తూ పరుగున ఇటు వస్తోంది దీని.. పొగరణచాలంటే పోరాటం ఒక్కటే కట్టడిగా ఉందాం కదలకుండ ఉందాం STAY HOME…. STAY SAFE…… ***** జ్యోతిర్మయి మళ్లజ్యోతిర్మయి మళ్ళ బహుముఖ ప్రజ్ఞాశాలి. తొలి తెలుగు […]

Continue Reading

గజల్

గజల్ -జ్యోతిర్మయి మళ్ళ మట్టి కాదు దేశమంటె బుధ్ధి జీవులే కదా గట్టిమేలు సాధించును ఐకమత్యమే కదా కులం మతం రంగు రూపు చూసేందుకె తేడాలూ భరతమాత బిడ్డలంత తోబుట్టువులే కదా భాషలలో వేషాలలొ భేదమెంత ఉన్ననూ దేశ సంస్కృతి చాటును భారతీయమే కదా కలం హలం వ్యాపారం వ్యాపకాలె వేరువేరు పయనమంత సాగేదీ ప్రగతి పథమునే కదా ముక్కలైననేమి రాజ్యమున్నతినాశించినపుడు మనిషిమనిషి లోనున్నది సహోదరత్వమే కదా స్థలం గళం పరిపాలన ఏదన్నది కాదు ప్రశ్న జనమంతా […]

Continue Reading

గజల్

గజల్ -జ్యోతిర్మయి మళ్ళ నీకోసమె జన్మ అంత గడపలేద ఆడదీ నీతోడిదె లోకమంటు నడవలేద ఆడదీ   నవ్వుపువ్వులు కురిపించగ నందనమే నీ ఇల్లు బాధలున్న బయటపడక వెలగలేద ఆడదీ   ఇద్దరొక్కటైనక్షణం ధన్యతగా భావించి తనువు మనసు అణువణువూ నీకివ్వలేద ఆడదీ   ముల్లు గుచ్చుకుంటె నువ్వు విలవిలలాడుదులే కడుపు చీల్చు యాతనంతా ఓర్చలేద ఆడదీ   సుఖము దుఃఖము ఏదైనా ఒడిదుడుకులు ఎన్నున్నా ఆశ నింపు జ్యోతిగా వెలగలేద ఆడదీ   అమ్మగా అక్కగా […]

Continue Reading

గజల్

గజల్ -జ్యోతిర్మయి మళ్ళ నులివెచ్చని మనప్రేమను ధ్యానంలో చూసుకోనీ చలి పెంచిన తలపులనొక కావ్యంగా రాసుకోనీ విరిచూపులు విసిరినపుడు ఎదలోపల సరిగమలు కంటి మెరుపు పూయించిన కుసుమాలను కోసుకోనీ నీ చూపులు నా తనువున తుమ్మెదలై చరించెను సిగ్గులన్ని పూవులుగా నీ పూజను చేసుకొనీ తలపు కౌగిలించినపుడు తనువణువూ తరించెను వలపునంత  దండ చేసి నీమేడలో వేసుకోనీ చెలి వలచిన ప్రేమికుడవు హరివిల్లై విరిసావు పదిలముగా నీ చిత్రమే మదినిండగ గీసుకోనీ ఇద్దరొకటై లోకమిపుడు మాయమయె చిత్రంగా […]

Continue Reading

గజల్

గజల్ -జ్యోతిర్మయి మళ్ళ  మనసునేలు మాధవుడిని తలవాలని ఉండదా ప్రాణమిచ్చు ప్రేమికుడిని కలవాలని ఉండదా    మెరుపుతీగవంటు నన్ను మురిపెముగా పిలిచితే  మురిసిపోతు చెంతచేరి నిలవాలని ఉండదా    తమలపాకులంటు కళ్ళకద్దుకుంటే పాదములు  ధన్యములై చేతులెత్తి కొలవాలని ఉండదా    (నా)నవ్వుముఖము (నీ)దుఃఖములకు ఔషధమని తలచితే  (నా)సర్వమోడియైన యైన నువ్వె గెలవాలని ఉండదా    ముద్దబంతివి పూలరెమ్మవి జాబిలి నీవంటుంటే మరలమరల ఈనేలనె(నీకొరకే) మొలవాలని ఉండదా   ***** జ్యోతిర్మయి మళ్లజ్యోతిర్మయి మళ్ళ బహుముఖ ప్రజ్ఞాశాలి. తొలి […]

