బొమ్మల్కతలు-39

బొమ్మల్కతలు-39 -గిరిధర్ పొట్టేపాళెం చిరంజీవి – ఈ పేరులోనే ఒక మహత్తు దాగుంది. ఈ పదం తెలుగు సంస్కృతిలో ఆశీర్వాదంకి ప్రతీక. వయసులో తమకన్నా చిన్న వాళ్ళని ఆశీర్వదిస్తూ పలికే ఒక అద్భుతమైన సంస్కృత పదం ఇది. భారతీయ పురాణ ఇతిహాసాల్లో ఈ పదం యుగ యుగాలుగా మరణం లేక జీవించి ఉండే మహానుభావులకి మాత్రమే ఉపయోగించటం తెలిసిందే. అందులో ఎవరికైనా ముందుగా గుర్తొచ్చేది “అంజనీ దేవి” పుత్రుడు “ఆంజనేయుడు”. కాకతాళీయంగా ఈ చిరంజీవీ అంజనీ దేవి […]

Continue Reading
Posted On :

బొమ్మల్కతలు-29

బొమ్మల్కతలు-29 -గిరిధర్ పొట్టేపాళెం         వెన్నెల రాత్రి – నల్లని ఆకాశంలో మెరిసే తెల్లని నిండు జాబిలి ప్రసరించే వెండి కాంతుల తీగలు మెల్లగ మీటే చల్లని గాలి, ఆ వెన్నెల గాలిలో విహరిస్తూ పొందే అనుభూతిని మాటల్లో వర్ణించటం అంటే ఎవరికైనా కష్టతరమే. ఏ కవి హృదయానికైనా అనుభవం పొందితే తప్ప ఆ వర్ణన అంత సులభంగా అందదు. అలాంటి ఆ అనుభూతిని రెండు పదాల్లో వర్ణించాల్సి వస్తే – ఇది అసలు సాధ్యమేనా అనిపిస్తుంది.     […]

Continue Reading
Posted On :

బొమ్మల్కతలు-28

బొమ్మల్కతలు-28 -గిరిధర్ పొట్టేపాళెం             గిర్రున తిరగే కాలం ఎవరికోసమూ ఒక్క క్షణం కూడా ఆగదు. కాలంతో అనుక్షణమూ అలుపెరుగని పరుగే జీవితం. ఆగని కాలం పరుగులాగే మన పరుగునీ ఆపలేం, కానీ కొన్ని క్షణాలని మాత్రం పట్టి మన మదిలో బంధించి ఆపుకోగలం. మదిలో బంధీ అయిన అలాంటి క్షణాలే కాలక్రమేణా జ్ఞాపకాలై గాలుల్లా వీస్తూ అప్పుడప్పుడూ మదిలో సడి, సందడి చేస్తూ, ఒక్కొకప్పుడు అలజడి రేపుతూ ఉంటాయి. కాలంలో […]

Continue Reading
Posted On :

బొమ్మల్కతలు-27

బొమ్మల్కతలు-27 -గిరిధర్ పొట్టేపాళెం           ఈ జగమంతా రంగుల నిలయం. ప్రకృతి పరచిన పచ్చదనం, నిర్మలాకాశంలో నిండిన నీలం, వెన్నెల కురిపించే చందమామ తెల్లదనం, నిశీథ రాత్రి కటిక కారుచీకటి లో సైతం కనిపించే నల్లదనం…ఇలా అంతటా, అన్నిటా ఎటు చూసినా రంగులమయ మే. బాల్యంలో మనసున చిలికే తొలి రంగుల చినుకుల ముద్రలు ఎప్పటికీ చెక్కు చెదరవు. అందుకేనేమో అప్పట్లో చిన్నపిల్లలకిష్టమైన బొమ్మలైనా, ఆట వస్తువులైనా, తినుబండారాలైనా అన్నీ ముదురు […]

Continue Reading
Posted On :

బొమ్మల్కతలు-26

బొమ్మల్కతలు-26 -గిరిధర్ పొట్టేపాళెం           గిరీ..కమాన్…గో…గో…గో…అంటూ చప్పట్లు కొడుతూ స్టేజి మీద మైక్ పట్టుకుని నిలబడ్డ నన్ను ప్రోత్సహిస్తున్నారు మా “విజయవాడ, వి.ఆర్. సిద్ధార్ధ ఇంజనీరింగ్ కాలేజి” స్టూడెంట్స్. దానికి రెండు నిమిషాల ముందే స్టేజి ఎక్కి నిల్చున్నాను. అప్పటి కప్పుడు చీటీలో ఏదో రాసి స్టేజి మీదున్న నాకందించారు. “సెల్ యువర్ క్రియేటివ్ ఐడియాస్” ఇచ్చిన చీటీలో రాసింది మైక్ లో చదివాను. “నా క్రియేటివ్ ఐడియాస్ ని అమ్మమన్నారు” […]

