image_print

చిత్రలిపి- నన్ను నాకు వదిలేయండి …

చిత్రలిపి నన్ను నాకు వదిలేయండి … -మన్నెం శారద అవును ….మీరు విన్నది  నిజమే …దయచేసి  నన్ను నాకు వదిలేయండి ! తెలతెలవారుతూనే  తెగ పనులున్నట్లు ప్రొద్దుకుంకేవరకు పడీ పడీ విన్యాసాలు చేస్తూ ఇన్నిరోజులు ఆకాశ సంద్రంలో ఈదులాడేను ! ఇప్పుడారెక్కలు సత్తువ ఉడిగి చతికిలపడ్డాయి రంగురంగు ఈకలు పాలిపోయి నేలకు జారుతున్నాయి  ఇప్పుడే రెక్కలొచ్చి  వాటికి రంగులొచ్చిన వయసొచ్చిన వన్నెలాడి  పిట్టలు  కొన్నినన్ను  చూసి ఇక్కడున్నావా అంటూ ఎకసెక్కాలాడుతూ  కారుకూతలు కూస్తూ కిందామీదకు  పల్టీలు కొడుతూ తిరుగుతున్నాయి  నాకునిజంగా  నవ్వొస్తుంది  ఆ వయసు దాటొచ్చిన దాన్ని కాదా నేను ??పుట్టబోయే బిడ్డల కోసం మూతి ముక్కలు చేసుకుని రెక్కలు సాచి ఎగిరి ఎగిరి పుల్లా […]

Continue Reading
Posted On :

చిత్రలిపి- జీవనయానం ! …..

చిత్రలిపి జీవనయానం ! -మన్నెం శారద పడుతూనేవున్నాను… అప్పడు నడక రాక..ఇప్పుడు నడవలేక! పడుతూనే వున్నాను … పసివయసులోఎంతదూరం వస్తాడో చందమామ నాతో అని ….పరుగులెత్తి పరుగులెత్తి …బారెడు తోకతోఆకాశమే హద్దుగా రంగులహంగుతోఆటలాడే గాలిపటం కోసం ఆకాశంకేసి చూస్తూ….పడుతూనేవున్నాను …పళ్ళు రాలగొట్టుకుంటూఏ చెట్టునో, పుట్టని ఢీ కొని ! పడుతూనేవున్నాను …నేటికీ నాటికిఅయినవారు గుచ్చిన కంటకాలను తొలగించుకుని కన్నీరు పెడుతూ .. కరడుగట్టిన కఠిన పాషాణ హృదయాల పాచి హృదయాలమీదుగాజారుతూ …పోరుతూ …. పడుతున్నాను పడుతున్నానుపడుతూనే వున్నానుఅయినా నడుస్తూనే వున్నాను ఆనాడు పెద్దల […]

Continue Reading
Posted On :

చిత్రలిపి- ఒక ఉషస్సు కోసం …..

చిత్రలిపి ఒక ఉషస్సు కోసం….. -మన్నెం శారద నిద్రపట్టని ప్రతీ జామూ నేను నీకైపదే పదే నింగి వైపు చూపులు నిగిడిస్తూనే వుంటానుచీకటి ఎంత కఠినమైనది …..!కరుగక దట్టమై పరిహసిస్తుందిఎదురు చూసినంత మాత్రాన ఎలావస్తావు ….భూమికి ఆవల నీపనిలో నీవున్నావో ….లేక దట్టమైన మబ్బుల దుప్పటిలోదాగి కలలే కంటున్నావో ….ఎదురుచూపు లో క్షణాలు సాగి సాగికలవరపెట్టి కనులు మూతపడుతున్నసమయంలో నాకిటికీ పై పడివక్రీభవిస్తున్న ఓ వెలుగు రేఖ !పరవశించి పరుగెత్తుతానా …కొన్నే కొన్ని క్షణాలు మురిపించి దిక్కుమార్చుకుంటావుమరో […]

Continue Reading
Posted On :

చిత్రలిపి- గుండెనీరయిన కథ !

