
https://youtu.be/ZGF0j7KKssM
ప్రముఖ సాహితీవేత్త శారదా పూర్ణ శొంఠి గారితో నెచ్చెలి ముఖాముఖి
-డా||కె.గీత
(శారదా పూర్ణ శొంఠి గారితో నెచ్చెలి ప్రత్యేక ముఖాముఖి వీడియోని పైన ఇస్తున్నాం. చూసి, మీ అభిప్రాయాలు తప్పక తెలియజెయ్యండి.)
***
శారదాపూర్ణ శొంఠి – సుసర్ల సాహితీ వేత్త, విద్యావేత్త, తత్వవేత్త, రచయిత్రి , గాయని, బహు గ్రంథకర్త భారత కళా సాంస్కృతిక రాయబారి.
జననం తిరుపతి, భారతదేశం. నివాసం చికాగో నగరం, అమెరికా దేశం.
- 1997 తెలుగు PhD స్వర్ణ పతకం – ఆంధ్రా యూనివర్సిటీ
- 2002 సంస్కృతం MA
- 2010 సంస్కృతం PhD ఉత్తమ పరిశోధన పతకం – ఆంధ్రా యూనివర్సిటీ
- 2015 DLitt పరిశోధన గ్రంథం బరహంపూర్ విశ్వవిద్యాలయానికి సమర్పణ
ప్రస్తుతం –
- “అక్షర పదీయం” పరిశోధనాత్మక వ్యాసాంగం
- వేయి వేదవాక్కులు గ్రంథ రచన.
- సిలికాన్ ఆంధ్ర విశ్వ విద్యాలయానికి (Uof SA ), యూనివర్సిటీ అఫ్ అప్లైడ్ వేదిక్ సెన్సెస్ ( UAVS) కి, గాంధీ తత్వ ప్రచార చికాగో సంస్థ గౌరవ సలహాదారు.
వ్యవస్ధాపకత్వం –
- SAPNA – శ్రీ అన్నమాచార్య ప్రాజెక్ట్ అఫ్ నార్త్ అమెరికా
- SRIF – శొంఠి రెనైజాన్స్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్
- సెంటర్ ఫర్ తెలుగు స్టడీస్ – పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్శిటీ వారి చికాగో శాఖ
- చికాగో వేదవిద్యాపరిషత్
- శొంఠి పబ్లికేషన్స్ సంస్థ, ‘ బ్రాహ్మి ‘ త్రైమాస బహుభాషా సారస్వత పత్రిక , శిరాకదంబ అంతర్జాల పత్రిక.
26 గ్రంథ రచనలు-
- తాళ్లపాక అన్నమాచార్యుని నృత్య సంగీత కళాభిజ్ఞత
- తెలుగు PhD స్వర్ణ పతాక గ్రహీత పరిశోధన గ్రంథం
- Sanskrit PhD పరిశోధన గ్రంథం
- ” పూర్ణమిదం”Evolution of Fine Arts
- ‘ ప్రతీచి – నైమిశం ‘ తాత్విక చింతన వ్యాస సాహిత్యం
- వేదానుక్రమణిక – వేద వాక్సంకలనం
- మేఘదూతం
- ” నీతి సాహస్రి” – చాణక్య సూక్తులు – ఆచార్య రామవరపు శరత్ బాబుతో సంయుక్త రచనలు
- శరన్నిక్వాణం
- శరజ్ఙరి
- శరద్ద్యుతి
- “ Shabd” తెలుగు, ఆంగ్ల కవితా, వ్యాస సంకలనం”
- Telugu Primer – I&2, Sanskrit Primar – I, Musicology Primer 1
- “ప్రతీచి లేఖలు” లేఖా సాహిత్యం
- ” ప్రతీచి అధ్యారోపం” వేదాంత వ్యాసమాల
- తెలుగు సంస్కృతీ – భాషా సారస్వతములు
- Essays in honor of Prof Korada Mahadeva Sastry
- సప్త పర్ణి కథలు
- వీణా వార్షికోత్సవ సంచికలు – 15
- సాహిత్య వ్యాస పటలాలు
ముద్రణలో :
” వాగాంభృణి “…..
