ప్రమద

 ప్రీతీ షెనొయ్ 

-సి.వి.సురేష్ 

భారతీయ రచయిత్రి.  భారత దేశం లోని నూరు మంది ప్రముఖ  సెలబ్రిటీ లలో ప్రీతీ షెనాయ్ ఒకరని  ఫోర్బ్స్ పత్రిక ప్రకటించింది. ఇంత గొప్ప పేరు ప్రఖ్యాతులు గాంచిన  భారతీయ రచయిత్రి ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఆమె పేరు మార్మోగుతోంది. బ్రాండ్స్ అకాడమీ వారు ప్రకటించిన ఇండియన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు గ్రహీత ప్రీతీ షెనొయ్. అలాగే, ఆమె ఢిల్లీ మేనేజ్మెంట్ వారు ప్రకటించిన బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డు ను కూడా ఆమె స్వంతం చేసుకొంది. టైమ్స్ అఫ్ ఇండియా, కస్మోపోలిటిన్ పత్రిక, డైలీ న్యూస్ అండ్ ఎనాలిసిస్  సంస్థలు కూడా ప్రీతీ షెనొయ్ ని ఆకశమంత ఎత్తు ఎత్తారు.

బ్రిమింగ్హం లో జరిగిన సాహిత్య పండగ లో ఆమె ప్రధాన వక్త గా తన ఉపన్యాసాన్ని అందించారు. తన జీవితం లో జరిగిన ఎదురైనా ప్రతి సంఘటన ను సూక్ష్మంగా పరిశీలించి ఆ విషయాన్ని కథగా మలచడం ఆమెకు వెన్నతో పెట్టిన విద్య. ఈ నేరేషన్ పై అనేక పత్రికలు ఆమెను కొనియాడాయి. ఈమె రాసిన బబుల్ గమ్స్ అండ్ కాన్డీస్ అనే చిన్న కథల సమాహారం ప్రపంచ వ్యాప్తంగా పేరు గాంచింది. కథ రాయడం ఎలాగో ఆమెకు పూర్తి అవగాహన ఉంది. అలాగే పాఠకుడిని ఎలా మెప్పింప చేయాలో కూడా ఆమెకు బాగా తెలుసు.  “వేకప్ లైఫ్ ఈజ్ కాలింగ్ ” అనే బుక్ లో  గొప్ప ఇన్స్పిరేషనల్ కథనాలను ప్రచురించారు. గొప్ప పేరు ప్రఖ్యాతులు గాంచిన ఈ పుస్తకం తో పాటు ప్రీతీ రాసిన అనేక బుక్స్ మార్కెట్ లో హాట్ కేకుల్లుగా అమ్ముడు పోతున్నాయి.

ప్రేమ పై మీ అభిప్రాయం ఏమి? అని అడిగితే, అందుకు సమాధానంగా ప్రీతీ షెనొయ్ చెపుతూ, అంటోని డిసెయింట్ –ఎక్సుపెరి చెప్పిన మాటను గుర్తు చేసారు. “LOVE DOES NOT CONSISIT OF GAING AT EACH OTHER, BUT LOOKING OUTWARD IN THE SAME DIRECTION”  ఈ కోట్ ను తాను అధికంగా నమ్ముతున్నట్టు చెప్పారు. పుస్తకాలు చదవడం ఎంత ముఖ్యం అంటే, తాను శ్వాసించడం ఎంత ముఖ్యమో అంత ముఖ్యం అని ఆమె తన ఇంటర్వ్యూ లో చెప్పారు. వర్ధమాన రచయతలకు మీరిచ్చే సందేశం ఏమని అడిగితే,  రాయడానికి మొదలు పెట్టాలంటే మొదట కనీసం వంద బుక్స్ చదివిన తర్వాత రాయడం మొదలు పెట్టాలి అనీ, ఇక రాయడం మొదలు పెట్టాక, ప్రతి రోజు రాయాలని ఆమె సలహా ఇచ్చారు.

preethi shenoy : author || THE SOMETHING IN HIS EYES ||

తెలుగు లోకి అనుసృజన : సి.వి.సురేష్ || అతడి కళ్ళల్లోని దేదో ||

..

అతడి కళ్ళల్లో ఏదో ఉంది

అది నా ఆత్మతో నేరుగా మాట్లాడుతుంది

అవి పాడుతున్నాయి…

నేను వింటున్నాను.

..

అతడి కళ్ళల్లో ఇంకేదో ఉంది.

అది నా సమ్మతి కోసం ప్రాధేయపడుతుంది  

అవి  అర్ధిస్తు౦టాయి

నేను లొంగిపోతాను.

..

