image_print

గంగమ్మ కన్నంతా దున్నపోతు మిందే (కథ)

 గంగమ్మ కన్నంతా దున్నపోతు మిందే (కథ) -ఎండపల్లి భారతి ”మేయ్ ఇంటికోమనిసిని  బండమీదకు రమ్మన్నారు జాతర గురించి మాట్లాడాలంట నేను పోతాండ” అనేసి నిదర మొగాన నీల్లు సల్లు కొన్ని తువ్వాలి గుడ్డ బుజానేసుకుని  పన్లన్నీ నా మీద సూపడ ఏసి ఎలిపాయ నా మొగుడు  ! అత్త చెప్పిన పని చేయాలని ఇసురురాయి కాలి మింద తోసుకొని కుసున్నంట వొగాయమ్మ. అట్లా ఈ గంగజాతర  అయిపోయినంతవరకు ఇంట్లోపనులు బయటి  పనులు ఒగొటి గూడా జేయకుండా తప్పించుకుంటాడు నా మొగుడు .               […]

Continue Reading
Posted On :

మరో గుండమ్మ కథ

        మరో గుండమ్మ కథ -అక్షర గుండమ్మగారంటే ఎవరో కాదండీ, మా అత్తగారికి అత్తగారైన ఆదిలక్ష్మి అమ్మగారే. వయస్సు ఎనభై ప్లస్సు. మొత్తం ఇంటికి బాసు. ఏమంటారా? ఆ పరమాత్మ ఆనతి లేనిదే ఆకైనా కదులుతుందేమోకానీ ఈ ఆదిలక్ష్మిగారి అనుమతి లేనిదే మా ఇంట్లో మంచినీళ్లయినా పుట్టవు. అదేమంటారా? అది ఆవిడ అదృష్టం. మన ప్రాప్తం. ఏదేమైనా ఆవిడకు ఆఇంట్లో ఉన్న పవర్ చూసి, ఆవిడ ఆకారానికి తగ్గట్టుగా గుండమ్మ అని, బిగ్ బాస్ అని పేర్లు పెట్టాము. […]

Continue Reading
Posted On :

కలలు అలలు (కథ)

కలలు అలలు -శాంతి ప్రబోధ పాపాయి షో గ్రౌండ్స్ కి బయలుదేరింది. ఆ గ్రౌండ్స్ లో పిల్లలకోసం మంచి పార్క్ , రకరకాల ఆట వస్తువులు ఉన్నాయి . బయట చల్లటి చలిగాలి వీస్తున్నది.  అందుకే వాళ్ళమ్మ పాపాయికి  చలికోటు , బూట్లు , సాక్స్ వేసింది. సాధారణంగా ప్రతి రోజూ  పాపాయి బయటికి వెళ్తుంది . అలా పార్కుకో, గ్రౌండ్స్ కో వెళ్లి అక్కడ కొంత సేపు గడపడం పాపాయికి చాలా ఇష్టం. ఆ పార్కుల్లో […]

Continue Reading
Posted On :

నిన్ను చూడకుంటే నాకు బెంగ (కథ)

నిన్ను చూడకుంటే నాకు బెంగ -జానకీ చామర్తి తలుపు తీయంగానే విసురుగా తాకిన హేమంతగాలికి కట్టుకున్న నూలు చీర ఆపలేక వణికింది విజయ. అమ్మ చీర , రాత్రి రాగానే పెట్లోంచి తీసి కట్టేసుకుంది .. చూసుకు నవ్వుకుంది, పెద్దవాళ్ళచీరలా ఉందని.నీళ్ళ పొయ్యి ముందుకు వచ్చి , మోకాళ్ళు మునగదీసుకు కూచుని , అరచేతులు చాపి మంట వేడికి వెచ్చపెట్టి చెంపలకు తాకించుకుంటోంది. నీళ్ళకాగులో నీళ్ళు కాగే కళపెళా చప్పుడు వింటూ కేకెట్టింది, “ నీళ్ళు కాగాయి, ఎవరు పోసుకుంటారు “ […]

Continue Reading
Posted On :