ప్రమద

కమలాదాస్- కవిత్వం లో ఒక ట్రెండ్ సెట్టర్ !

సి.వి.సురేష్ 

కమలాదాస్  ఒక  ట్రెండ్ సెట్టర్.  ఆమె కవిత్వం ఒక సెన్సేషన్.   1934 లో పున్నయుకులం , త్రిస్సూర్ , కొచ్చిన్ లో పుట్టిన ఆమె  31 మే 2009  లో  తన 75 ఏట పూణే లో మరణించారు.  ఆమె కలం పేరు మాధవ కుట్టి.  భర్త పేరు కే. మాధవదాస్.  ముగ్గురు పిల్లలు. మాధవదాస్ నలపాట్, చిన్నేన్ దాస్, జయసూర్య దాస్, తల్లి పేరు బాలామణి అమ్మ, తండ్రి వి.ఎం. నాయర్.. 

తన జీవితాన్ని కవిత్వం చేసి, ప్రపంచాన్ని మెప్పించిన రచయత్రి కమలాదాస్.  ఆమె కవిత్వం పాఠకులకు బోర్ కలిగించ కుండా చేయగల నేర్పరి. ఆమె   వ్యతిరేక ధోరణుల్లోనే కాకుండా, మొనాటమస్ గా, నిజమైన ప్రేమ ఎలా పొందగలరు? నిజమైన ప్రేమ ఎలాంటిది? ఎలా ఒక స్త్రీ తన భర్త దగ్గర అవ్యాజ్యమైన ప్రేమ పొందగలదు? అనే అంశాలపై కూడా కవిత్వం రాసారు..

 

చిన్నతనం లో  అంటే, 15 ఏళ్లకే కమలాదాస్ కు వివాహం కావడం, భర్త పూర్తిగా వ్యాపారం, ఫైల్స్, వ్యవహారాలలో మునిగిపోవడం తో అక్కడా ఆమెకు వాత్సల్యపూరిత ప్రేమ దొరకలేదు. కేవలం శారీరక సుఖం కోసం తప్ప అతడు ఇంకే ప్రేమను అతడు చూపించలేదు. 

ఇలాంటి స్థితి ని కూడా కమలాదాస్ నిర్భయంగా చెప్పుకొచ్చారు. తన భర్త పైన ఆమె రాసిన పదాలు చూడాలి….

 

నా భర్త తన ఆఫీస్ పని లో పూర్తిగా నిమగ్నమై ఉంటాడు. ఆ ఆఫీస్ పని తర్వాత రాత్రి విందు. అటు తర్వాత సెక్స్. ఇది తప్ప అతడికి ఒక సముద్రాన్ని చూడాలని కానీ, మైదానాల్లో మేస్తున్న గేదె లను కానీ చూడాలని అనుకోడు.”

 

అటు చిన్న తనం లో కూడా తన తండ్రి నుండి కానీ, పెళ్లి అయ్యాక తన భర్త దగ్గర కానీ, ఎలాంటి ప్రేమను ఆమె పొందక పోవడం ఒక గొప్ప విషాదం. అలాంటి వాటిని కూడా కమలాదాస్ తన ఆటో బయోగ్రఫీ లో నిర్భయంగా చెప్పుకొచ్చింది. 

“నా నాన్న ప్రేమ పూరితమైన వాడు కాదు. దాదాపు మేము మా తండ్రి దగ్గర నిర్లక్ష్యం చేయబడినాము. అలా నిర్లక్ష్యం చేయబడినామని కూడా మాకు తెలుసు. పిల్లలుగా మేము అశ్రద్ధ కు గురి కావడం తో, వయసులో భోగలాలసత కు దగ్గరయ్యాము. అప్పుడు గాఢమైన ప్రేమ బంధం మాలో పెరిగింది. అది ఎలాంటి ప్రేమ కోసం పరితపించందంటే, కుష్టు రోగి ని తోపుడు బండి పై వేసి, బిక్షాటన కు వెళ్ళే సమయం లో కుష్టు రోగి తన కామవాంఛ తో సహచరి కోసం ఎలా పరితపిస్తాడో అలా మేము వయసులో తపన పడినాము.

 

తన ఆటో బయోగ్రఫీ లో ఈ మాటలు కమలాదాస్ రాసుకున్నారు. ఆ ప్రేమ భావన ఒక్క తన నాన్నమ్మ దగ్గర తప్ప ఇంకెవరి దగ్గరా ఆమె పొందలేదు. 

