“నెచ్చెలి”మా

నమ్మకం

-డా|| కె.గీత 

ఈ ప్రపంచము
నందు
ఎవరిని
నమ్మవలెను?
ఎవరిని
నమ్మరాదు?

అయ్యబాబోయ్
ఏవిటా
క్లిష్టాతిక్లిష్టమైన
ప్రశ్న?

అయినా
ఇదేవైనా
పరీక్షాపత్రమా?
జీవితం-

అయినా
నమ్మడానికి
నమ్మకపోవడానికి
ఎవరి
నమ్మకాలు
వారికుంటాయ్
నమ్మేవారు
ఏది ఎటుల వున్నను గుడ్డిగా
నమ్మువారు
మోసగింపబడినా
నమ్మువారు
కరిపివేపాకు వలె
తీసివేయబడుచున్నా
నమ్మువారు
…..
ఇట్లు
పలు రకములు

నమ్మనివారు
ఎవరినీ నమ్మరు
దేనినీ నమ్మరు

మరి
ఈ ప్రపంచము
నందు
ఎవరినైనా
నమ్మవలెనా?
నమ్మరాదా?

క్లిష్టాతిక్లిష్టమైన
చిక్కు గడ్డు
ప్రశ్న
అయినను
మంచి ప్రశ్న-

అతిగా
నమ్ముట
అతిగా
నమ్మకపోవుట
రెండుయును
రుగ్మములే

అసలెటు
నమ్మవలె?
నమ్మకపోవుట ఎట్లు?

నమ్మడం
నమ్మకపోవడం
పక్కనబెట్టి
నీ ధర్మం
నువ్వు
నిర్వర్తించడమే-

ఇక
నమ్మకాలు
అపనమ్మకాలు
అన్నీ
అర్థమవుతాయి

కొన్నయినా
అనుభవం
ద్వారా
పాఠాలవుతాయి

****

నెచ్చెలి పాఠకులందరికీ సదవకాశం: 

ప్రతినెలా నెచ్చెలి  పత్రికలో వచ్చే రచనలు / “నెచ్చెలి” యూట్యూబ్ ఛానెల్లో వచ్చిన ఆర్టికల్స్ వేటిపైనైనా వచ్చిన కామెంట్ల నించి ప్రతి నెలా ఒక ఉత్తమ విశ్లేషణా త్మక కామెంటుని ఎంపిక చేసి  ప్రకటిస్తాం. పాత రచనల మీద కూడా కామెంట్లు చెయ్యవచ్చు.

మరింకెందుకు ఆలస్యం? రచనల్ని చదివి వివరంగా కామెంట్లు పెట్టడం ప్రారంభించండి.

వినూత్నం, వైవిధ్యం ప్రధాన నిలయాలైన  “నెచ్చెలి”లో వస్తున్న వివిధ వినూత్న రచనల్ని తప్పక చూసి, చదివి ఆనందిస్తారు కదూ!

*****

జనవరి, 2025 లో ఎంపికైన ఉత్తమ కామెంటు రాసిన వారు:  ఉదయగిరి దస్తగిరి

ఉత్తమ కామెంటు అందుకున్న పోస్టు: నువ్వు అణుబాంబువి (కవిత)  – తోకల రాజేశం

ఇరువురికీ  అభినందనలు!

****


Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.