image_print

నిన్ను చూడకుంటే నాకు బెంగ (కథ)

నిన్ను చూడకుంటే నాకు బెంగ -జానకీ చామర్తి తలుపు తీయంగానే విసురుగా తాకిన హేమంతగాలికి కట్టుకున్న నూలు చీర ఆపలేక వణికింది విజయ. అమ్మ చీర , రాత్రి రాగానే పెట్లోంచి తీసి కట్టేసుకుంది .. చూసుకు నవ్వుకుంది, పెద్దవాళ్ళచీరలా ఉందని.నీళ్ళ పొయ్యి ముందుకు వచ్చి , మోకాళ్ళు మునగదీసుకు కూచుని , అరచేతులు చాపి మంట వేడికి వెచ్చపెట్టి చెంపలకు తాకించుకుంటోంది. నీళ్ళకాగులో నీళ్ళు కాగే కళపెళా చప్పుడు వింటూ కేకెట్టింది, “ నీళ్ళు కాగాయి, ఎవరు పోసుకుంటారు “ […]

Continue Reading

పరాయి దేశంలో కరోనా (మలుపు ) (కథ)

పరాయి దేశంలో కరోనా -జానకీ చామర్తి కుటుంబజీవనంలో గృహిణి గా ఆడవారిపాత్ర మీద నాకెప్పుడూ విశ్వాసము గౌరవము ఎక్కువే. నన్ను నేను ఎప్పుడూ తక్కువ చేసుకోను. నా వాళ్ళతో కలసి నడిచే ఆ ప్రయాణంలో , ఎప్పుడూ వెనుకంజ వేయకూడదనుకుంటూ అందులో భాగంగా ఫిట్ గా ఉండటానికి రోజూ సాయంకాలాలు నడకకి వెడతా. అది నాకు శారీరక ఆరోగ్యమూ, మానసిక ఉల్లాసమూ ఇస్తుంది.  నిండుగా వర్షపు నీరు కలగలిపి ప్రవహిస్తోంది ఆ ఏరు.  ఏటి ఒడ్డున వేసిన […]

Continue Reading

జానకి జలధితరంగం-11

జానకి జలధితరంగం-11 -జానకి చామర్తి బొమ్మల కొలువు లోకాలను సృజించే శక్తి  విధాతకే ఉండవచ్చు గాక , కాని సృజనాత్మకత స్త్రీల సొత్తు. ఆషామాషీగా , అలవోకగా తలచుకున్నంతలో తలపుల కలబోతగా , మమతల అల్లికగా , పొంగిన పాలవెల్లిలా, అమ్మతనపు కమ్మని కలగా , వేళ్ళతో మీటిన వీణానాదంలా, నైపుణ్యపు గణి గా , ఒడి నిండిన అమృతఫలం లా .. కేవలం సున్నిపిండి నలుగుతో స్నానాలగదిలో పార్వతమ్మ చేతిలో రూపుదిద్దుకున్న బాలుని బొమ్మ  కన్నా […]

Continue Reading

కథాపరిచయం -నేను చంపిన అమ్మాయి -ఆనంద

కథాపరిచయం నేను చంపిన అమ్మాయి – ఆనంద -జానకి చామర్తి ఆ తరం కన్నడకథకులలో మాస్తిగారి తరువాత ఎక్కువ ప్రజాదరణ పొందిన రచయిత అజ్జింపుర సీతారామం ( ఆనంద)గారు. వారు వ్రాసిన కథలలో మంచిపేరు పొందిన కథ  ‘ నాను కొంద హుడిగి’ (నేను చంపిన అమ్మాయి) . చాలా ముఖ్యమైన కథ కూడా. ఈ కథను తెలుగులోకి శర్వాణి గారు అనువదించారు. ఇంకో వ్యక్తి నమ్మకాల పట్ల తీర్పు నివ్వడం  వల్ల కలిగిన దుష్పరిమాణాన్ని ధ్వనింపచేసే […]

Continue Reading

జానకి జలధితరంగం-10

జానకి జలధితరంగం-10 -జానకి చామర్తి శూర్పణఖ పురాణాలు పుణ్యగ్రంధాలు చదవడం పారాయణం చేయడం వల్ల తప్పకుండా భక్తిభావము  మంచి పని చేస్తున్నామన్న తృప్తి  భగవంతునకు చేరువగా ఉంటున్నామన్న సంతోషము  కలుగుతాయి. అది అందరకీ అనుభవైక వేద్యమే. కాని , లౌకిక జీవితంలో దారితప్పకుండా చేయగలిగే జీవన ప్రయాణంలో అవి మనకి ఎంత తోడు , ఎంత ఉపయోగం. గాంధీజీ తనకు ఏదైనా సమస్యో ధర్మ సంకటమో ఎదురైనపుడు “ భగవద్గీత” తీసి , అందులో ఏదొక శ్లోకం […]

