image_print

అనగనగా-ఆత్మవిశ్వాసం

ఆత్మవిశ్వాసం -ఆదూరి హైమావతి  శైలేష్ నాన్నగారు బెంగుళూర్లో సాఫ్ట్ వేర్ ఇంజనీరు. అమ్మ, నాన్నలతో కల్సి సంక్రాంతి శలవులకు బామ్మగారి ఊరికి వచ్చాడు ఎనిమిదేళ్ళ శైలేష్. ఆ రోజు ఉదయం ఎంతకూ నిద్రలేవని శైలేష్ ను అమ్మ హంసిని నిద్ర లేపుతుంటే అటూ ఇటూ తిరిగి పడుకుంటున్నాడు. హంసిని వాడు కప్పుకున్న దుప్పటి లాగేసి వాడి బధ్ధకం వదల గొట్టను “శైలేష్! టైం ఎనిమిదైంది లే. తాతగారు, బామ్మగారూ ఎప్పుడో లేచేసి తోటపని చేస్తున్నారు. చూడూ!” అంటూ […]

Continue Reading
Posted On :

అనగనగా-సహకారం

సహకారం -ఆదూరి హైమావతి  అనగా అనగా ఒక అడవి. ఆ అడవిలో చాలా జంతువులుండేవి.. ఎవరిపాటికి అవి సుఖంగా జీవించేవి. ఒకరోజున గజరాజు విహారంగా నడుస్తూ ఉదయాన్నే సరస్సులో స్నానంచేసి రావాలని బయల్దేరింది. సరస్సుకు కొద్ది దూరంలో ఉండగానే తమరాజైన సింహం అరుపు వినిపించింది. ఆ అరుపు బాధగా కష్టంలో ఉన్నట్లు అనిపించి వడివడిగా నడుస్తూ ఆ అరుపు వినిపిస్తున్నచోటికి వచ్చింది గజరాజు. అక్కడ తమ రాజైన సింహం ముళ్ళగుట్టల చాటున ఉన్న ఒక ఊబిలోకి మునిగి […]

Continue Reading
Posted On :

అనగనగా-నిజాయితీ

నిజాయితీ -ఆదూరి హైమావతి  నడమానూరు అనే గ్రామంలో రాములయ్య, సీతమ్మ అనే రైతుకూలీ దంపతులకు సోము అనే కుమారుడు ఉండేవాడు. వాడు స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ఐదోతరగతి చదువుతున్నా డు. గత ఏడాదీ పాఠశాల ఉపాధ్యా యులు ఐదోతరగతి పిల్లలను బస్ లో ఎక్కంచుకుని నగరంలోని జంతు ప్రదర్శనశాలకు తీసుకెళ్ళి అక్కడి జంతువులనంతా చూపుతూ వాటి అలవాట్లు, పద్దతులు ఇంకా వాటి గురంచిన అనేక విషయాలు చెప్పే వారు. ఆ ఏడాది నగరానికి వెళ్ళను యాభై రూపాయలు […]

Continue Reading
Posted On :

అనగనగా-అసలు రహస్యం

అసలు రహస్యం -ఆదూరి హైమావతి  హనుమకొండ రాజ్యాన్ని ఆనందవర్మ పాలించే కాలంలో రాజ్యం సుభిక్షంగా ఉండేది. రాజధాని చుట్టు పక్కల గ్రామ ప్రజలంతా యాడాదికి మూడు పంటలు పండించుకుంటూ సుఖశాంతులతో జీవించేవారు. ఉన్నట్లుండి ఎక్కడి నుంచో ఒక బందెపోటు ముఠావచ్చి గ్రామాల మీద పడి,  దోచుకో సాగింది. సరిగ్గా పంటలు పండి ధాన్యం ఇల్లు చేరేలోగా వచ్చి మొత్తం దోచుకుపోయేవారు. ఎదురు తిరిగిన వారిని చావబాదేవారు. వారి దెబ్బలకు బతికున్నా మళ్ళాలేచి పని చేసుకునే స్థితి ఉండేది […]

Continue Reading
Posted On :

అనగనగా-సమానత్వం

సమానత్వం -ఆదూరి హైమావతి  అనగా అనగా అమరగిరి రాజ్యాన్ని మహేంద్రవర్మ పాలించే రోజుల్లో తన రాజ్యంలో విద్యావ్యాప్తికి బాగా కృషి చేసాడు. విద్య వస్తే ప్రజలంతా ధర్మ మార్గాన ప్రవర్తిస్తారని ఆయన నమ్మిక.  అందుకోసం రాజ్యంలో నలుమూలల  విద్యావేత్తలైన  పండితుల చేత ఉచిత  గురుకులాలు నడిపించసాగాడు. అతని ఏకైక కుమారుడైన కుమారవర్మను  వేదవేద్యుడనే పండుతులవారు నిర్వహించే విద్యాలయంలో చేర్చాడు.  అక్కడ విద్యార్ధులంతా నేలమీద తుంగచాపల మీద పడుకోడం, నదీ స్నానం, అంతా కలసి  భుజించడం, ఆశ్రమంలో పనులు […]

Continue Reading
Posted On :

అనగనగా- స్వర్గాదపి

స్వర్గాదపి -ఆదూరి హైమావతి  బంగారు పాళ్య గ్రామం పక్కగా బాహుదానది పారుతుంటుంది.  నది దాటుకుని రోజూ ఆ పల్లె వాసులు  పక్కనున్న నగరం వెళ్ళి కూలి పనులు చేసుకుని వస్తుంటారు.  ఉన్నట్లుండి వచ్చే వరదల వలన ఇలా జరగడం వాడుకే. తొందరపడి దిగితే ప్రమాదం జరుగుతుంటుంది. రోజూ ఆ నది దాటితేకానీ  ఆ గ్రామ ప్రజల జీవనం సాగదు. ఒక రోజున పైవాలున కురిసిన వానల వల్ల బాహుదా నదికి వరద వచ్చింది. కూలి పనులు ముగించుకుని […]

Continue Reading
Posted On :

అనగనగా- నిజాయితీ నిద్రపోదు

నిజాయితీ నిద్రపోదు -ఆదూరి హైమావతి  మంతినవారి పాలెంలో ఉండే షాహుకారు శీనయ్య పట్టు చీరలు కొనను ధర్మవరం వెళ్ళవలసి వచ్చింది. శీనయ్య చాలా పీనాశి. బండితోలను మనిషినిపెట్టుకుంటే జీతమూ, బత్తెమూ వృధా అవుతాయని తానే బడితోలుకుంటూ బయల్దేరాడు. ఒక్కడే మూడు రోజులు బండి తోలుకుంటూ వెళ్లడం,ఆ ఎద్దులకు నీరూ, గడ్డీ వేసి, వాటిని కడగడం అన్నీ ఇబ్బందిగానే భావించి, ఏదో ఒక ఉపాయం దొరక్కపోతుందా అని ఆలోచిస్తూ బండి తోలుకు వెళుతుండగా దేవుడు పంపించినట్లు, ముందు ఒక […]

Continue Reading
Posted On :

అనగనగా- మార్పు

మార్పు -ఆదూరి హైమావతి  ఆరోక్లాస్ చదివే ఆనంద్ కు చదువుకంటే ఆటలంటేనే ఎక్కువ మక్కువ. తల్లి అన్నపూర్ణమ్మ ఎంతచెప్పినా చదువు జోలికే వెళ్ళడు. క్రికెట్ వాడికి ఆరోప్రాణం. క్రికెట్ మ్యాచ్ ఎక్కడజరుగుతున్నా తిండి సైతం మానేసి, బడిఎగ్గొట్టి, టి.వి.కి అతుక్కు పోతాడు. వాడి మూడునెలల పరీక్షల ప్రోగ్రెస్ కార్డ్ చూసి తండ్రి నాగేశం  ఎంతో బాధపడి వాడిని కోప్పడ్డా ఆనంద్ లో మార్పు లేదు. నాగేశం వాడిస్కూల్ కెళ్ళి క్లాస్ టీచరైన  గణపతి మాస్టార్ తో మాట్లాడాడు. గణపతి మాస్టర్  […]

Continue Reading
Posted On :

అనగనగా- సముద్రమంత మనసు

సముద్రమంత మనసు -ఆదూరి హైమావతి  అనగా అనగా ఒక అడవి. ఆ అడవిలో చాలా జంతువులూ, పక్షులూ ఇంకా చీమ వంటి చిన్న జీవులూ కూడా కలసి మెలసి ఎవరి పనులు వారు చేసుకుంటూ జీవించేవి. చీమలు చాలా శ్రమజీవులే కాక, జాగ్రత్త కలవికూడా, వాటికి ముందుచూపు ఎక్కువ. నిరంతరం పనిలోనే ఉంటాయి. రోజంతా అడవంతా తిరుగుతూ వర్షాకాలం కోసం ఆహారం మోసుకు తెచ్చుకుని తమ పుట్టలోని అరల్లో దాచుకుంటుంటాయి. అడవిలో ఎక్కడెక్కడ ఏ తినే వస్తువులున్నోయో […]

