జగదానందతరంగాలు-7 నిజమైన పారితోషికం రచన: డాక్టర్ కొచ్చెర్లకోట జగదీశ్ గళం: శ్రీమతి తురగా కనకదుర్గా భవాని నోటిమీద వేలుపెట్టి వారించాను మాట్లాడొద్దని. స్టెతస్కోపుతో చూస్తున్నాను. బాగా గాలి పీల్చుకొమ్మని, అస్సలు మాట్లాడకూడదని ముందే హెచ్చరించాను. అయినా వినదు ఈ మామ్మ. మాట్లాడ్డం ఒక వ్యసనం తనకి. అప్పటికే హాస్పిటల్లో చేరి నెలరోజులు దాటిపోయింది. ఈసారి ఎలాగైనా టేబులెక్కించెయ్యాలి. పాపం, ఎన్నాళ్లని ఇలా పడిగాపులు పడుతుంది? బీపీ తగ్గలేదని, సుగర్ కంట్రోలవ్వలేదని అలా నానుస్తున్నాం. అవి తగ్గకపోతే ఆరోగ్యశ్రీ […]
https://youtu.be/rZEyDgFqpiM జగదానందతరంగాలు-6 హెల్మెట్ లేని ప్రయాణం -జగదీశ్ కొచ్చెర్లకోట ‘అయిపోయింది సార్, మీరిక బయల్దేరండి! స్కిన్ ఒకటేగా? వేసేస్తాను. మీకు మళ్లీ లేటవుతుంది!’ డాక్టరమ్మ ఉదారవాదానికి ఉప్పొంగిపోతూ డ్రెస్ మార్చుకోడానికి గదిలోకొచ్చాను. తెల్లారే వచ్చేశా హాస్పిటల్‌కి. ఎమర్జన్సీ అన్నాక తప్పదుగా! ఆపరేషన్ చివర్లో ఓ రెండు మూడు కుట్లుండగా పేషెంట్ పరిస్థితి బానేవుందని రూఢీ చేసుకుని ఇంటికి బయల్దేరడం మాకు మామూలే! బట్టలు మార్చుకుని అద్దం ముందు నిలబడి చూసుకున్నాను. ‘పొట్టైపోయావు కాబట్టి సరిపోయింది. ఇంకొక్క రెండంగుళాలు […]
జగదానందతరంగాలు-5 ఇష్టపది -జగదీశ్ కొచ్చెర్లకోట ప్రతి మనిషికీ ఇష్టాలనేవి చాలా ఉంటాయి. అయితే వాటిలో అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకునేవి కొన్నే ఉంటాయి. ఇవీ నా ఇష్టపది…. మనం చిన్నప్పట్నుంచీ మంచి ఆర్టిస్టు. పలకాబలపాలు, పుస్తకం పెనసళ్లు, గోడా బొగ్గులు, బోర్డు సుద్దముక్కలు.. ఇలా అనేక స్థాయిల్లో మన చిత్రకళ వివిధరూపాల్లో దర్శనమిచ్చింది. అయిదుగురిలో నాలుగోవాణ్ణి. ఇంట్లో అందరికీ ఆహారం, ఆహార్యం చూసేటప్పటికి నాన్నగారి జీతం జయమాలిని డ్రెస్సులా చాలీచాలకుండా సరిపోయేది. అంచేత మధ్యతరగతి వాళ్లకి కళలు, కలలు వుండకూడదని, ఒకవేళ వున్నా […]
జగదానందతరంగాలు-3 కొడుకు పుట్టాలనీ… -జగదీశ్ కొచ్చెర్లకోట తనింకా ఆఫీసు నుంచి రాలేదు. సాయం సంధ్యను చూద్దామని ఎస్సెల్లార్ కెమెరా పట్టుకుని డాబా మీదకి బయల్దేరబోతోంటే మా క్లాస్‌మేట్ ఫోన్ చేసింది. ‘సీజరుంది వస్తావా?’ అని! తన నర్సింగ్ హోమ్ నడిచివెళ్ళేంత దూరమే. అలా వాకింగ్ చేసుకుంటూ వెళ్ళేటప్పటికి అక్కడ దృశ్యం ఇదీ… “అలాగంటే ఎలాగండీ అత్తయ్యా? నాచేతుల్లో ఏముంటాది? దేవుడెలాగిస్తే అలాగ!” సుమతి కళ్ళల్లో సన్నటి కన్నీటిపొర అప్పుడే వేసిన లైటు వెలుగులో మెరుస్తూ కనబడుతోంది. సుమతి […]
https://www.youtube.com/watch?v=oBtGD-dbmfk జగదానందతరంగాలు-1 ఎంత బెంగనిపిస్తుంది? -జగదీశ్ కొచ్చెర్లకోట ఎంత బెంగనిపిస్తుంది? నీగది రేపట్నుంచి నీదికాదు. అక్కడికి తాతగారి సామాన్లవీ వచ్చి చేరతాయి. ప్రయాణం ఖరారైన తరవాత నీపుస్తకాల గూడొకసారి తెరుస్తావు. వ్యాపకానికి కాదు. జ్ఞాపకాలకోసం! లెక్కల పుస్తకం తెరిస్తే లెక్కలేనన్ని మధురానుభూతులు! స్నేహితులతో అరకు వెళ్ళినపుడు కొన్న నెమలీకల విసనకర్ర మొత్తం పాడైపోయినా ఒక పింఛాన్ని అత్యంత శ్రద్ధగా దాచుకున్నావు. గుర్తుందా? దానికోసం తాటాకుల్లోంచి మేతకూడా తెచ్చిపెట్టావు. నీపేరు కనుక్కోమని మొదటి పేజీ నుంచి ముప్ఫయ్యారో […]