అతడి కళ్ళల్లో మరేదో ఉంది

అది నా పేగుల్ని మెలిపెడుతుంది

అవి  అర్థం చేసుకొమ్మని కోరుతాయి

నేనూ అందుకు ప్రయత్నిస్తాను

..

మా మధ్య మాటలు ప్రవహిస్తాయి.

ఆహ్లాదకరమైన అంశాలు వస్తూ పోతాయి

మా దారులు ఎప్పుడూ దారి తప్పవు

మేమిద్దరం విభిన్న ప్రపంచాలకు చెందినవాళ్లము

అతడి చుట్టూ ఏం జరుగుతుందో నాకిప్పుడు తెలియదు 

నేనైతే ఉన్నాను, కానీ, నే ఎప్పటిలా లేను.

అందంగా నిర్మితమైన అతడి  జీవితం కోసం

కావాల్సినంతా  అతడి దగ్గరుంది.

అయినా, కవిత్వం యొక్క విలాసాన్ని కొనగల శక్తి లేదు.

..

ఇదిలా ఉంటే,  

అతని జీవితంతో అతనికి  తీరిక లేనప్పుడు  

అతడి కళ్ళల్లో ఉన్నదేదో ….

నన్ను నిరంతరంగా వెంటాడేది.

మరీ ముఖ్యంగా ….

రాత్రుళ్ళలో  నిద్రెప్పుడు అంతు చిక్కదో..

అప్పుడు నేనైతే ఓ అవగాహననూ,  ఒక అనుమతినీ

చాల తపనతో కోరుతాను.

కానీ, చాల మంది ఆలపించని ఓ పాట ను కోరుతారు. 

ఒరిజినల్ పోయెమ్

There is something in his eyes

That speaks to my soul

They sing

And I listen.

..

There is something in his eyes

A plea for acceptance

They beg

And I yield.

..

There is something in his eyes

That wrenches my gut

They want understanding

And I try to.

..

We exchange words

Pleasantries and part

Our paths to never cross again

We inhabit two different worlds.

He is oblivious to me now

I was but an aberration

To his well -structured life

He has a living to make

And cannot afford the luxury of poetry.

And so while he busies himself making a living,

The something in his eyes

Continues to haunt me

Especially at nights

When sleep is elusive.

And I seek frantically

The understanding, the acceptance

But most of all — the unsung song.

*****

 

Please follow and like us:

8 thoughts on “ప్రమద – ప్రీతీ షెనొయ్ ”

 1. చాలా మంచి భావోద్వేగమున్న కవితని, దానిని అందించిన కవయిత్రిని ఎంచుకున్నందుకు అభినందనలు సర్… ఇక అనుసృజన మీదైన మార్కు తో చక్కగా సాగింది… ఆడవారి మనసుని పడిగట్టడం కష్టం అంటారు.. మీరు ఆ విషయంలో కూడా కృతకృత్యులు అయ్యారు…. అభినందనలు….

  1. చాలా సంతోషం.. సుధ ప్రతి స్టాంజా లో వేదన..కాసేపట్లో ఊరట…ఇలా సాగిన ఈ కవిత పై మీస్పందన అమూల్యం..

 2. అపూర్వమైన కవయిత్రి కవితకి అద్భుతమైన అనువాదం సురేష్ గారు…. ఇంకొంచెం పొడిగింపు చేస్తే… కంప్లీట్ గా అనిపించేదేమో

  1. ప్రత్యేక ఆత్మీయత స్పందనకు. ధన్యవాదాలు అన్న

 3. something అనే ఉన్నచోట్ల.. ఎదో, ఇంకేదో, మరేదో… అనడం స్వేచ్ఛానువాదానికి అందాన్ని తెచ్చింది.. ఇలాంటి చోట్లే అనువాద కవి ప్రతిభ తెలియవస్తుంది..
  C v Suresh Bro.. కవయిత్రి పరిచయమూ, అనువాదమూ రెండూ నిండుగా ఉన్నాయి. అభినందనలు 💐 💐

  1. అన్నా… మీ హృదయ పూర్వక ప్రశంసకు ప్రత్యేక నెనర్లు….

 4. 👌👌తెలుగులో అనుసృజన చేసిన,Cv sir కి,ధన్యవాదాలు, అభివందనలుముందుగా.. ఈ, రచయత్రి గురించి ఏమి తెలియదుమాకు. ఇప్పటి వరకు.vari కవితలు చదువుతుంటే.. వారి books. అన్ని, చదవాలని అనిపిస్తున్నది

  1. చాలా ధన్యవాదాలు పద్మ గారు మీ ఆత్మీయ స్పందనకు…

Leave a Reply to సి.వి.సురేష్ Cancel reply

Your email address will not be published.