మా కథ -దొమితిలా చుంగారా- 15

మా కథ  రచన: దొమితిలా చుంగారా  అనువాదం: ఎన్. వేణుగోపాల్  దొమితిలా జీవితం- సైగ్లో – 20 గృహిణుల సంఘం ఆయన చెప్పిందాని సారాంశమేమంటే కొమిబొల్ ఆర్థికంగా చితికిపోయి కూలిపోవడానికి సిద్ధంగా ఉంది. కొమిబొల్కు ఎన్నో అప్పులున్నాయని ఆయన చెప్పాడు. ఆ అప్పులు తీర్చకపోతే బొలీవియాకు ఉన్న విదేశీ వ్యాపారాలు రద్దయిపోతాయి. ఇలా ఆయన ఇంకేమిటేమిటో చెప్పుకొచ్చాడు. వెంటనే జనం “… రోజులిట్లా ఉంటే మనం కం పెనీని కాపాడుకోవడం కన్నా చేసేదేముంది? మనం తొందరపాటుగా ఈ […]

Continue Reading
Posted On :

మా కథ -దొమితిలా చుంగారా- 14

మా కథ  రచన: దొమితిలా చుంగారా  అనువాదం: ఎన్. వేణుగోపాల్  దొమితిలా జీవితం- సైగ్లో – 20 గృహిణుల సంఘం ఇంతలో మాకు రేడియోద్వారా ఒక సమాచారం తెలిసింది. క్షతగాత్రుల్ని తీసుకుపోతున్న ట్రక్కు సరిగా ఎక్కడుందో గుర్తించగలిగాం. కాని సైన్యం ఎవరినీ, చివరికి అంబులెన్సును కూడా ట్రక్కు దగ్గరికి వెళ్ళనివ్వడం లేదు. “అక్కడి కెలాగైనా వెళ్ళాలి. తప్పకుండా వాళ్ళదగ్గరికెళ్ళాలి” అని జనం కోరడం మొదలెట్టారు. కాని మాకు వాహనాలేమీ లేవు. కనుక స్త్రీలందరూ బయల్దేరి లాలాగువా ప్రజల […]

Continue Reading
Posted On :

మా కథ -దొమితిలా చుంగారా- 13

మా కథ  రచన: దొమితిలా చుంగారా  అనువాదం: ఎన్. వేణుగోపాల్  దొమితిలా జీవితం- సైగ్లో – 20 గృహిణుల సంఘం నన్ను ఉత్తేజ పరచిన సంగతి మరొకటుంది. ఖైదీలు మమ్మల్ని మచ్చిక చేసుకోవడానికి మాకు చాకొలెట్లు, సిగరెట్లు, క్యాండీలు ఇస్తుండేవారు. వాళ్ళు తినేటప్పుడు మేం కనబడడం తటస్థిస్తే మమ్మల్ని కూడా తిండికి ఆహ్వానించేవాళ్ళు. కొందరు అమాయకమైన స్త్రీలం వాళ్ళిచ్చేవి తీసుకున్నాం. నేను కూడా తీసుకునేదాన్నే – నేను కొన్నిసార్లు సిగరెట్లు తీసుకున్నాను. కాని ఓ రోజు జెరోమా […]

Continue Reading
Posted On :

మా కథ -దొమితిలా చుంగారా- 12

మా కథ  రచన: దొమితిలా చుంగారా  అనువాదం: ఎన్. వేణుగోపాల్  దొమితిలా జీవితం- సైగ్లో – 20 గృహిణుల సంఘం నా భర్త అక్కడ ఉన్నాడా? అని అడుగగానే ఆయన నా కోసం బయటికి వచ్చాడు. ఆయన రాత్రంతా కాపలా కాస్తూ అక్కడ నిలబడి ఉన్నాడట. నన్ను చూడగానే ఆయన చాలా సంతోషంగా “చూశావా, వాళ్ళు మన నాయకులను లోపాజ్లో ఖైదీలుగా పెట్టారు. మనం విదేశీయులను ఇక్కడ పట్టుకున్నాం. స్త్రీలు, మేమూ కలిసి కాపలా కాస్తున్నాం” అన్నాడు. […]

Continue Reading
Posted On :

మా కథ -దొమితిలా చుంగారా- 11

మా కథ  రచన: దొమితిలా చుంగారా  అనువాదం: ఎన్. వేణుగోపాల్  దొమితిలా జీవితం- సైగ్లో – 20 గృహిణుల సంఘం ఇంకా నలభైశాతం మంది పురుషులు తమ స్త్రీలు సంఘటితం కావడాన్ని వ్యతిరేకిస్తున్నారని నేను అనుకుంటున్నాను. ఉదాహరణకు కంపెనీలో ఉద్యోగం  పోతుందని కొందరు భయపడుతున్నారు. నా పనివల్ల నా భర్త పొందిన కష్టాల్లాంటివి తమకి కూడా వస్తాయని కొందరు భయపడుతున్నారు. మరికొందరు తమ భార్యల గురించి జనం చెడ్డగా చెప్పుకుంటారని భయపడుతున్నారు. ఎందుకంటే మా ప్రవర్తన చూస్తూ […]

