
చెన్నమనేని రంగనాయకమ్మ స్మారక సాహిత్య పురస్కారం నిమిత్తం రచనలకు ఆహ్వానం
-ఎడిటర్
శ్రీలేఖ సాహితి, వరంగల్లు వారు గత సంవత్సరము మాదిరిగానే 2024 సంవత్సరా నికి విశిష్టాద్వైత సాహిత్యమునకు “చెన్నమనేని రంగనాయకమ్మ గారి స్మారక సాహిత్య పురస్కారమును” ఇవ్వడానికి నిర్ణయించింది. ఈ పురస్కారము విశిష్టాద్వైత సాహిత్య గ్రంధాలకు మాత్రమే. అనువాదాలు పరిశీలించబడవు. పద్యకావ్యాలు, వ్యాససంపుటాలు పంపవచ్చును. 1. 2020 – 2024 సంవత్సరాల్లో ప్రచురించబడి ఉండాలి. 2. సంకలనాలు, అనువాదాలు పరిశీలించబడవు. 3. ఎవరైనా పంపవచ్చును. రచయితకు మాత్రమే పురస్కారం అందిస్తాము. 4. పరిశీలన నిమిత్తం నాలుగు ప్రతులు 31 మార్చి 2025లోగా పంపాలి. కేవలము విశిష్టాద్వైతంనకు సంబంధించినవి మాత్రమే. న్యాయనిర్ణేతలదే తుది నిర్ణయం. 5. ఏప్రిల్ లో(ఉగాదికి) పురస్కారం క్రింద రూ.5000/-, శాలువా, మెమొంటోతో సత్కరించబడుతుంది. 6. పుస్తకాలు పంపవలసిన చిరునామా: డాక్టర్ టి. శ్రీరంగస్వామి అధ్యక్షులు, శ్రీలేఖసాహితి ఇం.నం. 27-14-53, లిటిల్ సోల్జర్స్ స్కూల్ లేన్, మండల కార్యాలయము ఎదురుగ, హసన్ పర్తి 506371, హన్మకొండ వరంగల్ తెలంగాణ, ఫోన్ నం. 99498 57955 డా. టి.శ్రీరంగస్వామి అధ్యక్షులు, శ్రీలేఖసాహితి వరంగల్
****