ఇలాంటి సంక్లిష్ట పరిస్థితుల్లో కమలాదాస్, పంజరం లో చిక్కుకున్న నిస్సహాయ పక్షి లాగా తన జీవితం మారింది. ప్రేమ, శృంగార రస కవిత్వం కమలాదాస్ ప్రత్యేకం ఆ రకమైన కవిత్వాన్ని తన కవిత్వ ప్రయాణం లో అనేక కవితలలో గమనించవచ్చు

కమలాదాస్ యొక్క మూడు కవితా సంపుటాల్లో,  ప్రేమ, మొహం, కామం, శృంగారం, లైంగిక అవయవ శృంగార తత్వము, ఇవన్నీ కనిపించినా, విశృంఖలత్వానికి కానీ, శారీరక సంపర్కం కోసం కానీ ఆమె తపించినట్లు అనిపించదు.

 

కమలాదాస్ కవిత్వాన్ని మనం  మూడు రకాలుగా చూడవచ్చు. 

మొదటి తరహా కవిత్వంలో… , తనకు అత్యంత దగ్గర ఉన్నవాళ్ళు, ఆమె అభిమానించే వాళ్ళ పైన ప్రేమ ను కురిపిస్తూ ఉంటాయి. “MY GRAND MOTHE’S HOUSE, “LOVE”, “AFTERWARDS” ఈ కోవ లోకి చెందినవి. 

రెండవ తరహా కవిత్వం లో…. ప్రేమ పట్ల తన భ్రాంతి, భ్రమ, తనకున్నఇష్టం ను తెలిపే కవితలు. “THE FREAKS” “A RELATIONSHIP” “LOUD POSTERS” “THE BANGLES”, “THE SEA SHORE” ఈ రెండవ కోవ లోకి చెందినవి.

ఇక మూడవ తరహా కవిత్వం లో …..పూర్తిగా శృంగారం, రతి, లైంగిక అవయవ లైంగిక అవయవ శృంగార తత్వం తో నిండి ఉంటాయి. “IN LOVE” “SUMMER IN CALCUTTA” AND “FOREST FIRE” ETC., వీటిని చెప్పుకోవచ్చు. 

ఆమె కవిత్వం లో ప్రేమ వివిధ రూపాల్లో మనకు కనిపిస్తాది

 

THE LOOKING GLASS అనే కవితలోని కొన్ని వాక్యాలను ఇక్కడ పొందు పరుస్తున్నాను.

నిన్ను మగాడు ప్రేమించేలా చేయడం సులభం 

ఒక స్త్రీ గా నీ కోరికల పట్ల నీవు చాలా నిజాయతీగా ఉండటమే.

అతని తో పాటు నీవూ అద్దం ముందు నగ్నంగా నిల్చో…

అప్పుడు అతడిలోని ధృడమైనదాన్ని చూసుకొంటాడు 

అలాగే అనుకుని నమ్ముతాడు.

అతడి కంటే, నీవు చాలా మృదువుగా, యవ్వనంగా ,

చాల ప్రియమైనదానివని నమ్ముతాడు.

నీ ప్రశంసలను అతడు ఒప్పుకొంటాడు 

అతడి అవయవాల చక్కటి సౌష్టవాన్నీ 

షవర్ స్నానంతో ఎర్రబడ్డ కళ్ళను గమనించు 

స్నానపు గదిలో అతడి వయ్యారపు నడకనూ

అతడి మొలకు చుట్టుకొన్న తుండుగుడ్డను జారవిడిచే 

విధానాన్ని చూడు.

శరీరాన్ని కుదుపుగా అదురుస్తూ….

అతడు చేసే మూత్ర విసర్జనను కూడా పరిశీలించు 

అతడి లోని అరుదైన అంశాలన్నీ 

అతన్ని మగాడిగా, నీ మనిషిగా నిలుపుతాయి..

అతడికి అన్నీ అర్పించు…

నిన్ను ఏ అంశాలయితే స్త్రీగా నిలుపుతాయో, ఆ ప్రతి అంశాన్ని 

అతడికి బహుమతిగా అర్పించు..

