
చిత్రలిపి
పట్టాభిషేకం
-మన్నెం శారద
ఎగిరిపో …ఎగిరిపో …
దిగంతాలకు….అనంతమై …
ఎగసిపో …ఎగసిపో ….
నేలతల్లి పిలుపులకి దూరంగా …అతివేగంగా ….
నీసౌకుమార్యమైన రెక్కలపై యుగయుగాలుగా
నిలిపివుంచిన బరువుని విదిలించి
నీ హృదయం లో అనాదిగా పేరుకున్న
భయ భ్రాంతులని అదిలించి
అందమైన బిరుదుల మాయాజాలం తో
నిన్ను అలరించి
తరతరాల, దాస్యంలో ఇరికించి
కానరాని సంకెల బంధించి
నిన్నుదాసీగా చేసిన
ఈ సమాజపు కుట్రలనుండి
విడివడి
సాగిపో ….సాగిపో …
ఇకనైనా నిన్ను నీవు తెలుసుకుని
మహారాణిగా పట్టాభించుకో !
*****

నా పదహారవ ఏటనుండి కథలు రాస్తున్నాను. నా మొదటి మూడు నవలకి బహుమతులు వచ్చాయి. అనేక కథలు బహుమతులు అందుకున్నాయి. రెండుసార్లు నంది అవార్డ్స్ అందుకున్నాను. తెలుగు యూనివర్సిటీ నుండి ఉత్తమ రచయిత్రి అవార్డు అందుకున్నాను. నంది అవార్డ్స్ కమిటీ లో రెండుసార్లు పనిచేసాను. The week Magazaine నన్ను Lady with golden pen గా ప్రశంసించింది. దాదాపు వెయ్యి కథలు, 45 నవలలు రాసాను. చిత్రకళ నా హాబీ.