చిత్రలిపి గుండెనీరయిన కథ ! -మన్నెం శారద అప్పుడసలు గుండె ఒకటుంటుంది తెలియనే తెలియదు బోసినవ్వుల అమాయకత్వం నుండి ఆటపాటల అల్లరిదాకా ‘చిన్నినా పొట్టకు శ్రీరామ రక్ష అనుకుంటూ తిండి గోలేతప్ప  గుండె గో;ల  తెలియదు గాక  తెలియదు  దశలుమారి ,దిశలు తిరిగి వయసు భుజాలపై  రంగు రంగు  రెక్కలు మొలిచి లోకమొక నందనవనంగా కనులకు భ్రాంతి గొలిపి ……..పిదప గుండెజాడ తెలిపింది  ఎర్రని వర్ణపు మధువులు ఒడలంతా వంకరలు పోతూ గిరగిరా తిరిగి  హృదయాన్ని మోహపరచి  మైమరపిస్తున్న వేళ ఒక ధ్యేయం లేక  పువ్వు పువ్వు చుట్టూ తిరుగుతూ  జుంటితేనెలు గ్రోలి మత్తుగా గమ్మత్తుగా గాలిలో పల్టీలు కొడుతున్న  నా రంగుల  రెక్కల్ని ఎక్కడివో మాయదారి ముళ్ళు అతి రక్కసము గా చీల్చి నా రక్తాన్ని […]

Continue Reading
Posted On :

చిత్రలిపి- “ప్రేమా మరి ఈ మనిషికి లేదేం ???” అని !

చిత్రలిపి ప్రేమా మరి ఈ మనిషికి లేదేం ???” అని ! -మన్నెం శారద ఒకానొక  కాఠిన్యపు  కిరణస్పర్శకు తాళలేక  తల్లడిల్లి ..కరిగి నీరయి న మంచు శిఖరం  ఒకటి ఏరయి సెలయేరయి వాగయి ,వంకయి శాపవిమోచనమొందిన  గౌతమిలా తన ప్రియ సాగర సమాగం కోసం   మహానదిగా మారి  దక్షిణ దిశకు  పరుగులు తీసింది ! పట్టలేని  పరవశం అది ! ఎన్నో ఏళ్ల కల సఫలం  కాబోతున్న సంతోషం అది !  ఆపుకోలేని  ఆనందం తో   గిరులని తరులని ఒరుసుకుంటూ వురుకుతున్న  నదిని  చూసి ఆ చెట్టు అడిగింది ‘ఎక్కడకి  మిత్రమా …అంత వేగం ?దేనికోసం ఆ దుందుడుకు ?”అని పరిహాసంగా . నది ఒకింత […]

Continue Reading
Posted On :

చిత్రలిపి- నా జ్ఞాపకాల పొత్తంలో నెమలీకవు నీవు!

చిత్రలిపి నా జ్ఞాపకాల  పొత్తంలో  నెమలీకవు నీవు! -మన్నెం శారద ఒకానొక ప్రయాణంలో మనం కలిసేవుంటాం మాటామాటా కలిపే వుంటాం  ఆకుపచ్చని చేలని చూడాలని నేను ఆత్రపడినప్పుడు కిటికీ దగ్గర సీటుని నువ్వు నాకు ఇచ్ఛే వుంటావ్  నేను తెచ్చిన పూరీలు , నువ్వు తెచ్చిన పల్లీలు ఒకరికొకరం పంచుకుని తినే ఉంటాం  అనుకోని వానజల్లు  నా మొహాన విసిరి కొట్టినప్పడు  కిటికీ మూస్తుండగా నలిగిననీ వెలికి నేను తడి రుమాలు చుట్టేవుంటాను . నీ టిక్కెట్ జారీ పడిపోయి టి. సి కి నేను ఫైన్ కట్టినప్పుడు  నువ్వు నా వైపు కృతజ్ఞతగా చూసి  కొద్దిగా మొగమాటపడేవుంటావ్  ఇప్పుడొక్కసారి  నా గమ్యం […]

Continue Reading
Posted On :

చిత్రలిపి- అమ్మా …ఆనాడే ఎందుకు చెప్పలేదు ???

