
“నెచ్చెలి”మాట
“ట్వంటీట్వంటీ”
-డా|| కె.గీత
ఓహోయ్ కొత్తసంత్సరం!
అంతేకాదు స్పెషల్ వత్సరం!
“ట్వంటీట్వంటీ”
“రెండువేలాఇరవై”
“రెండుసున్నారెండుసున్నా”
ఏవిటో స్పెషల్?
అదేనండీ ఈ సంఖ్యతో చిన్న తిరకాసుంది!
మాములుగా తారీఖు వెయ్యాల్సొస్తే సంత్సరంలో చివరి రెండంకెలు రాయడం రివాజు కదా!
లేదా
మనకు నాలుగంకెలు రాయడం బద్ధకం కదా!!
ఇక “ట్వంటీట్వంటీ” లో బద్ధకానికి సెలవు చెప్పాల్సిన సమయం వచ్చింది!
“ఏవిటీ ఈవిడ చెప్తే నేను చేసెయ్యలా?”
“రెండంకెలు రాస్తే వచ్చే నష్టమేమిటో!”
“అబ్బా, నాకు బద్ధకానికే బద్ధకం వచ్చేటంత బద్ధకం”
…..
ఈ ఆలోచనలన్నీ పక్కన బెట్టి ఒకసారి ఆలోచిద్దాం-
ఇప్పుడు రెండువేలాఇరవైయ్యవ సంత్సరంలో చివరి రెండంకెలు ఏవిటి?
అహ- నాకు తెలీకడుగుతాను, ఏవిటీ ఇదో పెద్ద ప్రశ్నా? ఇందులో సందేహం ఏవుందండీ!
ఆగండాగండి. అక్కడికే వస్తున్నా-
సందేహం కాదు. చిక్కు.
మీరు సరిగ్గానే చదివేరు. ఈ సంత్సరంలో ఇదే మరి చిక్కు.
ఏవిటీ చివరి రెండంకెలు చిక్కా?
అయితే మొదటి రెండంకెలు ఏవిటీ? నిక్కా?
నిక్కు కాదండీ. సిసలైన చిక్కు.
ఏవిటంటే-
ఇప్పుడు మీరు జనవరి పదో తేదీన ఇల్లో వాకిలో కొనుక్కురంటున్నారనుకుందాం!
అగ్రిమెంటు కాగితాల్లో తేదీ ఏమని రాస్తారు?
“జనవరి10/ 20”
“01/10/20”
“10/01/20”
“10 జనవరి 20”
అనో కదా!
అదే మరి చిక్కు.
చిక్కే కాదు. చిక్కున్నర కూడాను!
మీరలా రాసి అటు వెళ్లగానే ఎవరైనా చివరి రెండంకెల పక్కన 01 నుంచి 19 వరకూ ఏ సంఖ్యయినా రాసేరనుకుందాం!
మీరు అగ్రిమెంటు చేసుకున్న సంవత్సరమే మారిపోతుందన్నమాట!
అదన్నమాట సంగతి!!
ఆ తరువాత హతవిథీ! అని నెట్టిబాదుకోకుండా-
కాబట్టి “సొంత బద్ధకం కొంత మానుకు నాలుగంకెలు వెయ్యవలెనోయ్” అని ఫిక్సయిపోండి ఈ ఏడాదికి!
ఇదలా పక్కనుంచితే కొత్తసంత్సరానికి గాను కొన్ని “నెరవేర్చగల” శపధాలు కూడా పన్లో పని చేసుకుంటే వచ్చే ఏడాదికి జీవితంలో కొన్నయినా సాధించగలుగుతాం!
ఏవంటారు?
నాకు తెలుసులే ఇంకేవంటారు!
“నూతన సంవత్సర శుభాకాంక్షలు” అని కదా-
అయ్యో ముందు మీరే చెప్పేసేరా!
పర్లేదులెండి-
“మిత్రుల మధ్య పట్టింపులెందుకు?”
అదే మరి నెచ్చెలి మాట కూడాను!!
అదేనండీ-మర్చిపోకండీ నాలుగంకెలు-
“హ్యాపీ న్యూ ఇయర్ ట్వంటీట్వంటీ”
“రెండువేలాఇరవయ్యవ సంవత్సరపు శుభాకాంక్షలు”
*****

డా|| కె.గీత పూర్తిపేరు గీతామాధవి. వీరు “నెచ్చెలి” వ్యవస్థాపకులు, సంపాదకులు. తూ.గో.జిల్లా జగ్గంపేటలో జన్మించారు. ప్రముఖ కథా రచయిత్రి శ్రీమతి కె. వరలక్ష్మి వీరి మాతృమూర్తి. భర్త, ముగ్గురు పిల్లలతో కాలిఫోర్నియాలో నివాసముంటున్నారు.
ఆంధ్ర విశ్వవిద్యాలయంలోఇంగ్లీషు, తెలుగు భాషల్లో ఎం.ఏ లు, తెలుగు భాషా శాస్త్రం లో పిహెచ్.డి చేసి, 10 సం. రాల పాటు మెదక్ జిల్లాలో ప్రభుత్వ కళాశాల అధ్యాపకురాలిగా పనిచేసారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నించి 2006 లో “ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ” పొందారు.అమెరికాలో ఇంజనీరింగ్ మేనేజ్ మెంట్ లో ఎం.ఎస్ చేసి, ప్రస్తుతం సాఫ్ట్ వేర్ రంగంలో భాషా నిపుణురాలిగా పనిచేస్తున్నారు.
ద్రవభాష, శీతసుమాలు,శతాబ్దివెన్నెల, సెలయేటి దివిటీ, అసింట కవితాసంపుటులు, సిలికాన్ లోయ సాక్షిగా కథాసంపుటి, వెనుతిరగనివెన్నెల నవల, At The Heart of Silicon Valley -Short stories (2023),Centenary Moonlight and Other Poems(2023) ప్రచురితాలు. నెచ్చెలి ప్రచురణ “అపరాజిత” – గత ముప్పయ్యేళ్ల స్త్రీవాద కవిత్వం (1993-2022) పుస్తకానికి సంపాదకులు & ప్రచురణకర్త. ‘యాత్రాగీతం’ ట్రావెలాగ్స్, ‘కంప్యూటర్ భాషగా తెలుగు’ పరిశోధనా వ్యాసాలు కొనసాగుతున్న ధారావాహికలు. అజంతా, దేవులపల్లి, రంజనీ కుందుర్తి, సమతా రచయితల సంఘం అవార్డు, తెన్నేటి హేమలత-వంశీ జాతీయ పురస్కారం, అంపశయ్య నవీన్ పురస్కారం మొ.న పురస్కారాలు పొందారు.
టోరీ రేడియోలో “గీతామాధవీయం” టాక్ షోని నిర్వహిస్తున్నారు. తానా తెలుగుబడి ‘పాఠశాల’కు కరికులం డైరెక్టర్ గా సేవలందజేస్తున్నారు. కాలిఫోర్నియా సాహితీ వేదిక “వీక్షణం”, తెలుగు రచయిత(త్రు)లందరి వివరాలు భద్రపరిచే “తెలుగురచయిత” వెబ్సై ట్ వ్యవస్థాపకులు, నిర్వాహకులు.

మీకు కూడా 2020 నూతన సంవత్సర శుభాకాంక్షలు డాక్టర్ గీత గారు.నెచ్చెలి ఈ సంవత్సరం మరింత మంది అభిమానాన్ని పొందాలని కోరుకుంటూ..
Thank you so much andi 🙏