“కలిసొచ్చిన కాలం 

(ద్వితీయ వార్షిక సంచిక కథల పోటీ రచన)

– చెళ్ళపిళ్ళ శ్యామల

రోజు రోజుకీ ధైర్యం చిల్లు కుండ లో నీరై,  నిరాశ     అతని చుట్టూ కంచె బిగిస్తోంది. చిల్లుల గొడుగు ఆధారం కూడా లేకుండా బతుకిలా వేదన తో తడవాల్సిందేనా? 

          మనసంతా సుడిగుండమై తిరుగుతోంది. తుఫాను ముందు ప్రశాంతతలా… ఉన్నాడతను. ఈ మధ్య అతని ప్రశాంతతే  ఆమెను భయపెడుతోంది. ఓ కప్పు కాఫీతో అతన్ని దిగులు నుంచి ఆలోచన వైపు మళ్లించాలి. అనుకున్నదే తడవు ఘుమ ఘుమ లాడే 

కాఫీతో వచ్చి, “కాఫీ తాగుదాం రండి” అంది.ముఖంలో ఏ భావం కనబర్చకుండానే ఆమెను ఫాలో అయాడతను. ఇదివరకులా ఆశ్వాదించకుండానే  కాఫీ తాగడం చూసి ఆమె “ఏంటండీ !మరీనూ !అలా మౌనంగా….. ఉన్నంత మాత్రాన సమస్యలు తీరి

పోతాయా !”అంటూనే అతనికి దగ్గరగా జరిగి చేయి మీద చేయి వేసి “ప్రతి సమస్యకు ఓ పరిష్కారం ఉంటుందండీ. కాలం కలిసి రాలేదనుకోకుండా……. 

కలిసొచ్చే కాలంగా మార్చుకుందాం. సరేనా! ” నవ్వుతూ అంది అలానే అన్నట్టు తలూపాడు. అతని పెదవులు చిన్నగా విచ్చుకున్నాయి. “కాఫీ బాగుంది థాంక్స్ “హమ్మయ్య  అనుకుందామె. 

        మొదటిసారి కరోనా దెబ్బకి అతను పని చేసిన కార్పొరేటు స్కూలు నిలబడలేక చేతులెత్తేసింది, 

***

 సురేష్,  రమేష్ యిద్దరూ అన్నదమ్ములు. సురేష్ 

 తండ్రి జ్యూట్ ఫ్యాక్టరీలో  పని చేసే వాడు. 

 ఎప్పడూ…. లాక్డౌన్ లతో నడిచే ఫ్యాక్టరీ… 

 నారాయణరావు ఎలాగో కుటుంబాన్ని లాక్కొచ్చాడుగానీ సొంత గూడయినా కట్టుకో లేక పోయాడు. పిల్లలకేమీ ఆస్తులు ఈయలేక పోయాడు.      

      చిన్నవాడు రమేష్ చురుకైన వాడు. మిలట్రీకి సెలెక్ట్ అయ్యాడు. ప్రస్తుతం అస్సాం బోర్డర్ లో ఉన్నాడు.    కరోనా కష్టకాలంలో తమ్ముడే అతణ్ణి  ఆదుకున్నాడు. ఈ సారి కాస్త పెద్ద కార్పొరేట్ స్కూల్ లోనే చేరాడు సురేష్. జీతం కూడా పెరిగింది. అంతా బాగుందనుకుంటే… కరోనా సెకండ్ వేవ్.. మళ్ళీ లాక్డౌన్. స్కూల్ తెరిచే దెన్నటికో..అదీ అతని ఆందోళనకు కారణం. 

  పరిస్థితి ఇలానే ఉంటే ఏ సంస్థ మాత్రం జీతాలిస్తుంది. అదే ఆలోచన అతని చుట్టూ జోరీగ తిరుగుతోంది. స్వప్న అతనకి ఎంతగానో  మనో బలాన్నిస్తోంది. స్వప్న అన్నయ్య, అక్క ఇద్దరూ హైదరాబాద్లో నే ప్రైవేట్   కంపెనీల్లొ పని చేస్తున్నారు. స్వప్న కి తండ్రి లేడు. తల్లి కొడుకు దగ్గరే ఉంటోంది. ఎవరి బ్రతుకులు వాళ్ళు బ్రతుకుతున్నారు. ఎన్నాళ్లని ఎవరు సాయం చేయగలరు? ఈ మధ్య స్వప్న అక్క,  అన్నయ్య ఆమె బ్యాంక్ అకౌంట్ కి డబ్బులు పంపడం కూడా అతనికి తెలుసు. ఒకరి మీద ఆధారపడడం అతనికెంతో 

  అవమానంగా చేతగానితనంగా అనిపిస్తోంది. 

