image_print

త్రిపురనేని రామస్వామిచౌదరి

మత,మూఢ విశ్వాసాల తుప్పు వదిలించిన ‘త్రిపురనేని’ -పి. యస్. ప్రకాశరావు బాల్యంలో పందుంపుల్ల కోసం చెట్టుదగ్గరకెళ్ళినపుడు అక్కడ వెండ్రుకలూ నిమ్మకాయలూ వంటివి కనిపిస్తే చిరుతిండికి పనికొస్తాయని డబ్బుల్నీ,ఆడుకోడానికి పనికొస్తుందని వేపబెత్తాన్ని తీసుకుని అందరూ నోరెళ్ళబెట్టేలా చేసిన ఆకతాయి, తాను మిఠాయి తింటుంటే “నాకూ కొనిపెట్టవా ? ” అని జాలిగా అడిగిన బ్రాహ్మణ బాలుడికి సరే పోనీ పాపం అని కొని పెడుతుంటే ఆ బాపనకుర్రాడు “నువ్వు డబ్బులు మాత్రమే ఇవ్వు. ఆ మిఠాయిని తాకవద్దు” అంటే […]

Continue Reading

డా.బాబా సాహెబ్ అంబేద్కర్

“డా .బాబా సాహెబ్ అంబెడ్కర్” – వసంతమూన్. పుస్తక సమీక్ష -పి. యస్. ప్రకాశరావు కులం కారణంగా క్షవరం చేయడానికి ఏ మంగలీ ముందుకు రాకపోతే, వాళ్ళ అక్క ఆయన జుట్టుని కత్తిరించినప్పుడూ, మాస్టారు బోర్డుమీద రేఖాగణిత సిద్ధాంతాన్ని రుజువు చేయమని అంబేద్కర్ ని పిలిచినప్పుడు, క్లాసులోని విద్యార్థులు బ్లాక్ బోర్డు దగ్గర పెట్టుకున్న తమ టిఫిన్ డబ్బాలు మైల పడిపోతాయని వాటిని తీసేసుకున్నప్పుడూ, వర్ణ వివక్ష ఎంత భయంకరమైనదో ఆయనకు అర్ధమైంది . ఆయన ఓసారి […]

Continue Reading

మరోసారి గిడుగు రామమూర్తి

గిడుగు రామమూర్తిగ్రాంథిక భాషావాదుల గుండెల్లో పిడుగు మన ‘గిడుగు’ ( తెలుగుభాషా దినోత్సవం సందర్భంగా ) -పి. యస్. ప్రకాశరావు పర్లాకిమిడి రాజభవనంలో ఓ వింత ఆచారం ఉండేది. భోగి, సంక్రాంతి పర్వదినాల సందర్భంగా కనుమనాడు పశువుల పండుగ చేస్తూ పశువులకు వాతలు వేసేవారు. పనిలో పనిగా వాళ్ళదగ్గర పనిచేసే ఉద్యోగులకు కూడా వేసేసేవారు. రాజాగారి తమ్ముడికి ట్యూటర్ గా ఉన్న గిడుగురామమూర్తి గారికి కూడా చురకలు వేయడానికి పరికరాలూ నిప్పుల కుంపటీ పట్టుకుని సేవకులు వస్తే […]

Continue Reading

ఒక హిజ్రా ఆత్మకథ (ఎ.రేవతి)

ఒక హిజ్రా ఆత్మకథ (ఎ.రేవతి) (పరిచయం) -పి. యస్. ప్రకాశరావు హిజ్రాలను రైళ్ళలోనో, బజారులో వ్యాపారస్తుల దగ్గర చప్పట్లు కొట్టుకుంటూ డబ్బు లు వసూలు చేసుకునేటప్పుడో చూడటమే కానీ వాళ్ళ జీవితం గురించీ, వాళ్ళ మనో వేదన గురించీ ఈ పుస్తకం చదివే వరకూ నాకు తెలియదు. దొరైస్వామి మగపిల్లవాడిగా తమిళనాడులోని ఓ గ్రామంలో, తిండికీ బట్టకీ లోటు లేని కుటుంబంలో పుట్టాడు. ముగ్గురన్నలూ ఒక అక్కా ఉన్నారు. ఇతనికి పదో ఏటనుంచే తన అక్క బట్టలు […]

Continue Reading

ఒక సెక్స్ వర్కర్ ఆత్మకథ (నళినీ జమీలా)

