image_print
urimila sunanda

సరిత్సాగరం( సరితా నరేష్ కవిత్వం)

సరిత్సాగరం( కవిత్వం ఒక సముద్రం)    -వురిమళ్ల సునంద కవయిత్రి అక్షరాన్ని దారి దీపంగా చేసుకుందికవిత్వాన్ని ఆయుధంగా ధరించింది. సమాజంలోని రుగ్మతలపై పోరాడేందుకు నేను సైతం అంటూ  తన కవిత్వంతో  సాహిత్య రంగంలో అడుగుపెట్టి , తన కవిత్వంతో  ఉనికిని చాటుకుంటున్న వర్థమాన కవయిత్రి సరితా నరేష్.అనేక సందర్భాలను , సమాజంలో తనకు ఎదురైన సంఘటనలను కవిత్వంగా మలిచి భేష్ అనిపించుకుంటోంది. “కవి అంటే అంటే కాలం వెంట కాదు. కాలంతో పాటు నడిచే కవి అంటే […]

Continue Reading

జీవన ప్రభాతం – చినుకు తాకిన నేల కవిత్వ సమీక్ష

చినుకు తాకిన నేల కవిత్వ సమీక్ష    -వురిమళ్ల సునంద ప్రపంచమొక పద్మవ్యూహం కవిత్వమొక తీరని దాహం అన్నారు శ్రీ శ్రీ ‌.కవిత్వం అంటే తన మూలాల్లోకి వెళ్లి రాయడమే అంటారు మరో కవి.మాట తొలి క్షతం అంటారు వడ్డెర చండీదాస్.’అక్షరం ఉదయించాలి/ఒంటిమీది చెమట బిందువులా/అక్షరం ఉదయించాలి/ప్రాణ వాయువు ల్లో స్నానం చేసి/కురులార్చుకుంటున్న ప్రభాత కిరణంలా’ అన్నారు డా సి నారాయణరెడ్డి గారు.అమెరికా కవి ప్రొఫెసర్ కెన్నెత్ కోచ్ ఏమంటారంటే రెండు రెళ్ళు నాలుగు అని చెబితే […]

Continue Reading
urimila sunanda

‘శిశిర శరత్తు’ కథా సంపుటి పై సమీక్ష

‘శిశిర శరత్తు’ సహృదయ జగత్తు    -వురిమళ్ల సునంద కథ చెప్పడం ఓ గొప్ప కళ.మరి ఆ కళను ఆస్వాదించే విధంగా ఉండాలంటే  కథా వస్తువు ఏదైనా సరేఎత్తుగడ,నడక తీరు ముగింపు ఒకదాని వెంట ఒకటి -కళ్ళను ఆ వాక్యాల వెంట పరుగులు తీయించేలా ఉండాలి. ‘కథ చదివిన తర్వాత మనసు చలించాలి.మళ్ళీ మళ్ళీ చదివింప జేయాలి.కథ  బాగుంది అని పది మందికి చెప్పించ గలగాలి.మళ్ళీ పదేళ్ళో,ఇరవై ఏళ్ళో పోయిన తరువాత చదివినా అదే అనుభూతి,స్పందన కలగాలి’ అంటారు […]

Continue Reading
urimila sunanda

చిరునవ్వు (ద్వితీయ వార్షిక సంచిక కథల పోటీ రచన)

“చిరునవ్వు” (ద్వితీయ వార్షిక సంచిక కథల పోటీ రచన) -వురిమళ్ల సునంద “చిరునవ్వు వెల ఎంత.. మరుమల్లె పూవంత మరుమల్లె వెల యెంత?  వెల లేని చిరునవ్వంత”.. ఎంత  చక్కని పాట ఇది. ఎంత బాగా రాశాడో కదా కవి… అలాంటి వెలలేని చిరునవ్వు పంచడానికి ఎందుకో అంత ఇబ్బంది తనకు.. అంత అందమైన ముఖం మీద ఎప్పుడూ ముటముటలాడే భ్రుకుటి ముడులే. లేత గులాబీ లాంటి పెదాలకెప్పుడూ బిగింపుల తాళమే.. అదేమిటో తానెంత కసిరి విసిరినా […]

