గజల్

-జ్యోతిర్మయి మళ్ళ 

 

నువ్వు నేనె ప్రేమంటే కథగ నిలిచి పోవాలి

నిన్ను నన్ను చూసి ప్రేమ తనువు మరిచి పోవాలి

మన్ను మిన్ను కానరాని లోకంలో మన ప్రణయం

బాధలన్ని తమకు తామె భువిని విడిచి పోవాలి

కళ్ళు నాల్గు కలిసి కురిసె గుండెనిండ వలపువాన

కుళ్ళుకున్న మేఘబాల విరిగి కురిసి పోవాలి

ముద్దు ముద్దు మాటలు మన ఇద్దరికే సొంతమనీ

జాములన్ని నిలిచి తుదకు రేయి అలిసి పోవాలి

కట్టుబాటులేవి లేని మనసులదిది సాంగత్యం

కాస్త చోటు దొరకని ఎడబాటు విసిగి పోవాలి

మల్లెమొగ్గ లాంటి ప్రేమ విచ్చుకుంది మెల్లగా

మునగదీసుకున్న సిగ్గు ముసుగు తొలిగి పోవాలి

*****

Leave a Reply

Your email address will not be published.