చిత్రలిపి అమ్మా …ఆనాడే ఎందుకు చెప్పలేదు ??? -మన్నెం శారద అవునమ్మా …నువ్వు ఆనాడే ఎందుకు చెప్పలేదూ ….తాతయ్య వడిలో కూర్చుంటే తప్పని బాబాయి భుజాలమీద ఊరేగవద్దని ఆటో అంకులు ని ముట్టుకోనివ్వద్దని పక్కింటికి పోవద్దని దోస్తుల్ని నమ్మొద్దని వెన్నెల్లో ఆడొద్దని చుట్టమిచ్చిన చాకోలెట్  అయినా తినవద్దని …..ఇల్లు దాటొద్దని ! ఎన్నో ఎన్నెన్నో  ప్రతి బంధాల మధ్య  నా బాల్యం ఛిద్రమవుతుంటే దారిలేక  కుమిలి  కునారిల్లుతున్నాను  ఇప్పుడిప్పుడే  అర్ధమవుతున్నది …ప్రతిక్షణమూ  నువ్వు  నాకోసం పడుతున్న  వేదన !అనుక్షణమూ  అనుభవిస్తున్న నరకం !కంట్లో వత్తులేసుకుని  నువ్వు  కాసే కాపలా …….ఆఫీసునుండి  ఇంటికి వచ్చాకా  నీ కళ్ళలో ప్రతిఫలించే  ఆనందం !అమ్మా ….ఎన్నాళ్లిలా …ఎన్నేళ్ళిలా … అవునమ్మా […]

Continue Reading
Posted On :

చిత్రలిపి- ఆశల తీరమది

చిత్రలిపి ఆశల తీరమది -మన్నెం శారద గూడు చెదరి  వీడి పోదామనను కున్నప్పుడాచెట్టు కనులు చెదిరే  రంగులతో …మనసు  పొంగే హంగులు  వడలంతా నింపుకుని  వయ్యారంగా ఆగమని ఆకుల కన్నులతో అలవోకగా సైగ చేస్తుంది !  చూరు మీద ఆకులు రాలి ఆకాశం కనిపిస్తున్నప్పుడు  కదలిపోదామిక  అని గాఢంగా  నిట్టూర్చినప్పుడు తారలు కుట్టిన ఆకాశం  కప్పుమీద  దుప్పటిపరచి  తళుకులీనుతూ మురిపిస్తుంది ! నిరాశనిండిన మనసుతో  నాదిక ఈ స్థానం కాదనుకుని  తెల్లారగానే  వీడ్కోలు  తీసుకుందామని  గట్టిగా అనుకుని  నిద్రలేచీ లేవగానే వెలుగుకిరణమొకటి  నా గుడిసెలో  దూరి ధైర్యానికి  భాష్యం చెబుతుంది ! వరదనీటిని చూసి  వలస పోదామంటే  వద్దు వద్దంటూ అలలు ఆర్తిగా  కాళ్ళని చుట్టేసుకుంటాయి ! ప్రకృతంతా  సద్దుమణిగి  పడక వేసినప్పుడు సవ్వడి లేకుండా సాగిపోదామంటే పేరు లేని పక్షి ఒకటి  […]

Continue Reading
Posted On :

చిత్రలిపి- అగమ్య గమ్యం !