ఒక సెక్స్ వర్కర్ ఆత్మకథ (నళినీ జమీలా) -పి. యస్. ప్రకాశరావు ‘ఏస్త్రీ కూడా కావాలని సెక్స్ వర్కర్ గా మారదు. పరిస్థితుల ద్వారా తయారు చేయబడుతుంది. చాలా మంది హైస్కూల్ చదువు పూర్తిచేసినవాళ్ళే. ఏ ఉద్యోగమూ దొరకానివాళ్ళూ, భర్తల దౌర్జన్యాలకు గురైనవాళ్ళూ, కట్నం సమస్యతో వీధిపాలైనవాళ్ళూ వేరే మార్గం దొరక్క ఈ వృత్తిలోకి వచినవాళ్ళే ‘ అంటూ తాను సెక్స్ వర్కర్ గా మారడం వెనుకనున్న నేపధ్యాన్ని వివరించింది కేరళలోని త్రిసూర్ కి చెందిన నళినీ […]

Continue Reading

ఒక బానిస (ఫ్రెడరిక్ డగ్లస్) ఆత్మకథ

ఒక బానిస (ఫ్రెడరిక్ డగ్లస్) ఆత్మకథ -పి. యస్. ప్రకాశరావు స్పార్టకస్, ఏడుతరాలు,స్వేచాపదం, అంకుల్ టామ్స్ కేబిన్ వంటి నవలలు నచ్చిన వారికి “ఒక బానిస ఆత్మకథ” తప్పకుండా నచ్చుతుంది. 1817-18 లలో పుట్టి అమెరికాలో బానిసజీవితం గడిపిన ఫ్రెడరిక్ డగ్లస్ ఆత్మకథ ఇది. తన బానిస జీవిత అనుభవాలనూ, అక్కడి నుంచి పారిపోయిన విధానాన్నీ, క్రైస్తవుల దుర్మార్గాలనూ కళ్ళకు కట్టినట్టు వర్ణించి “ఎవరి సాయంతో పారిపోయానో చెబితే వారికి అపకారం” అన్నాడు డగ్లస్. అమెరికాలో ఉన్నవాళ్ళు […]

Continue Reading

‘నిర్జన వారధి’. కొండపల్లి కోటేశ్వరమ్మ గారి ఉద్యమ అనుభవాలు

 ‘నిర్జన వారధి’ . కొండపల్లి కోటేశ్వరమ్మ గారి ఉద్యమ అనుభవాలు (8 మార్చి ,2022 మహిళా దినోత్సవం సందర్భంగా) -పి. యస్. ప్రకాశరావు “రహస్యస్థావరాలలో పనిచేయడానికి స్త్రీ ఉద్యమకారులతో బాటు నేను కూడా వెళ్ళాల్సి వచ్చింది. ఏలూరులో ఒక డెన్ లో తలదాచుకున్నాం. అక్కడి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. చలసాని జగన్నాధరావుగారు “తప్పించుకునే పరిస్థితి వస్తే  నేను యాచించే బ్రాహ్మణుడిలాగా, నువ్వు భర్త నుంచి వేరైన నా కుమార్తెగా చెప్పుకుని భిక్షాటన చేస్తున్నట్టుగా తప్పుకుందాం. పొట్లాలకు కట్టిన […]

Continue Reading

టాలుస్టాయి జీవితమూ సాహిత్యమూ (రంగనాయకమ్మ)

టాలుస్టాయి జీవితమూ సాహిత్యమూ (రంగనాయకమ్మ) -పి. యస్. ప్రకాశరావు టాలుస్టాయి రచనలు ఇంతకు ముందు చదివినవారు కూడా ఇది చదివితే కొత్త విశ్లేషణలు తెలుస్తాయి. ఆయన మొత్తం రచనలు ఎన్ని? ఆయన నేపథ్యం, స్వభావం, భావాలూ ఎటు వంటివి? ఆయన సాహిత్యం పై లెనిన్ విశ్లేషణ ఏమిటి? వంటివి తెలుసు కోవాలనుకునే వారికి ఈ పుస్తకం చాలా ఉపయోగపడుతుంది. 20 వేల ఎకరాల జమీందారీ కుటుంబంలో పుట్టిన టాలుస్టాయి పేదల కోసం సాటి జమీందార్లతో జీవితమంతా పోరాడిన […]

Continue Reading