        ఎలాగయినా ఏదో ఒకటి చేసి సురేష్ ని మళ్ళీ మాములు మనిషిని చేయాలనుకుంది స్వప్న. అన్నయ్య భరోసా ఇచ్చాడు సురేష్  కేదో ఒకటి దొరికేవరకు అమ్మ పెన్షన్ నీ బ్యాంక్ అకౌంట్ లో వేస్తుంటా అని. అదీ ఆమెకు కాస్తంత ధైర్యం. 

       ఆరోజు ఆదివారం. సురేష్ కూరగాయలకోసం 

       బయటకు వెళ్ళగానే గ్రూప్ కాల్ చేసి అక్క అన్నయ్య లతో మాట్లాడింది స్వప్న. సురేష్ లెక్కలు ఇంగ్లీష్ బాగా చెప్పగలడు. ఆన్లైన్ క్లాస్ ల ద్వారా 

 ఎంతో కొంత సంపాదిస్తే ఎలా వుంటుందనే విషయం మాట్లాడుకున్నారు ముగ్గురూ.ఇది కొంత ఊరట నివ్వడమే కాక సురేష్ కి  ఒక వ్యాపకం కూడా దొరుకుతుంది. అన్నయ్య రఘు అక్క సుధ వాట్సాప్ గ్రూప్ లు క్రియేట్ చేసి తమకు తెల్సిన వాళ్ళకి పంపారు. లాక్డౌన్ లో పిల్లలకు లెక్కలు, ఇంగ్లీష్ నేర్చుకునే అవకాశం అంటూ పిలుపు నిచ్చారు. 

      రోజంతా ఖాళీగా వుంటూ పిల్లలు సమయాన్ని చాలా వృధా చేయడంతో . ఈ వాట్సాప్ పిలుపు 

  పెద్దలకు  బాగా నచ్చింది. వెంటనే వాళ్ళు స్పందించారు. అందరూ ఓకే చేసాక అమౌంట్ దేముందీ 

  ఎంతో కొంత. మన పిల్లలకి అతను నేర్పిస్తాడు. అతనికి మనం సాయం చేద్దాం అన్నారు రఘు, సుధ

  ప్రణాళిక వారం రోజుల్లో కార్యరూపం దాల్చింది. 

  సురేష్ కి చేతి నిండా పని దొరికింది. ఒక్కో తరగతి కి ఒక్కో గంట సమయం కేటాయించాడు. లెక్కలు, ఇంగ్లీష్ రెండు క్లాస్ ల  కూ స్పందన బాగుంది. తమ పిల్లలకు మంచి అవకాశం కల్పించి నందుకు సురేష్ స్వప్న లకు ధన్యవాదాలు చెప్పుకున్నారు పిల్లల తల్లి దండ్రులు. పెద్ద వాళ్ళ కోసం కూడా స్పోకెన్ ఇంగ్లీష్ 

  క్లాసులు మొదలయ్యాయి. 

             సురేష్ కి ఏదైనా పని వున్న రోజుల్లో ఆన్లైన్ క్లాస్ లకు సెలవు ఇవ్వకుండా స్వప్న, పిల్లలకు బొమ్మలు గీయడం పెయింటింగ్ వేయడం నేర్పిస్తోంది. పిల్లలు ఎంతో ఇంట్రస్ట్ చూపించడం తో స్వప్న కూడా రోజూ సాయంత్రం పెయింటింగ్ క్లాస్ తీసుకుంటోంది. 

 ఎవరూ ఊరికే క్లాస్ చెప్పించు కోవడం లేదు. సురేష్ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు క్రెడిట్ అవుతూనే ఉన్నాయి. 

  అవసరాలకిపుడు వారు ఎవరి పైనా ఆధార పడాల్సిన 

  పని లేదు. 

     స్వప్న జీవితం ఇంత తొందరగా చక్క బడడం తో తల్లీ, అక్క సుధ, అన్న రఘు ఎంతో సంతోషించారు. 

  “స్వప్న బొమ్మలు బాగా వేసేది. దాని ఇంట్రెస్ట్ చూసి 

  మీ నాన్నగారు డ్రాయింగ్ మాస్టారు వద్ద తనకు పెయింటింగ్ నేర్పించారు. అదే ఈ రోజు తనకి ఆసరా అయింది. పిల్లలు ఆసక్తి చూపే విషయాలు వాళ్ళకి 

  నేర్పించడం మన కర్తవ్యం. “అంది స్వప్న తల్లి. 

****

సురేష్ దాన్ని చేతి లోకి తీసుకున్నాడు. అది  ముద్దులు మూటగట్టే ఓ పాపాయి పెయింటింగ్. స్వప్న వేస్తూ వేస్తూ మంచం మీద వదిలేసి నట్టుంది. అనుకున్నాడు సురేష్. స్వప్న రాగానే తనకి ఫోటో అందించాడు.

“ఇది ఈ రూమ్ లోనే మంచం కెదురుగా ఉంచండి “

అంది స్వప్న. సురేష్ కి అర్ధమైంది. అతని చూపులు 

స్వప్న కళ్ళలో మెరిసాయి. ఆమె చెంపలు ఎరుపెక్కాయి. రేపటికో పాపాయి కావాలనే ఆలోచన వారిని చుట్టేసింది. కలిసొచ్చిన కాలం వారింట 

సంతోషమై పూసింది. 

****

Please follow and like us:

45 thoughts on ““కలిసొచ్చిన కాలం” (ద్వితీయ వార్షిక సంచిక కథల పోటీ రచన)”

  1. కథ చాలా బాగుంది మేడం. ఎత్తుగడ ఇంకా బాగుంది. కథ చదువుతుంటే కాఫీ తాగుతూ ఉన్నట్లు ఉంది

  2. P. Ramanamma. HM.12 noon.శ్యామల, కవితలు, కథలు గత 10 సంవత్సరాలు గా తెలుసు. చాలా సహజమైన శైలి మధ్యతరగతి కుటుంబాలలో ఏదయినా కష్టం వస్తే ఎలా ఉంటుందో ఈ కథ లో చెప్పడమే కాకుండా, వాటిని ఎలా అదిగమించాలో తెలియజేయడం simply supreb. ప్రతి ఒక్కరూ తమలో వున్నా talents తెలుసుకొని కష్టకాలము వాటిని పదును పెడితే త్తప్పాకుండా విజయం సాద్దిసాత్తరు. Very good syamala, keep it up.

  3. శ్యామల చాలా బాగుంది.. కరోనా సమయం లో పేద వాళ్ళు కష్టాలు బాగా తెలుసు కొని రాసేవా….

  4. కలిసొచ్చిన కాలం చాలా బాగుంది శ్రీమతి ii chellapilla శ్యామల గారికి అభినందనలు

  5. కధ చాలా బాగుంది. ప్రైవేట్ పాఠశాల ల ఉపాధ్యాయులకి స్ఫూర్తినిస్తుంది

  6. తనభర్త ప్రశాంతత,మౌనంగా నైరాశ్యం లో కరోనానుంచి ఉద్యోగం పోయి ఉండడంతో తన పుట్టంటి వారి సహకారంతో అతనికి తిరిగి ఉత్సాహాన్ని, జీవితం పట్ల నమ్మకాన్ని కలగచేసి తనూ పిల్లలకి బొమ్మలు గీయడం, పెయటింగు క్లాసులు చెప్పి, వేణ్ణీళ్లకి చన్నీళ్లుగా సాయపడ్డం కథాంశం.
    కథా ప్రారంభం కవయిత్రి గా రాసిన వాక్యాలు ‘రోజు రోజుకీ ధైర్యం చిల్లుకుండలో నీరై, నిరాశ అతని చుట్టూ కంచె బిగుస్తోంది. చిల్లులుగొడగుఆధారం లేకుండా బతుకులు వేదనతో తడవాల్సిందేనా?’ కవయిత్రలు కాని వారు రాయలేరు.
    పుట్టింటి వారి సాయం తల్లీ అన్న తో పాటు వదిన గారూఅంతటి సంస్కారం కలిగినదవడం ఆవిడ అదృష్టం అనీ కలిసివచ్చిందనీ తెలుస్తుంది.
    అలాంటి పుట్టళ్లూ సంస్కారంకలిగిన వదినలూఉన్నవి అందరు ఆడపిల్లల కి దొరికే రోజు కొనసాగుతున్న కోసం ఎదురు చూద్దాం