చిత్రలిపి అగమ్య గమ్యం ! -మన్నెం శారద ఆ అడవిదారిలో  ఎందుకు అడుగులువేసానో  నాకయితే తెలియదు కానీ ……ఇంత పత్రి తెచ్చాను   వినాయక చవితని ! పాములూ తేళ్ళుంటాయి,,,వళ్లు తెలియదా  అంటూనే తీసుకుని  పూజ చేసింది అమ్మ ! మళ్ళీ అటెనడిచాను  మరేదో కావాలని ….బయలంతా  పసుపు పారబోసినట్లు విరబూసిన తంగేడు పూలని చూసి మనసు మురిసి  వడినిండా కోసుకుని వచ్చి వరండా లో పోసాను  పిచ్చిపూలన్నీ కోసుకొస్తావ్  ,పనిలేదు నీకంటూ పచ్చదనాన్నంతా ఊడ్చేసింది అక్క ! పెదనాన్నతో నర్సి పట్నం పోయి అడవిలోదూరి  సెలయేటిలో చేపలు పడుతూనే ఇదేం పనని  కోప్పడి ఎత్తుకు పోయాడు  ఆర్దర్లీ ! సీలేరు .చింతపల్లి నన్ను మోహపెట్టి లోపలికంటా తీసుకుపోయాయి కానీ అందుకోవాల్సిందేదో  అందనే లేదు . మళ్ళీ మళ్ళీ […]

Continue Reading
Posted On :

చిత్రలిపి- రేపటి ఆశాకిరణాలు

చిత్రలిపి రేపటి ఆశాకిరణాలు -మన్నెం శారద ఎడతెరపి లేని వాన …..ఏడాపెడావాయిస్తూ … వరదలై ,వాగులై  కొండలపైనుండి దూకుతూ ….కట్టల్ని తెంచుతూ వారధుల్ని కూల్చుతూ ……. ఇళ్లలో దూరుతూ …..కళ్ళముందే కట్టుగుడ్డల్ని .కూడా మిగల్చని కఠినమైన  కరకురాతి చినుకుల్ని చూసి నిస్తేజమయిపోతుంది మనసు ! ఆహా వాన ! సుదీర్ఘ గ్రీష్మ తాపానికి వడలి ,హడలి ఏ చినుకు కోసం ఎదురుచూసామో …ఆ నీరే కన్నెరయి  బీదసాదల బ్రతుకులు ముంచేస్తుంటే ….కలల పంటల్ని కాలరాస్తుంటే దయమాలిన ప్రకృతి వైపు కలతపడి చూస్తుంది మనసు ! నిర్వీర్యమైన నిరాశ నిలబడదు మరెంతో సేపు …….ఎక్కడినుండో ఒక ఆశాకిరణం నునువెచ్చగా నినుతాకుతుంది ! ఎవరిదో ఒక స్నేహ హస్తం నేనున్నానని చేతులు చాపుతుంది !వాలిన మొక్క  నిరాశపడిన మనసుమరల సేదతీరి  నిలబడతాయి!ప్రయాణం […]

Continue Reading
Posted On :

చిత్రలిపి- నిరంతర అన్వేషిణిని నేను…..

చిత్రలిపి నిరంతర అన్వేషిణిని నేను….. -మన్నెం శారద నడుస్తూనే ఉన్నాను నేను … యుగయుగాలుగా తరతరాలుగా ఏ అర్ధరాత్రో అపరాత్రో నేను తొడుగుకున్న భౌతిక కుబుసాన్ని విడిచి నీకోసం నడక ప్రారంభిస్తాను .. గమనమే గాని గమ్యమెరుగని నా అడుగులు సాగుతూనే ఉంటాయి ఆనీవు ఎవరివో అంతుపట్టని కలత ఆలోచనలలో .. తడబడుతూ తల్లడిల్లుతూ నా హృదయపు తాళం తెరచి నీకై నిరీక్షిస్తూ … క్షితి రేఖని చేరి నా మనో సుమాల పరిమళాన్ని ఆకాశమంతా వెదజల్లుతాను […]

Continue Reading
Posted On :

