image_print

నీకు నా కృతజ్ఞతలు ప్రభూ (కవిత)

నీకు నా కృతజ్ఞతలు ప్రభూ -హేమావతి బొబ్బు దప్పికతో ఒయాసిస్సులు వెదకుచూ ఎండమావుల వెంట పరుగులు తీస్తున్నపుడు గుక్కెడు నీటిని ఇచ్చి దప్పికను తీర్చినందుకు నీకు నా కృతఙ్ఞతలు ప్రభూ ఆకలితో నకనక లాడుచున్న కడుపును చేతబట్టి దేశదిమ్మరినై తిరుగుతున్నపుడు గుప్పెడు మెతుకులతో ఆకలిని తీర్చినందుకు నీకు నా కృతఙ్ఞతలు ప్రభూ నాది నా వాళ్లంటూ  ప్రాణం పోయినా మమకారాన్ని చంపుకోలేక నా ఆత్మ దిక్కులేక ఆక్రోశిస్తున్నపుడు అమ్మ కడుపులో ఊపిరి పొసినందుకు నీకు నా కృతఙ్ఞతలు ప్రభూ లోకం పోకడ తెలియక బుడి బుడి నడకలతో చెడుబాట పట్టినపుడు నడక నేర్పడానికి తండ్రివి నీవై నందుకు నీకు నా కృతఙ్ఞతలు ప్రభూ కడుపు నిండిన మనస్సు పండక ప్రేమను కోరుతున్న కట్టెని కాల్చడానికి  నా గుండె దాహాన్ని తీర్చడానికి ప్రియురాలి వై, భార్య వైనందుకు నీకు నా కృతఙ్ఞతలు ప్రభూ వాలుతున్న శరీరాన్ని వసంతంలో నింపడానికి వయస్సుడుగుతున్నపుడు నా భుజాల చుట్టూ చేతులు వేసి నన్ను నడిపించడానికి నా బిడ్డవైనందుకు నీకు నా కృతఙ్ఞతలు ప్రభూ నాకు పునరుజ్జీవితం ఇవ్వడానికి నాకు మరణాన్ని ప్రసాదిస్తున్నందుకు నీకు నా కృతజ్ఞతలు ప్రభూ ***** హేమావతి బొబ్బునేను హేమావతి బొబ్బు తిరుపతి వాసిని, ప్రాధమిక విద్య తిరుమల శ్రీ వెంకటేశ్వర ఉన్నత పాఠశాలలో, […]

Continue Reading
Posted On :