image_print

జగదానందతరంగాలు-6(ఆడియో) నిజమైన పారితోషికం

జగదానందతరంగాలు-7 నిజమైన పారితోషికం రచన: డాక్టర్ కొచ్చెర్లకోట జగదీశ్ గళం: శ్రీమతి తురగా కనకదుర్గా భవాని నోటిమీద వేలుపెట్టి వారించాను మాట్లాడొద్దని. స్టెతస్కోపుతో చూస్తున్నాను. బాగా గాలి పీల్చుకొమ్మని, అస్సలు మాట్లాడకూడదని ముందే హెచ్చరించాను. అయినా వినదు ఈ మామ్మ. మాట్లాడ్డం ఒక వ్యసనం తనకి. అప్పటికే హాస్పిటల్లో చేరి నెలరోజులు దాటిపోయింది. ఈసారి ఎలాగైనా టేబులెక్కించెయ్యాలి. పాపం, ఎన్నాళ్లని ఇలా పడిగాపులు పడుతుంది? బీపీ తగ్గలేదని, సుగర్ కంట్రోలవ్వలేదని అలా నానుస్తున్నాం. అవి తగ్గకపోతే ఆరోగ్యశ్రీ […]

Continue Reading

జగదానందతరంగాలు-6(ఆడియో) హెల్మెట్ లేని ప్రయాణం

https://youtu.be/rZEyDgFqpiM జగదానందతరంగాలు-6 హెల్మెట్ లేని ప్రయాణం -జగదీశ్ కొచ్చెర్లకోట ‘అయిపోయింది సార్, మీరిక బయల్దేరండి! స్కిన్ ఒకటేగా? వేసేస్తాను. మీకు మళ్లీ లేటవుతుంది!’ డాక్టరమ్మ ఉదారవాదానికి ఉప్పొంగిపోతూ డ్రెస్ మార్చుకోడానికి గదిలోకొచ్చాను. తెల్లారే వచ్చేశా హాస్పిటల్‌కి. ఎమర్జన్సీ అన్నాక తప్పదుగా! ఆపరేషన్ చివర్లో ఓ రెండు మూడు కుట్లుండగా పేషెంట్ పరిస్థితి బానేవుందని రూఢీ చేసుకుని ఇంటికి బయల్దేరడం మాకు మామూలే! బట్టలు మార్చుకుని అద్దం ముందు నిలబడి చూసుకున్నాను. ‘పొట్టైపోయావు కాబట్టి సరిపోయింది. ఇంకొక్క రెండంగుళాలు […]

Continue Reading

జగదానందతరంగాలు-5(ఆడియో) ఇష్టపది

జగదానందతరంగాలు-5 ఇష్టపది -జగదీశ్ కొచ్చెర్లకోట ప్రతి మనిషికీ ఇష్టాలనేవి చాలా ఉంటాయి. అయితే వాటిలో అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకునేవి కొన్నే ఉంటాయి.  ఇవీ నా ఇష్టపది…. మనం చిన్నప్పట్నుంచీ మంచి ఆర్టిస్టు. పలకాబలపాలు, పుస్తకం పెనసళ్లు, గోడా బొగ్గులు, బోర్డు సుద్దముక్కలు.. ఇలా అనేక స్థాయిల్లో మన చిత్రకళ వివిధరూపాల్లో దర్శనమిచ్చింది. అయిదుగురిలో నాలుగోవాణ్ణి. ఇంట్లో అందరికీ ఆహారం, ఆహార్యం చూసేటప్పటికి నాన్నగారి జీతం జయమాలిని డ్రెస్సులా చాలీచాలకుండా సరిపోయేది. అంచేత మధ్యతరగతి వాళ్లకి కళలు, కలలు వుండకూడదని, ఒకవేళ వున్నా […]

Continue Reading

జగదానందతరంగాలు-4 (ఆడియో) తిరుపతి

జగదానందతరంగాలు-4 తిరుపతి -జగదీశ్ కొచ్చెర్లకోట “లేవాల్లేవాలి! మళ్ళా క్యూ పెరిగిపోతుంది. నాలుగున్నర రిపోర్టింగ్ టైము!” తను అలా తరమకపోతే ఓపట్టాన లేచేవాళ్ళెవరూ లేరిక్కడ.  “పొద్దున్నే లేవాలన్నప్పుడు పెందరాళే పడుకోవచ్చు కదండీ! ఈకబుర్లు ఎప్పుడూ వుండేవే!” అని తనంటూనేవుంటుంది.  కానీ ఇల్లొదిలి, ప్రాక్టీసొదిలి, ఇహలోకంనించి ఇక్కడికొచ్చాకా కూడా పిల్లలతో సరదాగా కబుర్లు చెప్పుకోకపోతే పాతకం కాక మరేఁవిటి? ఇంటిదగ్గరుంటే లేచినవెంటనే కాల‘అ’కృత్యాలు మొదలవుతాయి..అదేనండీ…ఫేస్‌బుక్కూ, వాట్సప్పూ చూసుకోవడం, పేపర్ చదువుతూ కూర్చోడం! ఇలా నెట్వర్కుల్లేని చోటకొస్తే కాలకృత్యాలు పద్ధతిగా జరుగుతాయి.  […]