చిత్రలిపి- దక్షిణవాకిలి

చిత్రలిపి దక్షిణవాకిలి -మన్నెం శారద సూరీడా ఒకసారి ఇటువైపు కూడా ఉదయించు …అవును నిజమే …నాది దక్షిణ ద్వారపు ఇల్లే ….పచ్చదనం కోసం నేను పెంచిన మొక్కలేవున్నకాస్త వెలుగుని హరించిచీకట్లని మరీ మరీ పెంచుతున్నాయిచేతిలోని హరికేన్ దీపపు కాంతి ఎర్రబారుతున్నదిచమురు నిండుకుంటున్నదో…వత్తి కొడిగడుతున్నదో…ఏమో ..ఏమో మరి …..!?అయినా నీకిదేమి పక్షపాతమూరెండు దిక్కులనే చక్కర్లు కొడుతూవెలుగులరేడువని వెలిగి పోతున్నావుఒక్క వెలుగు తాడుని ఇటు విసిరేవంటేకొస అందుకుని మరీ పైపైకి వస్తానునిరాశ నా వాదం కాదుఅందుకే ఒకసారి నా మాటవినిపక్షపాతం […]

Continue Reading
Posted On :

చిత్రలిపి- ఓ కోయిలా… ఒక పాట పాడు !

చిత్రలిపి ఓ కోయిలా… ఒక పాట పాడు! -మన్నెం శారద పాటఒకటి పాడమని పదే పదే అడుగుతుంటాను నేను !నీ పాట వినడానికి  మరిగిన ప్రాణం కదా మరి నాది ! “పాడాలని వుంది  నాకూ …ఎక్కడకూర్చుని రాగం తియ్యమంటావు కొమ్మేది ….రెమ్మేది  …..చిగురేది ….చేట్టేది ? “అంటూ ఎండు కొమ్మలమీద ఎగిరెగిరి  గెంతి చిందులేస్తుంటే  నువ్వు నిస్సహాయంగా  నిలబడి పోతాను  నేను ! ఏప్రిల్ వస్తుందంటేనే వెన్నులో పామొకటి జరాజరా పాకిన భ్రాంతి !  పుట్టనీకుండానే వసంతాన్ని కబళించే గ్రీష్మామొకటి  మున్ముందుకు దూకి కర్చీఫు వేసి మరీ కబ్జా చేసేస్తున్నది  పచ్చబడకుండానే  ఎర్రని చివుళ్లు ..విచ్చకుండానే మల్లెమొగ్గలు ..వాడి నేలరాలుతున్నాయి  వడగళ్లవానొకటి దుండగుడిలావచ్చి మామిడిపూతని .కాయని రాల్చేసి రైతు కన్నీరు చూసి  పకపక లాడి పారిపోతుంది  వాడి రాలిన […]

Continue Reading
Posted On :

చిత్రలిపి- ధరిత్రికే ధరిత్రివి నీవు !

చిత్రలిపి ప్రకృతి భక్షకుడు  -మన్నెం శారద ఏ ఉదయమొ  పచ్చగాలి పీల్చుకుందామని గంపెడాశతో   ఇంటిముందు పంచసంపెంగ  చెట్టు అరుగు మీద ఆశతో కూర్చుంటానా ….ఏవీ మునుపటి  చల్లటి గాలులు !ఏవీ ఆ పూలతావులు !అటూఇటూ ఎడాపెడా ఆకాశంలోకి పెరిగిన కాంక్రీటు జైళ్ళమధ్య  నా కొంప నేలకి అతుక్కుపోయి  నిర్భాగ్యం గా చూస్తున్నది ప్రేమరంగరించి పెంచిన మొక్కలిప్పుడు పువ్వు లేక ,పిందెలేక చావలేక బ్రతకలేక ..ముడుచుకున్న బూడిదరంగు ఆకులతో దీనంగా నా వైపు నిస్తేజంగా చూస్తుంటాయి .తలదించుకుని ,తలవంచుకుని గుక్కెడు కాఫీ గటగటా మింగుతున్నవేళ … గుండెలమీద గునపం పోటులా  టకాటకా శబ్దం !దేవుడా …అనుకుంటుండగానే తారురాసిన మొహానికి  తగరపుబిళ్ళలు  అతికించుకున్నట్లు కళ్ళని పళ్ళని మెరిపించుకుంటూ  వాడు రానేవస్తాడు ! పెళ్ళాం  మరీమరీ  ఖర్చుపెట్టేహక్కులేదని గట్టివార్ణింగ్ ఇచ్చి న అయిదొందలనోటు గంజి పెట్టి ఇస్త్రీ చేసిన గ్లాస్కో జేబులో పెట్టుకుని “మీ కాఫీ వాసన అక్కడకొస్తుందనుకోమ్మా […]

