
భూపతి చంద్ర స్మారక కథానికల పోటీ – 2026
-ఎడిటర్
‘భూపతి చంద్ర’ మెమోరియల్ ట్రస్ట్ ప్రజ్ఞాపురము, గజ్వేల్, సిద్దిపేట జిల్లా, తెలంగాణ రాష్ట్రం.
‘‘భూపతి చంద్ర’’ స్మారక కథానికల పోటి – 2026
సమకాలీన సామాజిక సమస్యలు, మానవీయ విలువలు, వైవిధ్యమైన అంశాలతో కూడిన కథానికలకు ఆహ్వానం
బహుమతుల వివరములు
1. ప్రథమ బహుమతి రూ. 10,000/-
2. ద్వితీయ బహుమతి రూ. 8,000/-
3.తృతీయ బహుమతి రూ. 6,000/-
4. ప్రోత్సాహక బహుమతులు 5. ఒక్కో క్కరికి రూ. 2,000/-
రచయిత / రచయిత్రులకు సూచనలు
1. కథానిక డి.టి.పి.లో ఎ4 సైజ్ నాలుగు పేజీలకు మించరాదు.
2. కథానికలు సమకాలీన సామాజిక సమస్యలను ప్రతిబింబించేవిగా ఉండాలి. హాస్యాన్ని మేళవించ గలిగితే మంచిది.
3. పోటీకి పంపుతున్న కథానిక గతంలో ఏ పత్రికలోను ప్రచురితమై ఉండకూడదు.
4. కథానిక తమ స్వీయ రచనేనని అనువాదం, అనుసరణ, అనుకరణ కాదని, గతంలో ఎక్కడా ప్రచురితం కాలేదని, పరిశీలనలో కూడా లేదని హామీ పత్రం జత చేయాలి.
5. రచయితలు / రచయిత్రులు తమ కథ పేరును, తమ కలం పేరుతో పాటు స్వంత పేరును, పూర్తి చిరునామాను, ఫోన్ నంబర్‍ను కథానికతో పాటు విడిగా జతపరచాలి. కథానిక ప్రతులలో రచయిత, రచయిత్రి పేరు ఉండకూడదు.
6. ఒక్కరు ఒక్క కథానికను మాత్రమే పంపాలి.
7. బహుమతుల విషయంలో న్యాయ నిర్ణేతలదే తుది నిర్ణయం. ఎలాంటి సంప్రదింపులకు అవకాశము లేదు. కథానికలు త్రిప్పి పంపబడవు.
8. పోటీకి పంపిన కథానికలను ప్రచురించే హక్కు నిర్వాహకులకు ఉంటుంది.
9. కథానికలు చేరవలసిన చివరి తేది : 01.01.2026.
(i) ఈమెయిల్ ఐడి : bcmkantha@gmail. com, (ii) వాట్సాప్ : 99590 20513
(iii) పోస్టల్ సర్వీస్ లేదా కొరియర్
కథానికలు పంపవలసిన చిరునామ :
సమన్వయకర్త,
‘‘భూపతి చంద్ర’’ స్మారక కథానికల పోటి – 2026
ఆనంద నిలయం, ఇం.నం. 1-5-1020/4,
బి.ఆర్.రావు నగర్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్-500010.
ఫోన్: 99636 16999,
ఎమ్.ఎల్. కాంతారావు
అధ్యక్షులు
‘‘భూపతి చంద్ర’’ స్మారక కథానికల పోటి-2026
ప్రజ్ఞాపురము, గజ్వేల్, సిద్దిపేట, తెలంగాణ
*****
