గజల్

-జ్యోతిర్మయి మళ్ళ 

మనసునేలు మాధవుడిని తలవాలని ఉండదా

ప్రాణమిచ్చు ప్రేమికుడిని కలవాలని ఉండదా 

 

మెరుపుతీగవంటు నన్ను మురిపెముగా పిలిచితే 

మురిసిపోతు చెంతచేరి నిలవాలని ఉండదా 

 

తమలపాకులంటు కళ్ళకద్దుకుంటే పాదములు 

ధన్యములై చేతులెత్తి కొలవాలని ఉండదా 

 

(నా)నవ్వుముఖము (నీ)దుఃఖములకు ఔషధమని తలచితే 

(నా)సర్వమోడియైన యైన నువ్వె గెలవాలని ఉండదా 

 

ముద్దబంతివి పూలరెమ్మవి జాబిలి నీవంటుంటే

మరలమరల ఈనేలనె(నీకొరకే) మొలవాలని ఉండదా

 

*****

Leave a Reply

Your email address will not be published.