Continue Reading
Posted On :

బొమ్మల్కతలు-25

బొమ్మల్కతలు-25 -గిరిధర్ పొట్టేపాళెం           నా బొమ్మల బాటలో “ఆంధ్రభూమి” సచిత్ర వారపత్రికకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. నా చిన్నప్పుడు నెల నెలా “చందమామ” కొని ప్రతి అక్షరం, ప్రతి బొమ్మా క్షుణ్ణంగా చదివినా, టీనేజ్ రోజుల్లో సహజంగానే చందమామ చదవటం ఆగిపోయింది. అప్పట్లో వార పత్రికలు బంకుల్లో తాళ్ళకి వేళాడుతుంటే ముఖచిత్రాలు చూట్టమో, ఎక్కడైనా దొరికితే బొమ్మలు, జోకుల కోసం తిరగేయటమో తప్ప వాటిల్లో కథలు, శీర్షికలు, ధారావాహికలు […]

Continue Reading
Posted On :

బొమ్మల్కతలు-24

బొమ్మల్కతలు-24 -గిరిధర్ పొట్టేపాళెం            హాలీవుడ్ సినిమాలకు అప్పట్లో, అంటే 1980s లో భారతీయ చలన చిత్ర వెండి తెరలపై చాలా ప్రత్యేకమైన క్రేజ్ ఉండేది. అతి కొద్ది గొప్ప సినిమాలు మాత్రమే పాపులర్ అయ్యేవి, ఎంతగా అంటే చిన్న చిన్న టౌన్ లలో కూడా బాగా ఆడే అంతగా.  జనాలకి ఎక్కువగానే చేరువయ్యేవి, ఎంతగా అంటే అందులోని హీరో పేరు కూడ గుర్తు పెట్టుకునేంతగా. ఇంగ్లీష్ మాటలు అర్ధం కాకపోయినా […]

Continue Reading
Posted On :

బొమ్మల్కతలు-23

బొమ్మల్కతలు-23 -గిరిధర్ పొట్టేపాళెం           అనుకోకుండా కొన్ని కొన్ని అద్భుతంగా చేసేస్తాం, అనుకుని చేసినా అంత బాగా చెయ్యలేమేమో అనుకునేంతలా. ఈ బొమ్మ అలా అనుకోకుండా నేను ఒకప్పుడు చేసిన అద్భుతమే.           సిద్ధార్ధ ఇంజనీరింగ్ కాలేజి, కానూరు, విజయవాడ లో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చదువుతున్న నాటి రోజులవి. అక్కడ చదివిన నాలుగు సంవత్సరాలు నా బొమ్మల ప్రస్థానంలో ఒక మలుపు తిరిగిన మైలురాయి, కలికితురాయి […]

Continue Reading
Posted On :

బొమ్మల్కతలు-22

బొమ్మల్కతలు-22 -గిరిధర్ పొట్టేపాళెం            చూట్టానికి పూర్తయినట్టే కనిపిస్తున్నా నేను కింద సంతకం పెట్టి, డేట్ వెయ్యలేదు అంటే ఆ బొమ్మ ఇంకా పూర్తి కాలేదనే. అలాంటి సంతకం చెయ్యని అరుదైన ఒకటి రెండు బొమ్మల్లో ఇది ఒకటి. ఈ బొమ్మ వేసినపుడు ఇంజనీరింగ్ రెండవ సంవత్సరంలో ఉన్నాను. కానీ కాలేజి హాస్టల్లో వేసింది కాదు. నా చిన్ననాటి మా ఊరు “దామరమడుగు” లో శలవులకి “బామ్మ” దగ్గరికి వెళ్ళి ఉన్నపుడు […]

Continue Reading
Posted On :

బొమ్మల్కతలు-21

బొమ్మల్కతలు-21 -గిరిధర్ పొట్టేపాళెం           ఈ పెయింటింగ్ లోని నిండైన “తెలుగుదనం” తెలుగు వారిట్టే గుర్తుపట్టేయ గలరు. ఆ చీరకట్టు, నుదుటిన గుండ్రని బొట్టు, చందమామ వెన్నెల పడి ఆ చందమామ కన్నా నిండుగ మెరిసిపోతున్న పెద్ద కళ్ళతో అందమైన “వెలుగు” లాంటి తెలుగమ్మాయి. ఈ పెయింటింగ్ కి మూలంగా నేను తీసుకున్న పెయింటింగ్ వేసిన చిత్రకారుడు “ఉత్తమ్ కుమార్”. అప్పట్లో ఆంధ్రభూమి వారపత్రిక, ఆంధ్రభూమి దినపత్రిక ఆదివారం స్పెషల్ సంచికల్లో […]

Continue Reading
Posted On :