Continue Reading
Posted On :

చిత్రలిపి- ప్రకృతి భక్షకుడు

చిత్రలిపి ప్రకృతి భక్షకుడు  -మన్నెం శారద ఏ ఉదయమొ  పచ్చగాలి పీల్చుకుందామని గంపెడాశతో   ఇంటిముందు పంచసంపెంగ  చెట్టు అరుగు మీద ఆశతో కూర్చుంటానా ….ఏవీ మునుపటి  చల్లటి గాలులు !ఏవీ ఆ పూలతావులు !అటూఇటూ ఎడాపెడా ఆకాశంలోకి పెరిగిన కాంక్రీటు జైళ్ళమధ్య  నా కొంప నేలకి అతుక్కుపోయి  నిర్భాగ్యం గా చూస్తున్నది ప్రేమరంగరించి పెంచిన మొక్కలిప్పుడు పువ్వు లేక ,పిందెలేక చావలేక బ్రతకలేక ..ముడుచుకున్న బూడిదరంగు ఆకులతో దీనంగా నా వైపు నిస్తేజంగా చూస్తుంటాయి .తలదించుకుని ,తలవంచుకుని గుక్కెడు కాఫీ గటగటా మింగుతున్నవేళ … గుండెలమీద గునపం పోటులా  టకాటకా శబ్దం !దేవుడా …అనుకుంటుండగానే తారురాసిన మొహానికి  తగరపుబిళ్ళలు  అతికించుకున్నట్లు కళ్ళని పళ్ళని మెరిపించుకుంటూ  వాడు రానేవస్తాడు ! పెళ్ళాం  మరీమరీ  ఖర్చుపెట్టేహక్కులేదని గట్టివార్ణింగ్ ఇచ్చి న అయిదొందలనోటు గంజి పెట్టి ఇస్త్రీ చేసిన గ్లాస్కో జేబులో పెట్టుకుని “మీ కాఫీ వాసన అక్కడకొస్తుందనుకోమ్మా […]

Continue Reading
Posted On :

చిత్రలిపి- పలు గాకుల గోల …!

చిత్రలిపి “పలు గాకుల గోల …!” -మన్నెం శారద అక్కడేమిటో   ఒకటే పాడు కాకుల గోల ! ప్రొద్దుటే వాటి సొమ్మేదో పోయినట్లు వెర్రి గొంతులేసుకుని వెధవ గోల …. నాలుగు మెతుకులకోసం నానా అల్లరీ చేస్తున్నాయ్ … ఏమిటని చూద్దునా .. గాయపడిన కాకొకటి  వాటినడిమధ్యన మూలుగుతున్నది దానికి సాయపడలేక చేసే చేతులు లేక … అవి బొంగరం లా చుట్టూ తిరిగి అదేపనిగా ఏడుస్తున్నాయి … సంగీతం తెలియని  గొంతులూ … సాహిత్యం […]

Continue Reading
Posted On :

చిత్రలిపి- “నాకలలే నా ఊపిరి !”