Continue Reading
Posted On :

మా కథ -దొమితిలా చుంగారా- 10

మా కథ  రచన: దొమితిలా చుంగారా  అనువాదం: ఎన్. వేణుగోపాల్  దొమితిలా జీవితం- సైగ్లో – 20 గృహిణుల సంఘం బర్డోలాలతో ఘర్షణ అయిపోయాక స్త్రీలందరూ తామెక్కడి నుంచి తరిమేయబడ్డారో అక్కడికి చేరుకొని నిరాహారదీక్ష ప్రారంభించారు. ఆ రాత్రి సాన్ రోమాన్ వాళ్ళ దగ్గరికి వచ్చాడు. సాన్ రోమాన్ క్రూరమైన ముఖాన్ని చూడడం వాళ్ళెవరికీ ఇష్టం లేకపోయింది. మహిళల్లో నుంచి ఒకావిడ లేచి సాన్ రోమాస్ ముందుకొచ్చి “సాన్ రోమాన్, మీ తలారుల్నించి రక్షించుకోడానికి మా దగ్గర […]

Continue Reading
Posted On :

మా కథ -దొమితిలా చుంగారా- 9

మా కథ  రచన: దొమితిలా చుంగారా  అనువాదం: ఎన్. వేణుగోపాల్  దొమితిలా జీవితం సైగ్లో – 20 నిజం చెప్పాలంటే 1952 ప్రజా విప్లవం తర్వాత అధికారానికి వచ్చిన ఎమ్.ఎన్.ఆర్. మనుషులు కొంచెం ఆశపోతులు. అందుకనే తమను తాము “విప్లవకారులు”గా ప్రకటించుకున్నప్పటికీ వీళ్ళను కొనేసే అవకాశాన్ని సామ్రాజ్యవాదం వినియోగించుకుంది. ఈ రకంగా జాతీయ సంపదతోనే ఒక కొత్త లంచగొండి బూర్జువా వర్గం తలెత్తింది. అన్ని రంగాలలోనూ లంచగొండితనం ప్రబలమైపోయింది. దాని ఏజెంట్ల, కార్మిక ప్రతినిధులు, రైతాంగ నాయకులు, […]

Continue Reading
Posted On :

మా కథ -దొమితిలా చుంగారా- 8

మా కథ  రచన: దొమితిలా చుంగారా  అనువాదం: ఎన్. వేణుగోపాల్  దొమితిలా జీవితం సైగ్లో – 20 నేను నా భర్తను కలుసుకున్న కొన్నాళ్ళకే దాదాపు యాదృచ్ఛికంగా నా పుట్టిన ఊరికి, సైగ్లో-20కి వచ్చాను. ఆ ఊరే నాకు పోరాడడం నేర్పింది. నాకు ధైర్యం ఇచ్చింది. ఇక్కడి జనం జ్ఞానమే నేను అక్రమాల్ని స్పష్టంగా చూడడానికి తోడ్పడింది. ఆ ఊరు నాలో రగిల్చిన అగ్నిని ఇక చావు తప్ప మరేదీ ఆర్పలేదు. పులకాయోలో ఉన్నప్పుడు సైగ్లో-20కి వెళ్ళి […]

Continue Reading
Posted On :

మా కథ-7 దొమితిలా జీవితం

మా కథ  రచన: దొమితిలా చుంగారా  అనువాదం: ఎన్. వేణుగోపాల్  దొమితిలా జీవితం పులకాయోలో నా బాల్యం-3 మర్నాడు నేను మళ్ళీ బడిదగ్గరికి వెళ్లి కిటికీలోంచి లోపలికి చూశాను. టీచర్ నన్ను పిలిచాడు. “నువ్వింకా పుస్తకాలు తెచ్చుకోలేదు గదూ” అన్నాడు. నేను జవాబివ్వలేకపోయాను. ఏడుపు మొదలు పెట్టాను. “లోపలికి రా! పోయి నువు రోజూ కూచునేచోట కూచో. బడి అయిపోయినాక కాసేపాగు” అన్నాడు. ఆ సమయానికే మా తరగతిలో ఒకమ్మాయి మా అమ్మ చనిపోయిందనీ, పిల్లలను నేనే […]

Continue Reading
Posted On :