ఇగో—( అహం అడ్డు) (నెచ్చెలి-2024 కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ) -అయ్యలసోమయాజుల సుబ్రహ్మణ్యము రాత్రి జరిగింది మరిచిపోతే బెటర్……ఇదిగో కాఫీ; ఆలస్యంగా లేచారు కాబట్టి తొందరగా రెడీ అవ్వండి.’ అంటూనే న్యూస్యపేపర్లో దూరిపోయింది శారద. తను అప్పటికే రెడీ అయి వుందన్న విషయం అర్థమయ్యేసరికి నేనెప్పుడు లేచానో తెలిసింది నాకు. తను కూల్‌గా వుండడంతో నాకు గిల్టీగా అనిపించింది.అనవసరమైన రాద్దాంతం కదూ; మనసులో అనుకుంటూనే అద్దంలో నా మఖాన్ని నేను చూసుకున్నాను. కళ్ళు ఎరుపెక్కాయి. […]
దక్షిణ దేశ యాత్ర (భాగం – 1) (నవగ్రహ క్షేత్రాలు + పంచభూతలింగ క్షేత్రాలు + పంచ సుబ్రహ్మణ్య క్షేత్రాలు + రామేశ్వరము + కన్యాకుమారీ + మధుర మొదలగునవి) -అయ్యలసోమయాజుల సుబ్రహ్మణ్యము సాయికృష్ణా ట్రావెల్స్ ద్వారా జూలై తొమ్మిది బయలు దేరి పదినాడు ఉదయము 6.45Am కు ఎగ్మోర్ కు చేరుకున్నాము. అక్కడ కాలకృత్యములు మరియు ఉపాహార ములు సేవించి మరల తొమ్మిది గంటలకు తిరుచ్చి పయనమైతిమి. తిరుచ్చిచేరుకునే సరికి దాదాపు ఒంటిగంట అయినది. అచట […]
తెలుగు రచయిత— శ్రీమతి గంటి సుజల రచనా వైధుష్యం. -అయ్యలసోమయాజుల సుబ్రహ్మణ్యము సుజల గారు రచనా వ్యాసాంగం 2011 నుంచి చేపట్టారు. ఇప్పటి వరకూ ఆరు నవలలు ప్రచురితమైనాయి. స్వాతీ పత్రిక వారి అనిల్ అవార్డ్, ఆంధ్రజ్యోతి, ఆంధ్ర భూమి, జాగృతి, మరియు వివిధ వెబ్ మ్యాగజైన్లు వీరి రచనలు ప్రచురితమైనాయి. వీరి నవల “అమ్మ బంగారు కల” కు మూడు పురస్కారాలు లభించాయి. తానా వారు కూడా వీరి రచనలను చిన్న పిల్లల విభాగంలో ప్రచురించారు. […]
సాహసయాత్ర- నేపాల్ -అయ్యలసోమయాజుల సుబ్రహ్మణ్యము అద్భుతమైన, సాహసవంతమైన నేపాల్ యాత్రా విశేషాలు. ఆద్యంతము ఆహ్లాదకరమైన ప్రకృతి, గగుర్పాటు కలిగించే ప్రయాణాలు, మనసోల్లాసము కలిగించే చక్కటి హిమబిందువులతో కూడిన పిల్లగాలులు. అన్నీ కలిసి మనలను ఎక్కడకో మరో లోకానికో, సుందర సుదూర తీరాలకు గొంపోవుచున్న అనుభూతులు.” ఇదిగో నవలోకం వెలసే మనకోసం”యన్నట్లు సాగింది. మార్చి 23 న హైద్రాబాద్ లో బయలుదేరి ఫ్లైట్ లో బెంగళూరు చేరుకున్నాము. అరగంట తరవాత బెంగుళూరు నుండి మరొక ఫ్లైట్ లో గోరఖ్‌పూర్ […]