బొమ్మల్కతలు-20

బొమ్మల్కతలు-20 -గిరిధర్ పొట్టేపాళెం         ఈ పెయింటింగ్ చూడగనే ఠక్కున మదిలో మెదిలేది “వి. ఆర్. సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజి, విజయవాడ” కాలం, ఆ కాలేజి లో “కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్” డిగ్రీ చేస్తున్న నాలుగేళ్ళ పాటు గడచిన ఒంటరి పెయింటింగ్ ప్రయాణం, ఆ ప్రయాణం లో “పెయింటింగ్” మెటీరియల్ కోసం విజయవాడ బుక్ షాపులు మొత్తం గాలిస్తూ సరికొత్త దారులు వెతుకుతూ ముందుకి సాగిన వైనం.           తొమ్మిదేళ్ళ వయసులో ఆరేళ్ళు ఇంటికి […]

Continue Reading
Posted On :

బొమ్మల్కతలు-19

బొమ్మల్కతలు-19 -గిరిధర్ పొట్టేపాళెం        ప్రతి మనిషికీ జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక విషయంలో తనకి తెలియని దాన్ని శోధించి తెలుసుకుని సాధించాలని పడే తపనా, చేసే ప్రయత్నాల వెంట కృషి తోడై తాననుకున్న దానికన్నా ఎక్కువగా సాధించిన సందర్భాలు కొన్నైనా ఉండి ఉంటాయి. వెనుదిరిగి చూసినపుడల్లా అప్పుడున్న పరిస్థితుల్లో ఇది నేనే చేశానా అని అనిపిస్తూ అబ్బురపరుస్తూ ఆ సందర్భాలు గుర్తొచ్చినపుడల్లా మదిలో మళ్ళీ మళ్ళీ అద్భుతంగా సందడి చేస్తూనే ఉంటాయి.     […]

Continue Reading
Posted On :

బొమ్మల్కతలు-18

బొమ్మల్కతలు-18 -గిరిధర్ పొట్టేపాళెం           ఇంకా ఓనమాలు కూడా దిద్దలేదు, అప్పుడే మహాగ్రంధం రాసెయ్యాలన్న తపన అన్నట్టుగా ఉండే రోజులవి, నా బొమ్మల జీవితంలో. ఒక అందమైన దృశ్యం ఏదైనా పత్రికలోనో, క్యాలెండర్ లోనో కనిపిస్తే చూసి పరవశించిపోవటమే కాదు, దాన్ని నా చేత్తో అచ్చం అలాగే అచ్చుగుద్ది మరింతగా మైమరచిపోవాలనే తపన. గ్రాఫైట్ పెన్సిల్ తో బూడిద రంగు బొమ్మల నుంచి, ఇంక్ తో బ్లాక్ అండ్ వైట్ బొమ్మలు […]

Continue Reading
Posted On :

బొమ్మల్కతలు-17

బొమ్మల్కతలు-17 -గిరిధర్ పొట్టేపాళెం           సాగర సంగమం – నాకు అమితంగా నచ్చిన అత్యుత్తమ తెలుగు చిత్రం. ఏదైనా ఒక కళాత్మకమైన పనితనాన్ని పరిశీలించి చూస్తే ఎక్కడోక్కడ ఏదో ఒక చిన్నపాటి లోపం, లేదా ఇంకాస్త మెరుగ్గా చేసుండొచ్చు అన్నవి కనిపించకపోవు. ఎక్కడా ఏ మాత్రమూ మచ్చుకైనా వంక పెట్టలేని పనితీరు మాత్రమే “పరిపూర్ణత్వం” అన్న మాటకి అర్ధంగా నిలుస్తుంది. ఒక్క మనిషి చేసే ఒక పనిలో “పరిపూర్ణత” ని తీసుకురావటం […]

Continue Reading
Posted On :

బొమ్మల్కతలు-16

బొమ్మల్కతలు-16 -గిరిధర్ పొట్టేపాళెం           రాయటం నేర్చిన ప్రతి ఒక్కరూ ఎపుడో ఒకపుడు ఏదో ఒక రేఖాచిత్రం గీసే ఉంటారు. ఒక మనిషినో, పువ్వునో, చెట్టునో, కదిలే మేఘాన్నో, ఎగిరే పక్షులనో, నిండు చందమామనో, లేదా రెండు కొండల మధ్యన పొడిచే సూర్యుడినో. రేఖాచిత్రాలే గుహల్లో వెలుగు చూసిన మొదటి మానవ చిత్రాలు. ఎలాంటి బొమ్మల ప్రక్రియ అయినా మొదల య్యేది ఒక చిన్న రేఖతోనే. సంతకం కింద తేదీ వెయ్యని […]

Continue Reading
Posted On :

