చిత్రలిపి

రేపటి ఆశాకిరణాలు

-మన్నెం శారద

ఎడతెరపి లేని వాన …..
ఏడాపెడావాయిస్తూ …
 
వరదలై ,వాగులై  
కొండలపైనుండి దూకుతూ ….కట్టల్ని తెంచుతూ 
వారధుల్ని కూల్చుతూ …….
 
ఇళ్లలో దూరుతూ …..కళ్ళముందే కట్టుగుడ్డల్ని .కూడా మిగల్చని 
కఠినమైన  కరకురాతి చినుకుల్ని చూసి నిస్తేజమయిపోతుంది మనసు !
 
ఆహా వాన !
 
సుదీర్ఘ గ్రీష్మ తాపానికి వడలి ,హడలి 
ఏ చినుకు కోసం ఎదురుచూసామో …
ఆ నీరే కన్నెరయి  బీదసాదల బ్రతుకులు ముంచేస్తుంటే ….
కలల పంటల్ని కాలరాస్తుంటే 
దయమాలిన ప్రకృతి వైపు కలతపడి చూస్తుంది మనసు !
 
నిర్వీర్యమైన నిరాశ నిలబడదు మరెంతో సేపు …….
ఎక్కడినుండో ఒక ఆశాకిరణం నునువెచ్చగా నినుతాకుతుంది !
 
ఎవరిదో ఒక స్నేహ హస్తం నేనున్నానని చేతులు చాపుతుంది !
వాలిన మొక్క  నిరాశపడిన మనసుమరల సేదతీరి  నిలబడతాయి!
ప్రయాణం మరలా కొనసాగుతుంది …
ఆశాపాశాల వైపు !

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.