దాసరి శిరీష జ్ఞాపిక-2023 రచనలకు ఆహ్వానం!

-ఎడిటర్‌

సంగీతాన్ని, సాహిత్యాన్ని, మనుషులని ప్రేమించిన రచయిత్రి దాసరి శిరీష. ఆమె ఇష్టాలని celebrate చేసుకోటమే ఆమెని తలుచుకోటం అనుకున్నారు శిరీష కుటుంబ సభ్యులు.

రచయితల పట్ల ఆమెకి ఉన్న ఆపేక్ష , అభిమానాలకి గుర్తుగా ‘దాసరి శిరీష జ్ఞాపిక’ ను ఇవ్వాలి అనుకుంటున్నారు. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 3న, ఎంపిక చేసిన రచనను ముద్రించి, ఆ పుస్తకాలను రచయితకు అందజేయాలి అన్నదే వారి కోరిక.

ప్రచురణ పై సర్వహక్కులూ రచయితవే. కేవలం పది శాతం పుస్తకాలను శిరీష కుటుంబ సభ్యులు, జ్యూరీ సభ్యులు తీసుకుని మిగిలిన 90 శాతం పుస్తకాలను రచయిత కు ‘శిరీష జ్ఞాపిక’గా అందజేస్తారు. పుస్తక ముద్రణలో తోడ్పాటు కోరే కొత్త తరం రచయిత లకు ప్రాధాన్యం ఉంటుంది.

నిబంధనలు :

1. కథ/నవల/ జీవిత చరిత్ర/ ఆత్మకథ  సారాంశాన్ని (synopsis ) A4 సైజ్ పేజీని మించకుండా dasarisireeshagnapika2023@gmail.com కి పంపాలి.
2. తమ రచన ఏ ప్రక్రియకి చెందినదో, ఇంచుమించుగా ఎన్ని పేజీలు ఉంటుందో తెలియజేయాలి.
3. స్వీయ పరిచయంతో పాటు రచయిత ఫోన్ నంబర్, అడ్రసు కూడా మెయిల్ చేయాలి.
4. ఈ వివరాలన్నీ పంపటానికి ఆఖరి తేదీ 2023 జూన్ 22 వ తేదీ.

* ప్రచురణకు తోడ్పాటు కోరే కొత్త రచయితలకు ప్రాధాన్యం

*****

Please follow and like us: