రాయలసీమ పాటకు ఆహ్వానం రాయలసీమ సాంస్కృతిక వేదిక ఆధ్వర్యంలో శ్రీయుత అప్పిరెడ్డి వెంకటరెడ్డి స్మారకార్థం రాయలసీమ పాటలను ఆహ్వానిస్తున్నాం. ఎంపికైన పాటలకు పదివేల రూపాయల మొత్తాన్ని బహుమతులుగా అందచేస్తాము. పాట రాయలసీమ నిర్దిష్ట జీవితాన్ని ప్రతిబింబించాలి. పాట ప్రక్రియ లక్షణాలు తప్పని సరిగా పాటించాలి. ఇరవై పాదాలకు మించకుండా ఉండాలి. ఈ పోటీల కోసమే కొత్తగా రాయాలి. అక్టోబరు నెల 15 వ తేదిలోపు రాసిన పాటను 9492287602 వాట్సప్ నెంబరుకు పంపాలి. దసరా సందర్భంగా అంతర్జాల వేదికలో ఏర్పాటు చేసే రాయలసీమపాట కార్యక్రమంలో తమ పాట ఎలా […]
తిమ్మాపురం బాలకృష్ణారెడ్డి స్మారక తొలి కథల పోటీ ప్రకటన తిమ్మాపురం బాలకృష్ణారెడ్డి తొలి స్మారక కథల పోటీని సారంగ పక్ష పత్రిక సౌజన్యంతో నిర్వహిస్తున్నాం. ఒకో కథకు పదివేలుగా మూడు ఉత్తమ కథలకు ముఫ్ఫైవేల రుపాయలు బహుమతిగా ఇవ్వాలని నిర్ణయించాం. కథలు అభ్యదయ భావాలతో సమాజాన్ని పురోగమనం దిశగా నడిపించేవై ఉండాలి. కథలు యూనికోడ్ వర్డ్ ఫార్మాట్ లో ఉండాలి. సొంత కథ అని హామీపత్రం కూడా తప్పనిసరిగా పంపాలి. కథలను15 అక్టోబర్ 2020 తేదిలోపు tbkr.sahityam@gmail.com మెయిల్ కు పంపాలి. *****
అమెరికాను ఉర్రూతలూగించిన మాడలిన్ -ఎన్.ఇన్నయ్య ఒకే ఒకసారి భారతదేశం సందర్శించిన మాడలిన్, హైదరాబాద్ లో మల్లాది సుబ్బమ్మ – రామమూర్తి మానవవాద దంపతులకు అతిథిగా వున్నది. ఆ తరువాత విజయవాడలో గోరా కుమారుడు లవణం, తదితరులతో కార్యక్రమాలు నిర్వహించింది. ఆమె ఫోటోను ముఖచిత్రంగా ప్రచురించిన ఆమెరికా సుప్రసిద్ధ పత్రిక టైం, “అమెరికా ద్వేషించే స్త్రీ” అని వర్ణించింది. ఎందుకని ఆమె వీర నాస్తికురాలు గనుక! హైదరాబాద్ లో మల్లాది వారితో వున్నప్పుడు నేను కలసి మాట్లాడాను. తరువాత […]