చెళ్ళపిళ్ళ శ్యామల ఉపాధ్యాయిని. నివాసం విజయనగరం. ప్రవేశమున్న ప్రక్రియలు వచన కవిత, మినీ కవిత, పాట, వ్యాసం. బాలగేయాలు "పలకరింపులు" మినీ కవితా సంకలనం 2000 లో ప్రచురితమైంది. అనేక దిన వార మాస పత్రిక లలో కవితలు, కథలు, పాటలు ప్రసారం అయ్యాయి.
ఆ దారి సరిచేసుకుంటూ (ద్వితీయ వార్షిక సంచిక కవితల పోటీ రచన) – చెళ్ళపిళ్ళ శ్యామల మబ్బు చాటు నుంచే సూరీడు రాత్రి జరిగిన ఘటనను పరిశీలిస్తున్నాడు అవును! నిన్న రాత్రి మళ్ళీ యిక్కడో ” కాకరాపల్లి” కనిపించింది ! ఉదయాన్నే పోలీసుల బూట్ల చప్పుడుతో ఊరు నిద్ర లేచింది! బాధితులకండగా ఊరూరా…… ర్యాలీలు,….. సమావేశాలు కవుల కలాలు కత్తులు దూసాయి నేను మాత్రం అక్కడి నుంచీ కదిలాను ! జాబిలి జోల పాడుతున్న వేళ ఊరంతా […]
“కలిసొచ్చిన కాలం “ (ద్వితీయ వార్షిక సంచిక కథల పోటీ రచన) – చెళ్ళపిళ్ళ శ్యామల రోజు రోజుకీ ధైర్యం చిల్లు కుండ లో నీరై, నిరాశ అతని చుట్టూ కంచె బిగిస్తోంది. చిల్లుల గొడుగు ఆధారం కూడా లేకుండా బతుకిలా వేదన తో తడవాల్సిందేనా? మనసంతా సుడిగుండమై తిరుగుతోంది. తుఫాను ముందు ప్రశాంతతలా… ఉన్నాడతను. ఈ మధ్య అతని ప్రశాంతతే ఆమెను భయపెడుతోంది. ఓ కప్పు కాఫీతో అతన్ని దిగులు నుంచి ఆలోచన వైపు […]