Continue Reading

‘సవ్వడి’ కవితా సంపుటి పై సమీక్ష

‘సవ్వడి’ కవితా సంపుటి పై సమీక్ష    -వురిమళ్ల సునంద వచన కవితా ప్రక్రియను పరిపుష్టం చేసిన కవుల్లో  బాల గంగాధర్ తిలక్ గారికి ఓ ప్రత్యేక స్థానం ఉందంటారు కుందుర్తి.వచన కవిత రెండు ప్రధానమైన శైలులతో ప్రయాణం చేస్తుందనీ పూర్వ కావ్య భాషా సంప్రదాయానికి చేరువగా నడుస్తున్న శైలి. మరొకటి వ్యావహారిక భాషా వాదాన్ని జీర్ణించుకుని సమకాలీన ప్రజల హృదయాలకు దగ్గరగా నడుస్తున్న శైలి. ఈ రెంటిలో అత్యధిక కవితలు రెండవ శైలిలో  రాసినా అక్కడక్కడా […]

Continue Reading

జేబు కథలపై సమీక్షా వ్యాసం

జేబు -అస్థిత్వపు జవాబు (జేబు కథలపై సమీక్షా వ్యాసం)    -వురిమళ్ల సునంద  లక్షల కోట్ల సంవత్సరాల క్రితం శూన్యంగా ఉన్న సమస్త శక్తి తన శూన్యత పై తనే ఆగ్రహించి ఒక్క విస్ఫోటనంతో విశ్వంగా రూపాంతరం చెందినట్లు-అనేక తరాలుగా అణిచి పెట్టబడిన స్త్రీ శక్తి కూడా అనేక పోరాటాలుగా విస్ఫోటనం చెంది అన్ని రంగాలనూ తన చేతిలోకి తీసుకుంటున్న యుగం ఇది.ఈ ఘర్షణలో మూడు సింహాల లాంటి తండ్రి,భర్త, కొడుకుల చేతిలో ఉన్న రాజ్యమూ-సంపదా, వాటికి […]

Continue Reading

అనేక ఆకాశాలు- స్త్రీల కథలు

ఇంత దూరం గడిచాక డా.సి.భవానీ దేవి కవితా సంపుటి పై సమీక్ష -వురిమళ్ల సునంద ఇంత దూరం గడిచాక కూడా మనసులోని బరువును దించుకోక పోతే ఎలా….మాటల మూటను విప్పుకోక పోతే ఎలా.. నలుగురితో పంచుకోకపోతే ఎలా..? ..ఏమో మనం దిగే స్టేషన్ ఎప్పుడు వస్తుందో… అందుకే  ఇంత కాలం మనతో కలిసి మెలిసి ప్రయాణించిన వారందరికీ తడి కళ్ళతో ధన్యవాదాలు చెప్పుకుంటూ.. వీలయినంత హాయిగా అందరితో గడిపేస్తూ… నా తర్వాత కూడా ప్రయాణించే వాళ్ళందరికీ/ నా […]

Continue Reading

అనేక ఆకాశాలు- స్త్రీల కథలు

అనేక ఆకాశాలు- స్త్రీల కథలు -వురిమళ్ల సునంద అనేక ఆకాశాలు ఈ ఒక్క మాట చాలు..ఆలోచింప జేయడానికి, అందులో ఏముందో తెలుసుకోవాలనే కుతూహలం కలగడానికి…  సమాజంలో స్త్రీలను ఏ దృష్టితో చూస్తున్నారు వారి పట్ల ఎలా స్పందిస్తున్నారు. స్త్రీలు తాము గడుపుతున్న జీవితం ఎలా ఉంది. వారు ఎలాంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు.. ఆధిపత్య సమాజంలో  అనేకానేక అసమానతల నడుమ అస్తిత్వం కోసం  వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు,ఏం మార్పు రావాలని కోరుకుంటున్నారో ఈ కథల్లో  ఆవిష్కరించారు. ఇందులో ఉన్న కథలన్నీ కాల్పనికాలు కావు.  సమాజంలో మనకు […]

