“నెచ్చెలి”మా

జాబిల్లికేమని చెప్పను?

-డా|| కె.గీత 

జాబిల్లీ
జాబిల్లీ
నీకేమని చెప్పను?

దశాబ్దాలుగా
పట్టించుకోని
నిన్ను
పోటీ కోసమే
అందుకోవడానికి
మళ్ళీ
పరుగులెడుతున్నారనా!

ఆర్టిమస్ నౌకలో
నీ చుట్టూ
తిరగడం కన్నా
ముఖ్యమైనవి
ఎన్నో ఉన్నా
ఆధిపత్యం కోసమే
నిన్ను
అందుకోవడానికి
మళ్ళీ
పరుగులెడుతున్నారనా!

అక్కణ్ణించి
నువ్వూ
చూస్తూ
ఉండి
ఉంటావుగా!

లేత నీలం రంగు
భూమి
తెల్ల మబ్బుల
భూమి
ఆకుపచ్చని
భూమి
తేలే ఖండాల
భూమి
నిన్ను చుట్టూ
తిప్పుకునే
భూమి

అధికారాలు
అన్యాయాలు
ఆధిపత్యాలు
గర్వాంధకారాలు
దోపిడీల
భూమి

జాతులన్నీ
స్వీయ
నాశనం
చేసుకునే
భూమి
యుద్ధాలకు
కయ్యాలకు
కాలుదువ్వే
భూమి

జాబిల్లీ!
ఇక్కడ
సామాన్యుల
నోళ్ళు
ఎందుకూ
పనికిరావు

సామాన్యుల
వేదన
ఎవరికీ
పట్టదు

జాబిల్లీ!
ఇక
నీకేమని
చెప్పను?!

జాబిల్లీ!
నిన్ను
అందుకోవడం
కన్నా
మానవత్వాన్ని
బతికించుకోవడం
ముఖ్యమని
నువ్వైనా
చెప్పు!

నిన్ను
చేరుకోవడం
కన్నా
భూమిని
రక్షించుకోవడం
ముఖ్యమని
నువ్వైనా
చెప్పు!

నీ చుట్టూ
పరిభ్రమిస్తున్న
మేం
కాలూనుకోవాలనుకున్న
మేం
మాయమయిపోకముందే

భూమ్మీద
నిల్వల కోసమే
సంపదల కోసమే
వినాశనమయ్యే
మానవజాతి
అంతమై పోకముందే
హెచ్చరించు

****

నెచ్చెలి పాఠకులందరికీ సదవకాశం: 

ప్రతినెలా నెచ్చెలి  పత్రికలో వచ్చే రచనలు / “నెచ్చెలి” యూట్యూబ్ ఛానెల్లో వచ్చిన ఆర్టికల్స్ వేటిపైనైనా వచ్చిన కామెంట్ల నించి ప్రతి నెలా ఒక ఉత్తమ విశ్లేషణా త్మక కామెంటుని ఎంపిక చేసి  ప్రకటిస్తాం. పాత రచనల మీద కూడా కామెంట్లు చెయ్యవచ్చు.

మరింకెందుకు ఆలస్యం? రచనల్ని చదివి వివరంగా కామెంట్లు పెట్టడం ప్రారంభించండి.

వినూత్నం, వైవిధ్యం ప్రధాన నిలయాలైన  “నెచ్చెలి”లో వస్తున్న వివిధ వినూత్న రచనల్ని తప్పక చూసి, చదివి ఆనందిస్తారు కదూ!

*****

మార్చి, 2026 లో ఎంపికైన ఉత్తమ కామెంటు రాసిన వారు:  సురేఖ పులి

ఉత్తమ కామెంటు అందుకున్న పోస్టు: ఆ కలం ఆగితే (కథ) – అనసూయ ఉయ్యూరు

ఇరువురికీ  అభినందనలు!

****


Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.