Continue Reading
Posted On :

అనగనగా- చిలుకపలుకు

చిలుకపలుకు -ఆదూరి హైమావతి  అనగా అనగా అనకాపల్లి అనేగ్రామ సమీపాన ఉండే ఒక చిట్టడవిలో ఒక పెద్ద మఱ్ఱిచెట్టు మీద చాలా పక్షులు గూళ్ళు కట్టుకుని నివసించేవి. ఆహారం కోసం వెళ్ళిన పక్షులు అన్నీ సూర్యాస్తమయానికంతా గూళ్ళు చేరుకుని, అంతా తాము చూసిన వింతల గురించీ కబుర్లు చెప్పుకునేవి. ఒకరోజున ఒక చిలుక తనగూట్లోంచీ మాట్లాడుతున్న మాటలు పక్షులన్నీ విని,”చిలకమ్మా! ఏం పాట పాడు తున్నావ్! కొత్త పాటలా ఉందే! చెప్పవా!” అని స్నేహ పూర్వకంగా అడిగాయి. […]

Continue Reading
Posted On :

అనగనగా- ఉచితం-అనుచితం

ఉచితం-అనుచితం -ఆదూరి హైమావతి  జ్యోతిష్మతి రాజ్యాన్నీ రజనీవర్మ అనే రాజు పాలించేవాడు.అతనికి కీర్తి కాంక్ష ఎక్కువ. ఎలాగైన తన తాతముత్తాతలను మరిపించేలా ప్రజలకు హితవు చేసి వారికంటే గొప్పపేరు తెచ్చుకోవాలనీ, తన తర్వాతి తరం వారంతా తన పేరే చెప్పుకోవాలనీ తెగ ఆశ పడుతూ ఏమి చేస్తే తన కోరిక తీరుతుందో అని రాత్రింబవళ్ళూ ఆలోచించేవాడు. అతనిరాజ్యం సుభిక్షంగా ఉండేది. పంటలు బాగా పండుతూ అంతా సుఖ సంతోషాలతో జీవించేవారు. కష్టపడి పనిచేసే తత్వం ప్రజలదంతా. ఎవ్వరూ  […]

Continue Reading
Posted On :

అనగనగా- తెలివైన మంత్రి

తెలివైన మంత్రి -ఆదూరి హైమావతి              అనగా అనగా అమరపురి అనే రాజ్యాన్ని  అమరవర్మ అనే రాజు పాలించేవాడు. అతనికి తనరాజ్యాన్ని విస్తరించాలనే ఆశపుట్టింది. యుధ్ధంచేసి పక్క రాజ్యాలను కలుపుకుని తానే  మహారాజు కావాలనీ, చుట్టుపక్కల రాజులంతా తనకు సామంతులుగా ఉండాలనే విపరీతమైన  కోరికతో నిద్రకూడా సరిగా పట్టకుండాపోయింది. ఆశమానవుని సుఖంగా ఉండనివ్వదు .             ఒకరోజున మహామంత్రిని పిలిచి తనకోరిక వివరించి, […]

Continue Reading
Posted On :

అనగనగా-దానం

 దానం -ఆదూరి హైమావతి  అనగా అనగా ముంగమూరులోని ప్రభుత్వపాఠశాలలో ఏడోతరగతి చదువు తున్నది ఊర్మిళ. ఊర్మిళ తండ్రికి ఆఊర్లో చాలా మామిడి ఇతర పండ్ల తోటలూ ఉన్నాయి. వాళ్ళ సైన్స్ పంతులుగారు పిల్లలను వృక్షా ల గురించిన పాఠం బోధిం చే ప్పుడు తోటల్లోకీ ,పంటపొలా ల్లోకీ తీసుకెళ్ళి చూపిస్తూ వివరంగా బోధించేవారు.   ఆరోజున మామిడి చెట్టు, పండులోని విటమిన్లూ, వ్యాపార పంటగా ఎలా మామిడి పెంచుకుంటారో వివరంగా  చెప్పాలని   ఊర్మిళ తండ్రి గారి అనుమతితో […]

Continue Reading
Posted On :