Continue Reading

సర్వధారి- సంవేదనల కవితాఝరి (పుస్తక సమీక్ష)

సర్వధారి- సంవేదనల కవితాఝరి -వురిమళ్ల సునంద కవితా సంపుటి పేరు చూడగానే  ఇది సర్వధారి సంవత్సరానికి  సంబంధించి రాసిన కవితలు కావచ్చు అనే అపోహ కలగడం సహజం.. కవయిత్రి ఇందులో మనిషి జీవితంలోని ఆశలు,ఆశయాలు స్నేహం.స్వప్నాలు, భావోద్వేగాలు, ఉద్యోగం పండుగలు పబ్బాలు, సమాజంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు, ఒకటేమిటి  మనిషి సకల  అనుభవాల ఆకృతి ఇందులో దాగుంది కాబట్టి .. సర్వం కలిగియున్నదనే అర్థంతో ‘సర్వధారి’ అని ఈ సంపుటికి నామకరణం చేశానని తన మాటలో చెప్పుకుంటారు.నిజమే […]

Continue Reading

మానవీయ విలువల పరిమళాలు(జమ్మిపూలు కథా సంపుటి పై సమీక్షా వ్యాసం)

మానవీయ విలువల పరిమళాలు (జమ్మిపూలు కథా సంపుటి పై సమీక్షా వ్యాసం) -వురిమళ్ల సునంద సాహిత్య ప్రక్రియల్లో  పాఠకులను అత్యంత ప్రభావితం చేసే శక్తి  కథ/ కథానికు ఉందని నిస్సందేహంగా చెప్పవచ్చు.పిల్లలు పెద్దలు వినడానికి చదవడానికి చెవి కోసుకునే ఈ  ప్రక్రియ సాహిత్యంలో అగ్రగామిగా నిలిచింది.అందులో పిల్లలు ఎక్కువగా ఇష్టపడేది కాల్పనికత అయితే పెద్దలు బాగా ఇష్ట పడేది యథార్థానికి దగ్గరగా ఉండే కథలనే. అందులో తమ జీవితాలను చూసుకుంటారు. సమకాలీన సమాజ పరిస్థితులు, వివిధ వర్గాల వారి […]

Continue Reading

నిర్భయాకాశం కింద (పుస్తక సమీక్ష)

నిర్భయాకాశం కింద  అనిశెట్టి రజిత కవితాసంపుటిపై  సమీక్ష -వురిమళ్ల సునంద కదిలేది కదిలించేది పెను నిద్దుర వదిలించేదే కవిత్వమన్న శ్రీ శ్రీ గారి మాటలకు కొనసాగింపు ఈ కవితా సంపుటని చెప్పవచ్చు.పీడిత తాడిత ప్రజల పక్షాన నిలిచి ఆధిపత్య అరాచక వర్గాలపై తిరగబడిన అక్షరాయుధాలు.ఈ  దుర్యోధన దుశ్శాసన దుర్వినీతి లోకంలో జరుగుతున్న  దుర్మార్గాన్ని ఎదిరించడానికిగళమెత్తిన కలం తాలూకు ధర్మాగ్రహం ఇది. యావత్ ప్రపంచాన్ని నివ్వెర పరిచిన నిర్భయ  ఘటన ఆ తర్వాత జరిగిన దిశ ఘటన.. అంతటితో ఆగకుండా  […]

Continue Reading

నీలి మేఘాలు (పుస్తక సమీక్ష)