బొమ్మల్కతలు-15

బొమ్మల్కతలు-15 -గిరిధర్ పొట్టేపాళెం           మనిషి పుట్టుకతోనే చుట్టూ ఉన్న పరిసరాల్నీ, మనుషుల్నీ, జీవుల్నీ చూసి అర్ధం చేసుకోవటం, చదవటం, నేర్చుకోవటం మొదలవుతుంది. మాటా, నడవడికా, ఆచరణా ఇవన్నీ పరిసర ప్రభావాలతోనే మొదలయ్యి నిత్యం ప్రభావితమవుతూ కొంచెం కొంచెం నేర్చుకుంటూ మెరుగులు దిద్దుకుంటూనే ముందుకి సాగిపోతూ ఉంటాయి. ఎంత నేర్చు కున్నా, ప్రతిరోజూ ఏదో ఒకటి, ఎంతో కొంత, కొత్తదనం ఎదురు కాకుండా ఉండదు. రోజూ ఉదయించే సూర్యుడూ ఆకాశంలో ప్రతి […]

Continue Reading
Posted On :

బొమ్మల్కతలు-14

బొమ్మల్కతలు-14 -గిరిధర్ పొట్టేపాళెం           మొట్ట మొదటి అనుభూతి, తీపైనా, చేదైనా, ఏదైనా జీవితంలో ఎన్నటికీ మరచి పోలేము, ఎప్పటికీ మదిలో పదిలంగా ఉండిపోతుంది. చిన్నప్పడు తిరిగిన పరిసరాలు, మసలిన మనుషులు అయితే మరింత బలంగా మదిలో ముద్ర పడిపోతాయి. నేను పుట్టిన ఊరు “కావలి”, నెల్లూరు జిల్లా, చిన్న పట్టణం. అమ్మమ్మ వాళ్ళ ఊరు, అమ్మ కూడా అక్కడే పుట్టింది. కానీ నా ఊహ తెలిసే నాటికి నాన్న “బుచ్చి […]

Continue Reading
Posted On :

బొమ్మల్కతలు-13

బొమ్మల్కతలు-13 -గిరిధర్ పొట్టేపాళెం           చిన్నప్పటి నుంచీ కాయితాలంటే భలే ఇష్టం ఉండేది. పుస్తకాలంటే తెలీని పిచ్చి ఉండేది. ఏ పుస్తకం దొరికినా పూర్తిగా తిప్పందే మనసు ఊరుకునేది కాదు. నచ్చిన బొమ్మలున్న పుస్తకం అయితే ఇంక ఎన్ని గంటలైనా, ఎన్ని సార్లైనా తిప్పుతూ ఉండి పోయేవాడిని. క్వాలిటీ ఉన్న పేపర్ తో మంచి ఫాంట్ ఉన్న ప్రింట్ అయితే మహా సంతోషం వేసేది. ఏ ఊర్లో ఉన్నా లైబ్రరీలకి వెళ్ళి […]

Continue Reading
Posted On :

బొమ్మల్కతలు-10

బొమ్మల్కతలు-10 -గిరిధర్ పొట్టేపాళెం           మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ మెయిన్ సబ్జెక్ట్స్ గా, ఇంగ్లీష్, సంస్కృతం లాంగ్వేజెస్ గా ఇంటర్మీడియట్ (11th & 12th Grade) విజయవాడ “ఆంధ్ర లొయోలా కాలేజి” లో ఉత్సాహంగా చేరా. అప్పట్లో లొయోలా కాలేజిలో సీట్ రావటం కష్టం. పదవ తరగతిలో చాలా మంచి మార్కులు తెచ్చుకోవటంతో, నాన్ లోకల్ అయినా నాకు సులభంగానే సీట్ వచ్చింది, చేరిపోయాను. ఆ కాలేజిలో చదివింది రెండేళ్ళే. కాలేజి […]

Continue Reading
Posted On :

బొమ్మల్కతలు-9

బొమ్మల్కతలు-9 -గిరిధర్ పొట్టేపాళెం దివ్య భారతి – ఒక్క పేరులోనే కాదు ఆమె అందంలోనూ దివ్యం ఉండేది, చూడ చక్కని రూపం. వెండితెర పై అతికొద్ది కాలంలోనే దివ్యమైన వెలుగు వెలిగి 19 ఏళ్ళకే చుక్కల్లో కెగసిన తార. ఇప్పుడెందరికి గుర్తుందో, 1990 దశకంలో అందరికీ తెలిసే ఉంటుంది. బాలీవుడ్ నుంచి తెలుగు సినిమాల్లో వెండితెర పైకి స్పీడుగా దూసుకొచ్చిన సి(నీ)తార. వచ్చినంత స్పీడుగానే జీవితం తెర పై నుంచీ నిష్క్రమించింది. అప్పటి వార్తాపత్రికల్లో  ఆ(మె) ఆకస్మిక […]

Continue Reading
Posted On :