పరువు (నెచ్చెలి-2025 పోటీలో ప్రత్యేక బహుమతి పొందిన కథ) -చిట్టత్తూరు మునిగోపాల్ అడవి కలివిపండు మాదిరి నల్లగా నిగనిగలాడే బుగ్గలు లోతుకు వెళ్లిపోయాయి. చిన్న పిల్లోళ్లు కాగితం మింద బరబరా తీసిన పెన్సిలు గీతల్లా కళ్ళకింద చారలుతేలాయి. ఒత్తుగా రింగులు తిరిగి తుమ్మెదల గుంపులా మాటిమాటికీ మొగం మీదవచ్చి పడే జుట్టు పలచబడి నుదురును ఖాళీ చేసి వెనక్కి వెళ్ళింది. నల్ల కలువలాగా ఎప్పుడూ నవ్వుతో విరబూసి కనిపించే మొగం వాడి వేలాడిపోతోంది. ఆ కళ్ళనిండా ఏమిటవి.. […]
తాగని టీ -చిట్టత్తూరు మునిగోపాల్ అలారం మోగింది. దిగ్గున లేచింది సుష్మ. ఉదయం ఐదవుతోంది. బాత్రూంకి కూడా వెళ్లకుండా గేటు బీగాలు తీసి వాకిట్లో నీళ్లు చల్లి ముగ్గేసింది. అక్కడి నుంచి వంటింట్లోకి పరుగు. స్టవ్వుమీద ఒకవైపు టీ పెట్టింది. మరోవైపు ఇడ్లి సాంబారుకోసం పప్పు గిన్నెలో వేసి నీళ్లు పోసింది. ఫ్రిజ్లో నుంచి బెండకాయలు బయటకు తీసి కత్తిపీట ముందు కూర్చుంది. ఇంతలో పొయ్యిమీది టీ పొంగడంతో ఉన్నపళంగా పైకి లేచి మంట తగ్గించింది. మళ్ళీ […]
నీవే తల్లివి… తండ్రివి -చిట్టత్తూరు మునిగోపాల్ “అవునా, మీకు పెళ్లయిందా… అప్పుడే.” ఆశ్చర్యపోయాడు రామన్. ” అంతేనా… ఇద్దరు పిల్లలు కూడా. పాపేమో నైన్త్, బాబేమో సెవెంత్.” సుజాత. నోరు తెరిచేశాడు రామన్. చివరికి నిరాశగా… “అలా కనిపించరే” అన్నాడు. “అవునా, మా ఫ్రెండ్సు కూడా అదే చెబుతారు” మురిసిపోయింది. “మీ హస్బెండ్ ఏమి చేస్తారు ?” అడిగింది.. అంతదాకా వారి మాటలు వింటూ మౌనంగా కూర్చున్న మధుమిత. “ఏదో కంపెనీలో నైట్ వాచ్మేన్ గా పని […]