నీలి మేఘాలు -వురిమళ్ల సునంద కవిత్వం అంటే ఒక అన్వేషణ,ఒక తీరని వేదన,కవిత్వమొక జలపాతం. కవిత్వాన్ని తూచడానికి తూనికరాళ్ళు ఉండవంటారు చలం. అక్షరాన్ని అణువుగా అనుకుంటే ఆటంబాంబు లోని అణుశక్తి కవిత్వమని చెప్పవచ్చు. అక్షరాలను పూవులతో పోలిస్తే ఆ పూలు వెదజల్లే పరిమళాలే కవిత్వం అనవచ్చు. కప్పి చెప్పేది కవిత్వం విప్పి చెప్పేది విమర్శ అని సినారె అంటే.. “కదిలేది కదిలించేది పెను నిద్దుర వదిలించేది కవిత్వమని’ శ్రీ శ్రీ గారు అంటారు. “ప్రశాంత స్థితిలో జ్ఞాపకం […]

Continue Reading

అభిమతం

అభిమత -వురిమళ్ల సునంద కవిత్వాన్ని చూడగానే ముందుగా మనసులో కొన్ని రకాల ప్రశ్నలు మెదులుతుంటాయి.. అది సామాజిక బాధ్యత గల కవిత్వమా.. స్వీయానుభవాల వ్యక్తీకరణా? భావోద్వేగాలతో ముడిపడిన స్పందనా… అస్తిత్వ స్పృహ..  సమస్యలకు పరిష్కారమా.. అని ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలను వెతికే క్రమంలో ఆయా వ్యక్తులు  రాసిన కవితలను ఆద్యంతం చదవాలనే ఆలోచన  కలుగుతుంది. భైరి ఇందిర గారు 2007 లో ప్రచురించిన కవితా సంపుటి ఇది. తెలంగాణలో మొట్టమొదటి గజల్ రచయిత్రిగా , ఫేస్ బుక్ […]

Continue Reading

అర్థనారీశ్వరులకే అవమానమా…?( ‘అస్మిత ‘కథల సంకలనం పై సమీక్ష )

అర్థనారీశ్వరులకే అవమానమా…? ( ‘అస్మిత ‘కథల సంకలనం పై సమీక్ష ) -వురిమళ్ల సునంద అస్మిత అనగానే. మనకు వెంటనే స్ఫురణకు వచ్చేది  ఓ అహంభావి.. అహంకారంతో ముట ముట లాడే ఓ రూపం.. ఆవేశంగా విరుచుకుపడే ఓ కెరటం.. కానీ ఇక్కడ అస్మిత ముఖ చిత్రం చూడగానే కనిపించే చిత్రం స్త్రీపురుష  ఏక సంఘర్షణ రూపం.. అదే పుటపై రాసిన ట్రాన్స్ జెండర్ల కథా సంకలనమని.. కానీ ఆ పేరుతో వెలువరించిన కథలు లోపలికి వెళితే.. […]

Continue Reading

స(ప్త)మస్త ఋతువుల సంవేదన (ఏడో ఋతువు కవితా సంపుటి)

స(ప్త)మస్త ఋతువుల సంవేదన ఆమె కవిత్వం (ఏడో ఋతువు కవితా సంపుటి పై సమీక్షా వ్యాసం) -వురిమళ్ల సునంద వైష్ణవి శ్రీ గారి పేరు వినగానే కవి సంగమం లో విరివిగా కవితలు రాస్తున్న కవయిత్రి గా స్ఫురణకొస్తారు. దారి దీపమై ఎందరో కవులకు దిశానిర్దేశం చేస్తున్న శ్రీయుతులు కవి యాకూబ్ గారు ప్రారంభించిన కవి సంగమం చెట్టు పై మొట్టమొదటగా 2015లో తానూ ఓ చిన్న పిట్టలా వాలానని అంటారు కవయిత్రి.ఆలస్యంగా కవితా సృజనకు పూనుకున్నా వీరు తన కవితలతో కవి సంగమం లోని […]

Continue Reading