చిత్రలిపి “నాకలలే నా ఊపిరి !” -మన్నెం శారద రాత్రంతా  రేపటి వికాసంకోసం   ఒకానొక మొగ్గనై  …..కలలుకంటూ  యోగనిద్రలో తేలియాడుతూ  రేపటి వెలుగురేఖకై  నిరీక్షిస్తుంటానా …. ఎక్కడివో కొన్ని దుష్టక్రిములు నా రేకులపై వాలి  నా కలల్ని ఛిద్రం చేస్తుంటాయి    చిరుగాలితో సయ్యాటలాడుతూ  నునులేత కిరణ  స్పర్శతో  పులకించి పులకించి  తరియించి తరియించి  రంగుల హంగుతో   రాసక్రీడలో ఉండగా  అండగా ఉండవలసిన  నాకొమ్మ ముళ్ళే ననుగీరి  గాయపరుస్తున్నాయి    ఒకానొక భావుకతని  మనసు ఆపుకోలేక  గుండె […]

Continue Reading
Posted On :

చిత్రలిపి- నా హృదయమొక విహంగమై

చిత్రలిపి నా హృదయమొక విహంగమై -మన్నెం శారద క్షణక్షణం రూపు మార్చుకుని యిట్టె పరుగులెత్తే మబ్బు తునకల్ని అట్టే పట్టుకుని  అక్షరాలుగా మార్చి గుండెలోని ఊసుల్ని గాలిలోకి  సందేశాలు చేసి  పంపుతుంటాను రాత్రి కలలనిండా  దోబూచులాడి మురిపించి మరపించిన  ఊహల్ని పగలు రెక్కలు ఇచ్చి గగనవిహారానికి సాగనంపుతుంటాను మనసుకి గజ్జెలు కట్టి మయూరమై నర్తిస్తుంటాను నీటిని గుడ్డ లో మూట కట్టాలని చూస్తాను  నేను ! పిచ్చి అని నవ్వుతారు  కొందరు … ప్రేమ అని భ్రమిస్తాను  […]

Continue Reading
Posted On :

చిత్రలిపి- నవ్వుకుంటున్నావా…. నీవు ???

చిత్రలిపి నవ్వుకుంటున్నావా…. నీవు ??? -మన్నెం శారద గోళాలు దాటి  అనంత దిగంతాలకేగిన నీకు మాలిన్యపు డబ్బాలు  తెచ్చి పూస్తున్న కాలుష్యపు  రంగులు చూసి ….! ఇదేమిటయ్యా ఈ జనం ….. వారి వారి మనసులోని  విషపు రక్తం నీ కీర్తి బావుటా పై నిలువునా వెదజల్లుతున్నారు ! ఎవరు నువ్వు ??? ఆడుతూ ఆడుతూ …. పాడుతూ పాడుతూ … చిలిపిగా గెంతుతూ … చిందులు తొక్కుతూ … కష్యదాటి  కర్మఫలం తో … మా […]

Continue Reading
Posted On :

ఇట్లు  మీ వసుధా రాణి- ఉత్తరాల వేళ-2

ఇట్లు మీ వసుధారాణి ఉత్తరాల వేళ-2 -వసుధారాణి  ఉత్తరం అన్ని హంగులతో పూర్తి చేసి మా అక్కయ్యా వాళ్ళింటి పక్కన పెట్టిన తపాలా డబ్బాలో వేసేసాం.ఇక మేము అనుకున్న వారికి అది చేరటం , మేము అందులో  పొందుపరిచిన విషయం వారి మీద చూపబోయే ప్రభావం గురించి ఊహల్లోకి వెళ్లిపోయాం. ఇంతలోకి మా కిషోర్ బాబు అసలు విషయం చెప్పాడు.వాడికి ఓ అలవాటు ఉంది ఏది వద్దు అంటే అది చేయటం.ఆ విషయంలో వాడి మాట వాడే […]

Continue Reading
Posted On :