Continue Reading

“అరికాళ్ళ కింది మంటలు” – శ్రీపాద సుబ్రమణ్య శాస్త్రి గారి కథ పై సమీక్ష

      “అరికాళ్ళ కింది మంటలు” (శ్రీపాద సుబ్రమణ్య శాస్త్రి గారి కథ పై సమీక్ష) -జానకి చామర్తి ఆ అమ్మాయి తీరి కూచుని తన కష్టాలు ఏమీ చెప్పుకోలేదు ఆ కథలో. అసలు కూచోడానికి తీరికేది? ఇక ఎవరికైనా చెప్పుకోవడం కూడానూ.. పెద్దక్క పిల్లాడికి జుబ్బా , చిన్నక్క కి రవిక , అప్పటి కప్పుడు కుట్టి పెట్టాలి . పైగా వారి ఎకసెక్కపుమాటలూ పరోక్ష బెదిరింపులూ భరించాలి. మీ అమ్మనాన్నా పూసుకుంటారు ,పునిస్త్రీ సేవ […]

Continue Reading

జానకి జలధితరంగం-9

జానకి జలధితరంగం-9 -జానకి చామర్తి అహల్య ఏకాంతవాసము ఏకాంతవాసము ( ఐసోలేషన్) . ప్రస్తుతం ఈ మాట ఎక్కువ వినిపిస్తోంది. తమని తాము వ్యాధి నుంచి విముక్తి పొందడానికి,  పరిరక్షించుకోవడానికి , మిగతావారికి కూడా మాటల ద్వారానూ తమ నడవడిక ద్వారా సోకకుండా ఉండటానికి విధించుకున్న  ఒక నియమము . ఆ వ్యాధి ఎటువంటిదైనా కావచ్చు గాలిలా తాకేది కావచ్చు , స్పర్శ తో అంటేది కావచ్చు , బలహీనమై మనసును కట్టుపరచుకోలేక సామాజిక దూరాన్ని లేదా […]

Continue Reading

జానకి జలధితరంగం-8

జానకి జలధితరంగం-8 -జానకి చామర్తి ఉత్తర మడచిపెట్టిన పువ్వుల పొట్లం లాటివారు ఆడపిల్లలు. యుక్తవయసు వచ్చేటప్పటికి పొట్లం విచ్చి వాసనలు వెదజల్లినట్టు , ఆశలు పరిమళిస్తాయి.  ఈ విచ్చుకునే కలలు కోరికలకి పేదా గొప్పా భేదాలు లేవు, ఉద్యోగి నిరుద్యోగి అనే తారతమ్యం లేదు , లోకం చూసిన ధీర  అమాయకపు ముగ్ధ అనే వేరు భావమూ లేదు. కన్నెపిల్ల కలలు అందరకీ సమానం గానే కలుగుతాయి. కాలం సమయమూ తేడా.. అది అప్పుడెప్పటికాలమో, ఇది ఇప్పటి […]

Continue Reading

జానకి జలధితరంగం-7

జానకి జలధితరంగం-7 -జానకి చామర్తి శబరి ఆతిధ్యం నడిచారుట వారు ఎంతో దూరం .. కొండలు ఎక్కారు, నదులు దాటారు , మైదానాలు గడచి దుర్గమమైన అడవులను  అథిగమించి నడిచారుట వారు ,  అన్నదమ్ములు. కోసల దేశ రాజకుమారులు , దశరథ రాజ పుత్రులు రామలక్ష్మణులు , ఎంతెంతో దూరం నుంచి నడచీ నడచీ వస్తున్నారు. వారి కోసమే ఎదురు చూస్తూ ఉన్నది .. శబరి. వయసుడిగినది జుట్టు తెల్లబడ్డది దేహము వణుకు తున్నది. కంటిచూపు చూడ […]

Continue Reading

జానకి జలధితరంగం-6

జానకి జలధితరంగం-6 -జానకి చామర్తి స్వీయనియంత్రణ చేసుకున్న సీత చెల్లి.. నలుగురితో కలవకుండా ఏకాంతంగా జీవితం గడపడం . కరోనా మహమ్మారి వచ్చింతరువాత ఇదొక మంత్రం అయింది. కొంతకాలం ఏకాంతంలో ఉండు , తరువాత ఎల్లకాలమూ సుఖసంతోషమే.  బాహ్యంగా ఏర్పడిన కల్లోలం ఇది..ఒక్కరమే ఉండకపోతే మహమ్మారి వ్యాధికి ఆహుతి అవడమే కాక వ్యాపింపచేస్తాము అన్న భయంతో స్వీయ నియంత్రణం చేసుకుంటున్నాము. చెప్పకపోయినా మనకందరకూ తెలుసు అది ఎంత కష్టమైయినదో.. అనుభవించి గ్రహిస్తున్నాము. ఒక్కక్షణం ఆలోచించండి..తప్పనిది ఇది మనకి. […]

