
డాక్టర్ వాసా ప్రభావతి స్మారక కవితల పోటీ
-ఎడిటర్
సమాజంలో చెడును పరిహరించడం, మంచిని పెంచడం లక్ష్యంగా ఓ కవితల పోటీ నిర్వహించాలని వాసా ఫౌండేషన్ – పాలపిట్ట సంకల్పించాయి. డాక్టర్ వాసా ప్రభావతి స్మారకార్థం నిర్వహించే ఈ కవితల పోటీకి కవితలు పంపవలసిందిగా కవులను కోరుతున్నాము. చక్కని అభివ్యక్తి ఉన్న కవితలకు పోటీలో ప్రాధాన్యం ఉంటుంది.
మొదటి బహుమతిః రూ. 3000
రెండో బహుమతిః రూ. 2000
మూడో బహుమతిః రూ. 1000
ఎనిమిది కవితలకు ప్రత్యేక బహుమతులు
ఒక్కొక్క కవితకి రూ. 500
పోటీకి పంపించే కవితలు ఎక్కడా ప్రచురితం, ప్రసారమై ఉండ కూడదు. సోషల్మీడియాలో పోస్టు చేసి వుండకూడదు. పూర్తిగా కొత్త కవితలయి ఉండాలి.
కవితలు పంపించవలసిన చిరునామాః
ఎడిటర్, పాలపిట్ట
ఫ్లాట్ నెం: 3, బ్లాక్-6, ఏపిహెచ్బి
బాగ్లింగంపల్లి, హైదరాబాద్-500044
సెల్: 9848787284
కవితలు పంపడానికి చివరి తేదీః 30 ఏప్రిల్ 2026
ఫలితాలు ప్రకటించే తేదీః 20 మే 2026
email: palapittamag@gmail.com
***
నిర్వాహకులు:
గుడిపాటి, ఎడిటర్, పాలపిట్ట
*****