  7. కథ చాలా బాగుంది శ్యామల ప్రస్తుత‌ పరిస్ధితుల కనుగుణంగా
    కధ సాగింది ఎంతటి విపత్కర పరిస్థితుల్లో నైనా ఆత్మ స్థైర్యం తో
    ఎదుర్కోవాలనేయువతకి ఆదర్శ
    ప్రాయమైన స్వప్న పాత్ర చిత్రణ
    చాలా బాగుంది
    అభినందనలు
    అక్క

  8. Absolutely a positive attitude message…Thank u ji….bcz we so have that kind of attitude to lead our life…Good one👍👌

  9. చాలా బాగుంది శ్యామల. ప్రస్తుత కరోన సమయంలో ప్రైవేటు టీచర్స్ చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వారి ఇబ్బందులకు అద్దం పట్టినట్లుగా ఉంది కధ.సమస్యలు వస్తే కృంగిపోకుండా ముందుకు సాగాలని చాలా చక్కగా సున్నితంగా చెప్పావ్. అభినందనలు శ్యామల

  10. కథ చాలా చాలా బాగుంది శ్యామలా..అవరోధాలు ఎదురైనపుడు జీవితం అంతమైపోయింది ..ఎలా బ్రతకాలి?అని క్రుంగి పోకుండా ఆశావహ దృక్పథంతో ముందుకు సాగి విజయం స్వంతం చేసుకునేలా ఎంతో సమర్ధవంతంగా కథని మలిచావు.ఈ కరోనా కాలంలో ఉపాధి కోల్పోయి దిక్కు తోచని స్థితిలో ఉన్నవారికి ఒక ఓదార్పును ప్రేరణను ఇచ్చే కథ..అభినందనలు శ్యామలా!💐💐💐

  11. జీవితం పట్ల సరైన అవగాహనతో..ఎన్ని అవరోధాలెదురైనా ఆగక ముందుకు సాగాలని ప్రభోదించిన కథ ఇది.కథ చిన్నదే అయినా సందేశం గొప్పది.ఈ కరోనా మూలంగా ఎందరో ఉపాధి పోగొట్టుకొని బాధ పడుతున్నారు..అలాగే సమస్య ఏదైనా కుంగిపోకుండా ఆశావహ దృక్పథంతో అడుగులు ముందుకు వేస్తే విజయం మన స్వంతమని చాలా సమర్ధవంతంగా చెప్పారు శ్యామల..ఇంత చక్కని కథను అందించినందుకు శ్యామల గారికి అభినందనలు!

  12. నేటి పరిస్థితులకు చక్కగా సరిపోయే కరోనా కథ. ఎంతో మంది కరోనా కారణం గా బ్రతుకుతెరువు కోల్పోయిన పరిస్థితులను చూస్తున్నాము. ఇలాంటి పరిస్థితుల్లో కుటుంబం లో వ్యక్తుల మధ్య సంబంధాలు ఎలా ఉండాలో చక్కగా వివరించారు. భార్యాభర్తలు ఒకరికొకరు తోడుగా ఉంటే ఎలాంటి పరిస్థితులనైనా జయించవచ్చు అని ఈ కథ ద్వారా చాలా బాగా తెలియజేశారు..మీ రచనా శైలి చాలా బాగుంది మేడం గారు.

  13. Very nice. Idea bavundi, execution chala bavundi. Reality ki daggaralo, andaram relate chesukune story. Baga raseru

  14. కధ చాలా బాగుంది. ప్రస్తుత పరిస్థితులకు అద్దం పడుతుంది. శ్యామల గారు మంచి మెసేజ్ అందించారు ఈ కధ ద్వారా..