Continue Reading

జగదానందతరంగాలు-3(ఆడియో) కొడుకు పుట్టాలనీ…

జగదానందతరంగాలు-3 కొడుకు పుట్టాలనీ… -జగదీశ్ కొచ్చెర్లకోట తనింకా ఆఫీసు నుంచి రాలేదు. సాయం సంధ్యను చూద్దామని ఎస్సెల్లార్ కెమెరా పట్టుకుని డాబా మీదకి బయల్దేరబోతోంటే మా క్లాస్‌మేట్ ఫోన్ చేసింది. ‘సీజరుంది వస్తావా?’ అని!  తన నర్సింగ్ హోమ్ నడిచివెళ్ళేంత దూరమే. అలా వాకింగ్ చేసుకుంటూ వెళ్ళేటప్పటికి అక్కడ దృశ్యం ఇదీ… “అలాగంటే ఎలాగండీ అత్తయ్యా? నాచేతుల్లో ఏముంటాది? దేవుడెలాగిస్తే అలాగ!” సుమతి కళ్ళల్లో సన్నటి కన్నీటిపొర అప్పుడే వేసిన లైటు వెలుగులో మెరుస్తూ కనబడుతోంది. సుమతి […]

Continue Reading

జగదానందతరంగాలు-2(ఆడియో) ఎంత స్వేచ్ఛ!

జగదానందతరంగాలు-2 ఎంత స్వేచ్ఛ!  -జగదీశ్ కొచ్చెర్లకోట నులివెచ్చనైన నీళ్ళల్లో సుతిమెత్తని గోడలమధ్య నాయిష్టానికి నేను యథేచ్ఛగా ఈదులాడేంత…. పైగదిలోంచి లయబద్ధంగా వినబడుతున్న జతిస్వరాన్ని నేనొక్కతెనే వినేటంత.. ఒకటారెండా? నలభైవారాలపాటు నిరాటంకమైన ప్రయాణంలో నాఅంతట నేనే ఎదిగేటంత…. ఎక్కడినుంచో జలపాతాల గలగలల్లా ధ్వనులు. నాకోసం తనుతాగే ఫలరసాలన్నీ గొంతులోంచి జారి, నాచుట్టూ కాసారాల్లా అలుముకుంటాయి బద్ధకంతో కాళ్ళుచాపి నేను తన్నిన ప్రతిసారీ పులకింతకు లోనయ్యే ఆనందం నేనెలా చూడాలి? నన్నుతలచి మైమరిచే ఆ కన్నుల వెన్నెలల్ని లోపలుండి చూసేదెలా? అప్పుడప్పుడు ఒకానొక మృదువైన స్పర్శ నా గది […]

Continue Reading

జగదానందతరంగాలు-1(ఆడియో) ఎంత బెంగనిపిస్తుంది?

https://www.youtube.com/watch?v=oBtGD-dbmfk జగదానందతరంగాలు-1 ఎంత బెంగనిపిస్తుంది? -జగదీశ్ కొచ్చెర్లకోట   ఎంత బెంగనిపిస్తుంది? నీగది రేపట్నుంచి నీదికాదు.  అక్కడికి తాతగారి సామాన్లవీ వచ్చి చేరతాయి.  ప్రయాణం ఖరారైన తరవాత నీపుస్తకాల గూడొకసారి తెరుస్తావు.  వ్యాపకానికి కాదు. జ్ఞాపకాలకోసం!  లెక్కల పుస్తకం తెరిస్తే లెక్కలేనన్ని మధురానుభూతులు! స్నేహితులతో అరకు వెళ్ళినపుడు కొన్న నెమలీకల విసనకర్ర మొత్తం పాడైపోయినా ఒక పింఛాన్ని అత్యంత శ్రద్ధగా దాచుకున్నావు. గుర్తుందా? దానికోసం తాటాకుల్లోంచి మేతకూడా తెచ్చిపెట్టావు.  నీపేరు కనుక్కోమని మొదటి పేజీ నుంచి ముప్ఫయ్యారో […]

Continue Reading