కాలే నా నుదుటి మీద తన తమలపాకు అరచెయ్యి చప్పున తీసేసింది ఈ రచన. పైపై జ్వరమే కాదు, లోలోపల అలుముకుపోయిన రంగులతోట కూడా నువ్వే అనిపించేటంత చల్లగా చెప్పిన తనదైన కధ ఇది. ఐనా సరే ఎక్కడో అక్కడ మనదే అనిపిస్తుంది. కనుకే ఇన్ని లక్షలమందికి నచ్చింది జీవితం చివరి అంచున రచన.
అన్ని చోట్ల మనిషిని తెలివి మాత్రమే కాపాడలేదు. అప్పుడప్పుడు మీ మంచితనం కూడా రక్షిస్తుంది. కాబట్టి ఎవరిని పట్టించుకోకుండా నీ జీవితంలో ముందుకు సాగిపోవ డమే. ఈ రచన ద్వారా నాకు స్పష్టంగా అర్ధమైన సత్యం ఇదే.
జీవితం ఎప్పుడూ సవాళ్లను విసిరుతూనే ఉంటుంది. పరిస్థితుల మార్పులకు అనుగుణంగా మారడం నేర్చుకోవాలి. లేదా మార్చడం నేర్చుకోవాలి. ఇందులో ఈ విషయం కూడా బాగా అర్దం అయింది.
అదేం చిత్రమో ప్రతి విషయం జరగాల్సిన సమయంలోనే జరుగుతుంది. సహనంతో ఉండటం, సయోధ్యను పాటించడం అవసరం. అదెలాగో చెప్పేందుకు ఖచ్చితంగా ఆత్మగత శక్తి వుండాలి. ఝాన్సీ తన ప్రతి వాక్యంలో ఆ నైపుణ్యాన్ని నాలో నిద్రలేపింది. అందరి జీవితాలలో మనం చదువుకునేటప్పుడు, పాఠం విన్న తర్వాత మాత్రమే పరీక్ష పెట్టడం జరుగుతుంది. కానీ జీవితం అలా కాదు, జీవితం పరీక్ష పెట్టిన తర్వాతనే మనకు ఒక గుణపాఠం నేర్పుతుంది. అది ఆయా సందర్భాలను బట్టి ఎంత గొప్పగా తీయగా ఘాటుగా వుంటాయో రచయిత్రి బాగా చెప్పారు. జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్న తర్వాతనే మనకు జీవితం ఏంటో తెలిసి వస్తుంది.
కొన్నిసార్లు ఒంటరితనమే డబ్బు విలువ, చదువు విలువ, సమయం విలువ, జీవితం విలువ.. అన్ని నేర్పిస్తుంది. అలా తాను ఏం నేర్చుకుందో తెలిస్తే షాక్ అవుతాము . నిజమే … ఆవిడ నుండి జీవించడం నేర్చుకోండి. ఈ ఆత్మగతానుగతమైన రచనలో సాధారణ పాఠకుడి నుంచి మహా రచయిత వరకూ అందరికీ తట్టే అంశం ఇదే. జీవితం చివరి అంచున” అనేది జ్వాల.
కొప్పిశెట్టి రాసిన లేదా ఆమెకు సంబంధించిన ఒక రచన. ఇది సమాజంలో మహిళ లు ఎదుర్కొంటున్న స్వేచ్ఛా అడ్డంకులను, ముఖ్యంగా పెళ్ళి తర్వాత ఆశలను వదులుకుని పిల్లల కోసం తనను తాను వదులుకున్న జీవితాల గురించి వివరించే క్రమంలో ఒక కొత్త నేపధ్యాన్ని సరికొత్త శైలిలో చెప్పిన స్వీయ కధనం. స్వేచ్ఛకి పరిధిని పెట్టి పరిమితులు అనే గీతలు గీసిన సమాజాన్ని దాటి సంశయాలు వీడి తనకు తానే అనుమతినిచ్చుకోవడమే స్వేచ్ఛ. ఇదే ఈ రచనలో అంతిమంగా అర్దమయ్యే సత్యం.
చిన్న చిన్న వాక్యాలతో హాయిగా చదివించే శైలితో ఏకబిగిన చదివించే వుచ్చుకత ఈ రచన ప్రత్యేకత. చాలా ఏళ్ల తర్వాత జీవితాన్ని పక్కన పెట్టుకొని ఈ కధనం చదువు తూ సమాంతరంగా అనుభూతించిన గొప్ప సందర్భం. అంతిమంగా ఊపిరి, కొండ వాగులు రెండూ ఒకే ఒక్క వరద నదై ఎగసెగసి పడతాయి! పది దిక్కుల నుండి తొణుకు తుంది జీవ మధువు!
*****