గజల్

-జ్యోతిర్మయి మళ్ళ

ఆకాశమే ఒక కాగితం హరివిల్లు దించేసుకోనా

నా మనసునే కుంచెగా ఒక బొమ్మ నే గీసుకోనా

ఆ కొండ కోనల్లొ ఆగనా ఆవాగు నీరల్లె సాగనా

నా కంటిలో ఆ సోయగం పదిలంగ నిధి చేసుకోనా

ఆతీగ పువ్వల్లె నవ్వనా ఆ కొమ్మలో కోయిలవ్వనా

ఈ గుండెతో ఆ గీతిని మురిపెంగ పెనవేసుకోనా

ఓ మేఘనీలమై మారనా ఓ సంధ్య ఎరుపై జారనా 

ఆ వర్ణకాంతులే నిండుగా ఒళ్ళంత నే పూసుకోనా

మధుమాస సుధ అంత గ్రోలనా మది అంత పులకింత తేలనా

వసంతమంత ఇంతగా నాచెంత ఉంచేసుకోనా

ఓమావి మాలై మురియనా ఓ రంగవల్లై విరియనా

ఇంటింట వెలిగేటి  ఓ జ్యోతినై మీ కంట నను చూసుకోనా 

*****

Please follow and like us:

2 thoughts on “ఆకాశమే ..గజల్”

  1. జ్యోతిర్మయి సరస్వతీ వరప్రసాదితురాలు. ఆమెను అభినందిస్తున్నాను.

    1. ధన్యవాదనమస్సులు జయదేవ్ గారు

Leave a Reply

Your email address will not be published.