
స్వరాలాపన-17
(మీ పాటకి నా స్వరాలు)
-డా||కె.గీత
మనందరికీ పాటలు వినడం ఇష్టం. మనలో కొందరికి విన్న పాటలు తిరిగి పాడడం ఇష్టం. మరికొందరికి ఆ పాటల్ని వివిధ వాయిద్యాల మీద పలికించడం ఇష్టం. అయితే అలా పలికించేందుకు అవసరమైన స్వరాలు తెలుసుకోవడం ఎలా? సాధారణంగా అవి గురుముఖత తప్ప అందరికీ లభ్యం కావు. నాకున్న జన్మతః వచ్చిన అనేకానేక ఇష్టాల్లో, కళల్లో విన్న ఏ పాటకైనా వెంటనే స్వరాలు కూర్చడం ఒకటి! నాకు తెలిసిన మిత్రులు ఇటువంటి కాలమ్ ఒకటి ఉంటే ఉపయోగకరంగా ఉంటుందన్న సలహా ఇవ్వడంతో అవి మీకూ ఉపయోగపడతాయని ఇక్కడ నెలనెలా ఇస్తున్నాను.
మీకు నచ్చి, నేర్చుకుంటే ఇక్కడ కామెంటులో తెలియజెయ్యడమే కాకుండా రికార్డు చేసి editor.neccheli@gmail.com ఈ-మెయిలుకి పంపండి. ఉత్తమమైన వాటిని ప్రచురిస్తాం. అంతే కాదు మీకు నచ్చిన సినిమా/ఏదైనా ప్రముఖ పాటకి (ఏ భాషైనా) స్వరాలు కావాలనుకుంటే కూడా ఈ-మెయిలు పంపండి. వరసవారీగా స్వరాలు ఈ కాలమ్ ద్వారా అందజేస్తాను. మీరు ఇలా నేర్చుకున్న పాటల్ని యూట్యూబు, ఫేసుబుక్ వంటి సామాజిక మాధ్యమాల్లో పెట్టదలుచుకుంటే తప్పనిసరిగా ఆ పాట ప్రచురితమైన నెచ్చెలి పేజీ లింక్ ని ఇస్తూ, నా పేరుని జత చెయ్యడం మరిచిపోకండేం!
***
రాగం: సింధు భైరవి రాగం
Arohanam: S R1 G2 M1 P D1 N2 S
Avarohanam: S N2 D1 P M1 G2 R1 S
చిత్రం: సప్తపది(1981)
గీతం: వ్రేపల్లియ ఎద ఝల్లున
సంగీతం: కె.వి.మహదేవన్
గీత రచన: వేటూరి సుందర్రామ్మూర్తి
పాడినవారు: పి.సుశీల & యస్ .పి.బాలు
వ్రేపల్లియ ఎద ఝల్లున పొంగిన రవళి
నీసాస*స* నిస*నీస*స* సా*స*స* రి*స*ని
నవరస మురళీ ఆ నందన మురళీ
దనిసని దనిదనీ నిద పదనిద పదపదా
ఇదేనా ఆ మురళి మోహనమురళి
గమా1మా2 నీ మ2మ1మా1 రీ*రి*రి*నిరి*నిదా
ఇదేనా ఆ మురళి
గమా1మా2 నీ మ2మ1మా1
కాళింది మడుగునా
రీ*రి*రి* ని రి*రి* ని రి*ని దా
కాళీయుని పడగల
మా2నీనిరి*రి*రి*
ఆబాలగోపాల
సగ*రీ*స నిరి*సాని
మా బాలగోపాలుని
దనిమా2ద2 రీ*రీ*రి*రి*
అచ్చెరువున అచ్చెరువున
నీ1నీ1ని1ని1 నీ2నీ2ని2ని2
విచ్చిన కన్నుల జూడ
దాదద దానినినీనీ
అచ్చెరువున అచ్చెరువున
నీ1నీ1ని1ని1 రీ*నీ2ని2ని2
విచ్చిన కన్నుల జూడ
దాదద దానినినీనీ
తాండవమాడిన సరళి
సా*రి*మ* స*గ*రి*స* స*నిని
గుండెల మోగిన మురళి ఇదేనా
దరిసని దసనిద పదమ1
ఇదేనా ఆ మురళి మోహనమురళి
గమా1మా2 నీ మ2మ1మా1 రీ*రి*రి*నిరి*నిదా
ఇదేనా ఆ మురళి
గమా1మా2 నీ మ2మ1మా1
అనగల రాగమై తొలుత వీనులలరించి
నిససస సారిగా నిససనీస ససరీగ
అనలేని రాగమై
నినినీని నీసరీ
మరలా వినిపించి
నిరిసా దనినీమా
మరులే కురిపించి
మరిరీ సససాసా
జీవనరాగమై
దాదద పాదదా
బృందావనగీతమై
దాగా*రి*ని పాదదా
ఆ జీవనరాగమై
మపపద దామమ మాదదా
బృందావనగీతమై
దారి*గ*రి*ని పాదదా
కన్నెల కన్నుల కలువల
సా*రి*మ* స*గ*రి*స* స*నిని నిని
వెన్నల దోచిన మురళి ఇదేనా
