మనిషితనం (కవిత) -కె.రూప ఒంటరితనం కావాలిప్పుడు నన్ను నాకు పరిచయం చేసే చిన్న చప్పుడు కూడా వినపడని చోటుఏ వస్తువు కనబడని చోటునాలో మెదులుతున్న శ్వాసనుకూడా దూరం చేసేదినన్ను నన్నుగా గుర్తించేది ౧ ఏ సంద్రపు ఘోషలు వినలేని నా మది నాకు వినపడేలా నాలో లేని తనాన్ని ఏదో వెతుక్కుని నాలో నింపుకోవలసిన సమయమిప్పుడు!౨బిగుతై పోతున్న గుండె బరువుల నుండి సేదతీరాలనే సంకల్పంతో౩ఉదయపు వేకువల చప్పుళ్ళనుండి మొదలురాత్రి వెన్నెలకు కురిసే తడి కూడా అంటనంత నా అడుగుల చప్పుడు కూడా నన్ను గుర్తించనంతగాఏ శబ్దమో ..ఏ రాగమో ..వినపడనంత దూరంకొండవాలుగా […]
ఆమె (కవిత) -కె.రూప ఆమెను నేను…… పొదరిల్లు అల్లుకున్న గువ్వ పిట్టను లోగిలిలో ముగ్గుని గడపకు అంటుకున్న పసుపుని వంటింటి మహారాణిని అతిథులకు అమృతవల్లిని పెద్దలు మెచ్చిన అణుకువను మగని చాటు ఇల్లాలుని ఆర్ధిక సలహాదారుని ఆశల సౌధాల సమిధను చిగురించే బాల్యానికి వెలుగురేఖను స్వేచ్ఛనెరుగని స్వాతంత్ర్యాన్ని కనుసైగలోని మర్మాన్ని భావం లేని భాద్యతను విలువ లేని శ్రమను ఆమెను నేను… కల్లోల సంద్రంలో కన్నీటి కడలిగా ఎన్ని కాలాలు మారిన నిలదొక్కుకోవాలనే అలుపెరుగని పోరాటం సమానత్వం […]