Continue Reading

గజల్

గజల్ -జ్యోతిర్మయి మళ్ళ    నిన్నువిడిచి నిముషమైన నిలవడమే కష్టం నీవులేని కాలాన్నిక కదపడమే కష్టం   కన్నుకన్ను కలిసినపుడు దేహమంత పులకరమే మనసులింత ముడిపడితే మసలడమే కష్టం   మధువులొలుకు మాటలన్ని  వినుటకైతె ఆనందమే పరితపించు పెదవులనిక ఓదార్చడమే కష్టం   చెంతచేరి నిలుచువరకు లోకమంత నందనమే ఎంతబాధ దూరమగుట చెప్పడమే కష్టం   నీవునేను ఒకరికొకరు తెలియనపుడు ఇద్దరమే ఇప్పుడైతె విడివిడిగా చూపడమే కష్టం    ***** జ్యోతిర్మయి మళ్లజ్యోతిర్మయి మళ్ళ బహుముఖ ప్రజ్ఞాశాలి. […]

Continue Reading

గజల్

గజల్ -జ్యోతిర్మయి మళ్ళ    నువ్వు నేనె ప్రేమంటే కథగ నిలిచి పోవాలి నిన్ను నన్ను చూసి ప్రేమ తనువు మరిచి పోవాలి మన్ను మిన్ను కానరాని లోకంలో మన ప్రణయం బాధలన్ని తమకు తామె భువిని విడిచి పోవాలి కళ్ళు నాల్గు కలిసి కురిసె గుండెనిండ వలపువాన కుళ్ళుకున్న మేఘబాల విరిగి కురిసి పోవాలి ముద్దు ముద్దు మాటలు మన ఇద్దరికే సొంతమనీ జాములన్ని నిలిచి తుదకు రేయి అలిసి పోవాలి కట్టుబాటులేవి లేని మనసులదిది […]

Continue Reading

గజల్-అమ్మచేతి గోరుముద్ద

  గజల్-అమ్మచేతి గోరుముద్ద –జ్యోతిర్మయి మళ్ల  అమ్మచేతి గోరుముద్ద తింటుంటే ఎంత హాయి అమ్మచీర కుచ్చిళ్ళలొ దాగుంటే ఎంత హాయి   అన్నలక్కలందరూ ఆడుకుంటు ఉంటారు అమ్మ ఒడిలొ కూచునీ చూస్తుంటే ఎంత హాయి   జ్వరమొచ్చిన బాధంతా లేనె లేదు హుష్ కాకి అమ్మ భుజమ్మీద నిదురపోతుంటే ఎంత హాయి   అందమంటే అమ్మదే ఎవరు లేరు లోకంలో అమ్మతోటి ఈమాటను చెబుతుంటే ఎంత హాయి   నవ్వు వెనక ఎంత బాధ దాగుందో తెలియదులే […]

Continue Reading

గజల్-ఎదురుచూసి

గజల్-ఎదురుచూసి -జ్యోతిర్మయి మళ్ళ  ఎదురుచూసి ఎదురుచూసి కనులకేమొ అలుపయ్యెను ఎదనుతాకి మదిని కలచి  మరువలేని తలపయ్యెను సుఖమునెంచి కన్నెమనసు పంజరమున చిలకయ్యెను సఖుని  కినుక తాళలేని చెలియకిదియె అలకయ్యెను   సగమురేయి సిగమల్లెల పరిమళమే సెగలయ్యెను  మరునితెలుపు వలపేదో తనువుచేరి వగలయ్యెను  తలచినంత చెంతచేరు తరుణమేమొ కరువయ్యెను విరహబాధకోర్వలేని హ్రుదయమింక బరువయ్యెను  వెన్నెలమ్మ చందమామ సరసమపుడె మొదలయ్యెను ప్రియుని రాక కానరాక గుండెకిపుడు గుబులయ్యెను  ప్రేమచిలుకు సమయమంత కరిగితరిగి కల అయ్యెను ప్రణయసీమ సరిహద్దులొ ఆమెచూపు శిల అయ్యెను  […]

Continue Reading

ఆకాశమే ..గజల్

గజల్ -జ్యోతిర్మయి మళ్ళ ఆకాశమే ఒక కాగితం హరివిల్లు దించేసుకోనా నా మనసునే కుంచెగా ఒక బొమ్మ నే గీసుకోనా ఆ కొండ కోనల్లొ ఆగనా ఆవాగు నీరల్లె సాగనా నా కంటిలో ఆ సోయగం పదిలంగ నిధి చేసుకోనా ఆతీగ పువ్వల్లె నవ్వనా ఆ కొమ్మలో కోయిలవ్వనా ఈ గుండెతో ఆ గీతిని మురిపెంగ పెనవేసుకోనా ఓ మేఘనీలమై మారనా ఓ సంధ్య ఎరుపై జారనా  ఆ వర్ణకాంతులే నిండుగా ఒళ్ళంత నే పూసుకోనా మధుమాస […]

Continue Reading