దరిసని దసనిద పదమ1
ఇదేనా ఆ మురళి మోహనమురళి
గమా1మా2 నీ మ2మ1మా1 రీ*రి*రి*నిరి*నిదా
ఇదేనా ఆ మురళి
గమా1మా2 నీ మ2మ1మా1
ఆ…. వేణుగానలోలుని
మదనిస నీససాస సాసస
మురిపించిన రవళి
దససాసస రిసని
నటనలసరళి
దనిసని దనిదనీ
ఆ నందన మురళి
నిద పదనిద పదపదా
ఇదేనా ఆ మురళి మోహనమురళి
గమా1మా2 నీ మ2మ1మా1 రీ*రి*రి*నిరి*నిదా
ఇదేనా ఆ మురళి
గమా1మా2 నీ మ2మ1మా1
మధురానగరిలో యమునాలహరిలో ఆ రాధ ఆరాధనా గీతి పలికించి
మధురానగరిలో యమునాలహరిలో ఆ రాధ ఆరాధనా గీతి పలికించి
సంగీత నాట్యాల సంగమ సుఖవేణువై
సంగీత నాట్యాల సంగమ సుఖవేణువై
రాసలీలకే ఊపిరి పోసిన అందెలరవళి
ఇదేనా ఇదేనా ఆ మురళి
వ్రేపల్లియ ఎద ఝల్లున పొంగిన రవళి
నవరస మురళీ ఆ నందన మురళీ ఇదేనా
ఇదేనా ఆ మురళి మోహనమురళి ఇదేనా ఆ మురళి
*****
*ఈ స్వరాలు వింటూ నేర్చుకోవడానికి అనువుగా కింద ఇవ్వబడిన “గీతామాధవీయం” టాక్ షో లో రెండవ భాగమైన “స్వరాలాపన” వినండి-
https://youtu.be/il3GHfh5d6Q

డా|| కె.గీత పూర్తిపేరు గీతామాధవి. వీరు “నెచ్చెలి” వ్యవస్థాపకులు, సంపాదకులు. తూ.గో.జిల్లా జగ్గంపేటలో జన్మించారు. ప్రముఖ కథా రచయిత్రి శ్రీమతి కె. వరలక్ష్మి వీరి మాతృమూర్తి. భర్త, ముగ్గురు పిల్లలతో కాలిఫోర్నియాలో నివాసముంటున్నారు.
ఆంధ్ర విశ్వవిద్యాలయంలోఇంగ్లీషు, తెలుగు భాషల్లో ఎం.ఏ లు, తెలుగు భాషా శాస్త్రం లో పిహెచ్.డి చేసి, 10 సం. రాల పాటు మెదక్ జిల్లాలో ప్రభుత్వ కళాశాల అధ్యాపకురాలిగా పనిచేసారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నించి 2006 లో “ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ” పొందారు.అమెరికాలో ఇంజనీరింగ్ మేనేజ్ మెంట్ లో ఎం.ఎస్ చేసి, ప్రస్తుతం సాఫ్ట్ వేర్ రంగంలో భాషా నిపుణురాలిగా పనిచేస్తున్నారు.
ద్రవభాష, శీతసుమాలు,శతాబ్దివెన్నెల, సెలయేటి దివిటీ, అసింట కవితాసంపుటులు, సిలికాన్ లోయ సాక్షిగా కథాసంపుటి, వెనుతిరగనివెన్నెల నవల, At The Heart of Silicon Valley -Short stories (2023),Centenary Moonlight and Other Poems(2023) ప్రచురితాలు. నెచ్చెలి ప్రచురణ “అపరాజిత” – గత ముప్పయ్యేళ్ల స్త్రీవాద కవిత్వం (1993-2022) పుస్తకానికి సంపాదకులు & ప్రచురణకర్త. ‘యాత్రాగీతం’ ట్రావెలాగ్స్, ‘కంప్యూటర్ భాషగా తెలుగు’ పరిశోధనా వ్యాసాలు కొనసాగుతున్న ధారావాహికలు. అజంతా, దేవులపల్లి, రంజనీ కుందుర్తి, సమతా రచయితల సంఘం అవార్డు, తెన్నేటి హేమలత-వంశీ జాతీయ పురస్కారం, అంపశయ్య నవీన్ పురస్కారం మొ.న పురస్కారాలు పొందారు.
టోరీ రేడియోలో “గీతామాధవీయం” టాక్ షోని నిర్వహిస్తున్నారు. తానా తెలుగుబడి ‘పాఠశాల’కు కరికులం డైరెక్టర్ గా సేవలందజేస్తున్నారు. కాలిఫోర్నియా సాహితీ వేదిక “వీక్షణం”, తెలుగు రచయిత(త్రు)లందరి వివరాలు భద్రపరిచే “తెలుగురచయిత” వెబ్సై ట్ వ్యవస్థాపకులు, నిర్వాహకులు.