Continue Reading

జానకి జలధితరంగం-5

జానకి జలధితరంగం-5 -జానకి చామర్తి దమయంతి చిన్నప్పుడు రవివర్మ చిత్రం చూసాను, అందమైన మనోహరమైన మహిళ , వయ్యారంగా నిలుచుని , ఓ పక్కగా వాలి, చేతిని ఒక స్తంభానికి ఆన్చి, అందుమీద కిటికీ పక్కగా వాలిన ఒక హంస తో సల్లాపము ఆడుతున్న చిత్రమది. వేసుకున్న ఆభరణాలు రాజసమూ చూస్తే , రాజకుమారి లాగనో, రాణీ లాగానో తోచుతుంది. ముఖములో కోమలత్వం కంటే గట్టిదనమూ, తేలివితేటలు , పరిణితి కనిపించింది, చిక్కని ఆమె గుబురు కనుబొమలు […]

Continue Reading

జానకి జలధితరంగం-4

  జానకి జలధితరంగం-4 -జానకి చామర్తి సత్యభామ మగువలు నేర్వని విద్య గలదే ముద్దారనేర్పించగన్ , యుద్ధవిద్య మాత్రం తక్కువా..ఆనాడే నిరూపించేసింది సత్య. ఆత్మాభిమానం , పట్టుదల , అనురాగం , చిటికెడు అతిశయం , గోరంత గర్వం (supiriority) , సమయస్పూర్తి, ధైర్యం ..ఈ కాలం ఆడవారికి ఆద్యురాలు కాదూ ఆ శ్రీకృష్ణుని ముద్దుల భార్య .  సాక్షాత్తు కృష్ణ భగవానుడే మెచ్చాడు , ఆవిడ సహకారం పొందాడు , ఆవిడకి విలువ, గౌరవం ఇచ్చాడు. […]

Continue Reading

జానకి జలధితరంగం-3

జానకి జలధితరంగం- 3 -జానకి చామర్తి  సావిత్రి  సావిత్రి నన్నెప్పుడూ ఆశ్చర్య పరుస్తుంది, తలచుకున్నప్పుడల్లా……ఏమిటండీ ఆ ధైర్యం ,ఎంత నమ్మకం ,మృత్యువు వెంటాడింది ,యముడితో మౌనంగా దెబ్బలాడింది ,ప్రియమైనవాడికోసం పోరాడింది . అవడానికి సత్యవంతుడు పతే, కాని తన ఆనందాలకు కేంద్ర బిందువు , ఒకరకంగా సావిత్రి సంతోషానికి మమతకు భవిష్యత్ జీవితానికి అతనే మూలకారణం. ఆ కారణాన్ని గెలుచుకోవడానికి ఎంత తెగువతో పోరాడిందీ , ఎంత నిష్ఠ చూపిందీ, ఎంత ఏకాగ్రంగా సాధించిందీ . పద్ధతి […]

Continue Reading

జానకి జలధితరంగం-2

జానకి జలధితరంగం- 2 -జానకి చామర్తి గోదా దేవి ఒక్కొక్క పూవే అందిస్తోంది తండ్రి విష్ణుచిత్తునకు, గోదా , ఏకాగ్రంగా, ఆ పూవుల అందమూ రంగు పరీక్షిస్తూ ,  ఏ పూల కి జత చేసి ఏ పూలు కట్టితే అధిక చక్కదనమో, మరువము దవనమూఆకుపచ్చకి ఈ పచ్చనిచామంతి పూలు నప్పునో నప్పవో అనుకుంటూ..నందివర్ధనాల మధ్య మందారాలు కూర్చిన దండ అందమా కాదా.. అనుకుంటూ.. విల్లిపుత్తూరు తోట పూవులు ఇవి, తులసీమాలలు అయితే కో కొల్లలు .. […]

Continue Reading

జానకి జలధితరంగం-1

జానకి జలధితరంగం- 1 -జానకి చామర్తి అపర్ణ కావ్యనాయికలు పురాణ నాయికలు  , స్త్రీల గురించి పుస్తకాలలో చదువుకుంటున్నపుడు  తెలుసుకుంటున్నపుడు ..ఒక స్ఫూర్తి వస్తుంది ,  కలగా కమ్మగా ఉంటుంది, వారిలోన లక్షణాలకు మురిపం వస్తుంది, అలా ఉండలేమా అనిపిస్తుంది.  మంచివిషయాలు , అనుసరించదగ్గ విషయాలకే, ఇప్పటికాలానికిసరిపోనివి,సంఘవ్యతిరేకమైనవాటిగురించి కానే కాదు.  చదివిన కధలూ కావ్యాలూ  మానసికానందమే కాక , చేయగలిగే సాయం కూడా ఏమిటని. కొందరు స్త్రీనాయికలు లో గల  శ్రద్ధ పట్టుదల ప్రేమ వాత్సల్యము పోరాటము […]

Continue Reading