పురస్కారాలు:
‘ ప్రపంచ విఖ్యాత ఉత్తర అమెరికా తెలుగు వెలుగులుగు ( One of Top 10 Telugu living Legend’), “ Lady Phonomena 2022”- GSA – USA, Life Time Achievement by MEATF US Congress ,“బ్రాహ్మీ కళా విశారద “, “ప్రతిభాకౌముది “,” సంగీత కళా పూర్ణ”,” భాషా రత్న “, ” సాహితీ సుధీమణి ” ” భారత భారతి – విశ్వనాథ సాహితీ పురస్కారం ” , “సాహిత్య విశారద” ” శిరోమణి” ” వాగ్మయ శిరోమణి” ” అక్కినేని పురస్కారం” ” మహతి పురస్కారం” ,” రాయప్రోలు పురస్కారం”, వంగూరి ఫౌండేషన్ : ” జీవన సాఫల్య పురస్కారం” , Award for excellence ATA , TANA , NATS , NATA, TAGC, TTA , HTGC , SVST, చికాగో రోటరీ ‘ పాల్ హేరిస్ ‘ సాంస్కృతిక పురస్కారం, 2017 US కాంగ్రేస్ చికాగో. డేనీ డేవిస్ ‘అంతర్జాతీయ సాంస్కృతిక సేవా పురస్కారం’, – మెక్సికో – మెరిడా -17వ ప్రపంచ శాంతి నోబెల్ బహుమతి గ్రహీతల సమావేశ గుర్తింపు, మైసూరు దత్తపీఠాధిపతి శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద ముని ఆశీర్వచన ప్రశంస, కుర్తాళం మఠ , శ్రీ శ్రీ సిద్దేశ్వరానంద భారతీ మహా స్వామి ప్రశంసా సత్కారం.
*****

డా|| కె.గీత పూర్తిపేరు గీతామాధవి. వీరు “నెచ్చెలి” వ్యవస్థాపకులు, సంపాదకులు. తూ.గో.జిల్లా జగ్గంపేటలో జన్మించారు. ప్రముఖ కథా రచయిత్రి శ్రీమతి కె. వరలక్ష్మి వీరి మాతృమూర్తి. భర్త, ముగ్గురు పిల్లలతో కాలిఫోర్నియాలో నివాసముంటున్నారు.
ఆంధ్ర విశ్వవిద్యాలయంలోఇంగ్లీషు, తెలుగు భాషల్లో ఎం.ఏ లు, తెలుగు భాషా శాస్త్రం లో పిహెచ్.డి చేసి, 10 సం. రాల పాటు మెదక్ జిల్లాలో ప్రభుత్వ కళాశాల అధ్యాపకురాలిగా పనిచేసారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నించి 2006 లో “ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ” పొందారు.అమెరికాలో ఇంజనీరింగ్ మేనేజ్ మెంట్ లో ఎం.ఎస్ చేసి, ప్రస్తుతం సాఫ్ట్ వేర్ రంగంలో భాషా నిపుణురాలిగా పనిచేస్తున్నారు.
ద్రవభాష, శీతసుమాలు,శతాబ్దివెన్నెల, సెలయేటి దివిటీ, అసింట కవితాసంపుటులు, సిలికాన్ లోయ సాక్షిగా కథాసంపుటి, వెనుతిరగనివెన్నెల నవల, At The Heart of Silicon Valley -Short stories (2023),Centenary Moonlight and Other Poems(2023) ప్రచురితాలు. నెచ్చెలి ప్రచురణ “అపరాజిత” – గత ముప్పయ్యేళ్ల స్త్రీవాద కవిత్వం (1993-2022) పుస్తకానికి సంపాదకులు & ప్రచురణకర్త. ‘యాత్రాగీతం’ ట్రావెలాగ్స్, ‘కంప్యూటర్ భాషగా తెలుగు’ పరిశోధనా వ్యాసాలు కొనసాగుతున్న ధారావాహికలు. అజంతా, దేవులపల్లి, రంజనీ కుందుర్తి, సమతా రచయితల సంఘం అవార్డు, తెన్నేటి హేమలత-వంశీ జాతీయ పురస్కారం, అంపశయ్య నవీన్ పురస్కారం మొ.న పురస్కారాలు పొందారు.
టోరీ రేడియోలో “గీతామాధవీయం” టాక్ షోని నిర్వహిస్తున్నారు. తానా తెలుగుబడి ‘పాఠశాల’కు కరికులం డైరెక్టర్ గా సేవలందజేస్తున్నారు. కాలిఫోర్నియా సాహితీ వేదిక “వీక్షణం”, తెలుగు రచయిత(త్రు)లందరి వివరాలు భద్రపరిచే “తెలుగురచయిత” వెబ్సై ట్ వ్యవస్థాపకులు, నిర్వాహకులు.

ఇంత మంచి ముఖాముఖి కార్యక్రమం అందించారు. విన్న కొద్దీ వినా లని వుంది. 👌