నీ పొడవాటి వెంట్రుకల పరిమళాన్నీ 

నీ చనుల మధ్య పట్టిన స్వేదపు కస్తూరి పరిమళాన్నీ 

హఠాత్తుగా వచ్చే నీ నులువెచ్చటి బహిష్టురక్తాన్నీ 

నీ నిర్విరామ దేహ కాంక్షల్నీ అతడికి బహుమతిగా 

అందించు…

ఓహ్ నిజమే…

మగాడిని ప్రేమించేలా చేయడం సులభం…

కానీ, ఆ తర్వాత అతడు లేని జీవితాన్ని 

ఎదుర్కోవాల్సి రావచ్చు..”

 

(ఆంగ్లం లో..)

(Getting a man to love you is easy 

Only be honest about your wants as 

Woman, stand nude before the glass with him

So that he sees himself the stronger one

And believes it so, and you so much more

Softer, younger, lovelier…Admit your 

Admiration. Notice the perfection

Of his limbs, his eyes reddening under

Shower, the shy walk across the bathroom floor,

Dropping towels and jerky way he

Urinates. All the fond details that make him male and your only man!

 

And further :

 

Gift him all,

Gift him what makes you woman, the scent of 

Long hair, the musk of sweat between the breasts,

The warm shock of menstrual blood, and all your 

Endless female hungers. Oh yes , getting

A man to love is easy, but living 

Without him afterward may have to be 

Faced…

 

నిన్ను నేను కనుగొనే వరకూ 

నేను కవితలు రాసాను

చిత్రాలు గీసాను 

స్నేహితులతో వ్యాహాళి కి బయటకు వెళ్ళేదాన్ని 

ఇప్పుడు నిన్ను నేను ప్రేమిస్తున్నాను 

నా జీవితం, ముసలి సంకర జాతి కుక్క లాగా 

ముడుచుకొని పడిఉంది. అదే నీలోని సంతృప్తి.”

(Until I found you

I wrote verse, drew pictures

And, went out with friends 

For walks

Now that I love you 

Curled like an old mongrel

My life lies, content ..

In you…. 

(summer in culcutta P. 31) 

….

….

పై కవితా వాక్యాల్లో ఎలాంటి సంఘర్షణ కానీ,, శృంగారం కోసం కానీ, ఇతరుల కోసం పరితపించినట్లు కానీ, ఒక ఫిర్యాదు చేసినట్లు కానీ, ఎవరినైనా ఛాలెంజ్ చేసినట్లు కానీ మనకు కనిపించదు. ఈ తరహా కవిత్వం ఆమె లో కొద్ది రోజులే కనిపించింది. 

 

అటు తర్వాత, ఆమె మగవాడి పైన కసి, అతడి సెక్స్ పటిమ పైన ఛాలెంజ్ లు, ఒక రకమైన రివెంజ్ మనస్తత్వం తన కవితల్లో విస్తారంగా చూపారు.  ఏ మగాడు అయితే తనను వేధోంచాడో, అంతే రీతిలో మగాడి పట్ల ఒక కసి ని పెంచుకుంది. ఆడపిల్లకు పెళ్లి , బాధ్యతలు తప్పని సరి అని ఒక వైపు చెపుతూనే, ఇంకో వైపు, శూన్యమైన, నిస్సారమైన వివాహ బంధాల్లోకి తోసే మగ జాతి పట్ల ఆమె తీవ్రస్థాయిలో విరుచుకు పడతారు. తన కవితల్లో ఈ స్థాయి దాడి మనకు కనిపిస్తాది. 

A RELATIONSHIP అనే కవితలో వాక్యాలు గమనించండి. 

 

అవును…

నా కాంక్షలే అతడిని మగవాడిగా, అందంగా నిలిపింది 

కాబట్టే, అది చివరకు మేము కలిసేలా చేసింది

అతడి ఆకారం ద్వారా కానీ, అతడి స్పర్శ ద్వారా గానీ,

లేక, జాలిగుణం కల అతడి పెదాల కఠినత్వం గానీ 

నిజంగా నన్ను ద్రోహం చేశాయా?

అవును, భౌతికంగా అతడు నన్ను ద్రోహం చేయలేదు..

కానీ, కేవలం అతడి మాటలతోనే..

