ఖాళీ (కవిత)

జయశ్రీ మువ్వా

ఏమైనా చెప్పాలనుకుంటున్నావా..?

ఏదని చెప్పాలి..

ముగించాలనుకున్నపుడు కామా కోసం వెతకులాట ఎందుకు?

చదవబడని పేజీలన్నీ వదిలెళ్ళు

నేనూ వదిలేస్తాలే 

అందమైన కాగితం పడవలుగా –  

అన్నట్టూ…

అద్దాన్ని ఓ సారి తుడుచుకో 

బొట్టుబిళ్ళలు అంటించిన మరకలుంటాయేమో

కన్నీటి చారల మొకాన్ని కడుక్కున్నట్టు  ఫ్రెష్ గా-

అవునూ..

ముందు డికాక్షన్ పెట్టుకో 

చేతికందించే కాఫీ కప్పు టేస్ట్ మారినా,

వంటగదిలో గాజుల మెలోడి వినపడ్డా పట్టించుకోకు

ఇలాంటివేగా ఎన్ని చెప్పినా…

నాకంటూ ఏమి  చెప్పాలని వుండని నీకు

***

అలవాటు మారే సమయం పెన్సిల్ తో రాసుకున్న 

కొన్ని నిశ్శబ్దాలు, కొన్ని గాయాలు

టైం పర్ఫెక్ట్ ఎరేజర్ కదా..

*****

ఫోటో ఆర్ట్: రమేష్ పొతకనూరి

Please follow and like us:

2 thoughts on “ఖాళీ (కవిత)”

  1. చక్కని భావవేశం వ్యక్తమైన కవిత..జయశ్రీ …..’ టైం పర్ఫెక్ట్ ఎరేజర్ కదా’..’బొట్టుబిళ్ళలు అంటించిన మరకలుంటాయేమో’.. ముగించాలనుకున్నపుడు కామా కోసం వెతకులాట’ వంటి పద,వాక్య ప్రయోగాలు చాలా బాగున్నాయ్..’అభినందనలు

Leave a Reply

Your email address will not be published.