  15. చాలా చాలా బాగుంది శ్యామల గారు.ప్రస్తుత ప్రైవేట్ టీచర్స్ పరిస్థితి కళ్ళకు కట్టినట్లు చూపించారు.ఎటువంటి కష్ట కాలాన్ని అయినా ధ్యేర్యం తో ,తెలివితో ఎదుర్కొని బయట పడాలి అని సందేశం బాగుంది.

  16. కధ చాలా బాగున్నది శ్యామలా!మానవమేదస్సు చాలా గొప్పదని కొ రోనాని పరోక్షంగా జయించినట్టలు నికధ నిరూపించింది.కాలాన్ని మనచేతిలోకి తీసుకుని అవకాశాలను అందిపుచ్చు కోవడం తెలివైన లక్షణం అని స్వప్న పాత్ర ద్వారా.చెప్పించడం నీ ప్రత్యేకత కథలో ఉపమానాలు బాగా పండించావ్ చక్కని కథను అందించిన నీకు అభినందనలు

  17. Really chaala heart touching ga vundhi syamalagaru .neti samasyaku oka manchi parishkaram kids chupincharu ….nice story .God bless you ever

  18. ఆరంభం నుండి ముగింపు వరకు ఆసక్తికరంగా సాగిన కథనం. ఆశావహ దృక్పథాన్ని పెంపొందించే అంశం.

  19. మానసిక ధైర్యం ఇచ్చే ఈ కధా కధనం చాలాబాగుంది. సమాకాలిన అంశాలపై మీ అవగాహనకు అభినందనలు.

  20. మీ కథ సమకాలీన సామాజికాంశము. పరిస్థితులకు మానసికంగా కుంగిపోకుండా
    మనకున్న సామర్థ్యం అందుబాటులో ఉన్న
    వనరులు పరిసీలించుకుని కార్యాచరణకు
    ఉపక్రమించాలి. కథలో జంట సరైన అవగాహనతో ముందడుగు వేసారు.సామాజిక సందర్భానికి అనుగుణమైనసందేశ మిచ్చే కథ.
    విషయం కథన సహజంగా ఉన్నాయి. అభినందనలు.
    నికి అనుగుణమైన

    1. అవునండి కరోనా కష్ట కాలం లో ప్రైవేట్ టీచర్స్ చాలా మంది ఎంతో వ్యధ ని అనుభవించారు
      జీవితాల్లోంచి వచ్చిన కధే ఇది

  21. నిరాశ, నిస్పృహ సమయాల్లో ఎవరో వస్తారు, ఎదో సహాయం చేస్తారు అని కూర్చో కుండా స్వయం కృషితో జీవితాలను ఎలా ఉద్దరించుకోవాలో ఈ కథ ద్వారా తెలియచేప్పేరు. చాలా బాగుంది. ధన్యవాదములు.

  22. విషయం సమాజిక మైంది. హతాసుడవుతున్న సహచురుడికి వెన్నుదన్నుగా నిలవడం బాగుంది. తలబాదుకుంటూ చతికిల పడిపోకు
    ండా మనకున్న సామర్థ్యం వనరులు పరిశీలిం
    కుని ముందడుగు వేయాలని ప్రభోదం బాగుంది. శ్రేయగారి స్పందన బాగుంది.

  23. చాలా బావుంది కధ. మంచి కాన్సెప్ట్ తీసుకున్నారు. రాసే విధానం కూడా చాలా బావుంది.

  24. చాలా బావుంది. మంచి కాన్సెప్ట్ నీ తీసుకున్నారు. కధ రాసే విధానం కూడా చాలా బావుంది. మంచి కధ ని అందించారు.

  25. నిరాశ నిండిన జీవితంలో ఆశలు చిగురించాయి.సంతోషాలు విరిసాయి.మధ్యతరగతి జీవితాల్ని అక్క బాగా చదివారు దానికి ఉదాహరణ ఈ కథ .చాలబాగుంది.

  26. మంచి కాన్సెప్ట్ . Covid సమయం లో కూడా జీవితాలను ఎలాగైనా నిలబెట్టుకోవాలి అని మంచి సందేశాన్ని ఇచ్చారు . అలాగే మన చుట్టూ ఉన్నవలకి మానసిక ధైర్యాన్ని అందించలేని ఒక సందేశాన్ని ఇచ్చారు. కథ రాసే వేదనం కూడా చాలా బావుంది . ధన్యవాదాలు.

Leave a Reply

Your email address will not be published.