…………

నా దేహ స్పృహ పదే పదే చెపుతోంది 

నా జీవన విశ్రాంతి గానీ, నా నిద్ర కానీ, నా శాంతి కానీ

చివరకు నా చావు కానీ, ఇంకెక్కడో కాదు 

ఇదిగో ఇక్కడే నా ద్రోహి చేతుల్లోనే “

 

(…yes

It was my desire that made him male

And beautiful, so that when at last we

Met, to believe that once I knew not his

Form, his quiet touch, or the blind kindness

Of his lips was hard indeed Betray me?

Yes, he can but never physically:

Only with words……

……………………………. While

My body’s wisdom tells and tells again

That I shall find my rest, my sleep, my peace

And even death nowhere else but here in 

My betrayer’s arms….

(Summer in calcuta ))

 

తాను కోరుకొన్న మగాడిని ఆమె తన జీవితం లో కలవలేదు. అదే ఆమె జీవితానికి ఓ పెద్ద దుఃఖం ! ఈ విషయాన్ని ఆమె చాల స్పష్టంగా చెప్పేశారు. 

 

సరైన మనిషి కోసం చాలా కాలం నేను వేచి ఉన్నాను. 

తేజోవంతుడైన వాడు, నే కోరుకొన్న వ్యక్తి రావాలి,

అతడితో దివ్య జీవితాన్ని గడపాలి..

లేదు, నేనింకా యవ్వనవతి నే..

నా నిర్మాణమైనా… నా విధ్వంసం అయినా..

నాకా మనిషే అవసరం. 

ఇంకా ఇలా కూడా ఆమె తన భావనల్ని వ్యక్తం చేసారు. 

చివరాఖరకు మా మధ్య 

శరీరం కోసం తపించే ఒక గుడ్డి ఆకలి,

పతాక స్థాయి కి చేరిన మాటలు లేని సణుగుడు 

సంవత్సరాలుగా

సాలె పురుగు గూడు లో ఒక పోగు నుండి ఇంకో పోగుకు 

పరిగెడుతూనే ఉన్నాను. 

ఇప్పుడు నేనో స్వయంబందీని !! “

 

(For long I have waited for the right one

To come, the bright one, the right one to live

In the blue. NO I am still young

And I need that man for construction and 

Destruction Leave me….

(the invitation, He descendant s)

……………

We had, after all, between us but the

womb’s blinded hunger, the muted whisper

At the core… for years I have run from one

Gossamer lane to another, I am 

Now my own captive.

(Captive)

 

ఆమె కవిత్వాన్ని ప్రపంచం చాల ఆసక్తి గా చదివింది. చాల సార్లు వివాదాస్పదమైంది. జీవితమంతా సంఘర్షణ.. సంఘర్షణ….సంఘర్షణ….చివరగా ఆమె ముస్లీం మతం ను స్వీకరించి, మరో వివాదానికి తెర లేపింది.  ఆమె జీవితం మొత్తం ఒక పారడాక్స్.  ఆమె అనంత వేదనను, ఆమె సంతోషాన్ని, ఆమె శృంగారాన్ని కవిత్వం చేసింది. విజయవంతమైంది.

*****

Please follow and like us:

5 thoughts on “ప్రమద – కమలాదాస్”

  1. I read your contributions in Kavisangamam about Kamala Das. It is good to read again and admired towards her poetry! Thanks for sharing about her Sir.

  2. కమలాదాస్ గురించి చదివితే… ఆడవారిలో అప్పుడు ఉన్న స్వతంత్ర భావజాలం ఈనాడు లేకుండా పోయిందా అని అనిపించింది. అసలైన స్వేచ్ఛా ప్రియత్వం ఆమెలో కనిపించింది. ఇంత నిక్కచ్చిగా రాయాలంటే ఈరోజుల్లోనే అనేక సవాళ్ళు ఉన్నాయంటే… అప్పుడు ఆమె ఎదుర్కొన్న పరిస్థితులను ఊహించడం పెద్ద కష్టమేమీ కాదు.
    ఈమె రచనలు మరిన్ని చదవాల్సి ఉంది.
    విపులంగా ఆమె గురించిన విశేషాలు తెలిపిన సురేష్ గారికి ధన్యవాదాలు 🙏💐

  3. మంచి డేరింగ్ కవయిత్రి. నాలాంటివారికి ఇలా రాయడం ఊహకైనా అందనిది. చాలా బాగుంది 👏👏👏🤝🤝

Leave a Reply to Nasreen Khan Cancel reply

Your email address will not be published.