“నెచ్చెలి”మాట 

స్త్రీల ఆత్మగౌరవం

-డా|| కె.గీత 

ఆత్మగౌరవం!

అంటే

ఆత్మకి
గౌరవం?

అయ్యో..

స్త్రీల
ఆత్మగౌరవం
మాటండీ!

స్త్రీలకి గౌరవమే
అతి కష్టం

ఇక
ఆత్మగౌరవం
కూడానా?!

అసలు
ఎవరైనా
ఆలోచిస్తున్నారా?!

ప్రపంచం-
దేశం-
సమాజం-
అంత వరకూ ఎందుకు?
కనీసం
కుటుంబం-

స్త్రీల
ఆత్మగౌరవం
విషయమై
ఎవరో
ఎందుకు
ఆలోచిస్తారు?

ఎవరికి
వారే
ఆలోచించుకోవాలి!

అదీ..
ఇప్పుడు సరిగ్గా
ఆలోచిస్తున్నాం

ఆత్మగౌరవం
ముఖ్యంగా
స్త్రీలకి
ఆత్మగౌరవం

ఎవరూ
ఇచ్చేది
కాదు-
స్వయంగా
గుర్తించేది

స్త్రీలకి
ఆత్మగౌరవం
అన్న
ఆలోచన కూడా
భరించలేని వారు
అసలా
ఆలోచనే లేనివారు

ఇచ్చేది
అసలే కాదు-

స్వయంగా
గుర్తించేది-

అవును
మన
ఆత్మాభిమానాల్ని
మన ఆత్మగౌరవాల్ని
మనమే
మొదట
గుర్తించాలి!
మనమే
మొదట
గౌరవించాలి!

అప్పుడే
మహిళా
దినోత్సవాలకు
అర్థమూ
పరమార్థమూ!!

——–

నెచ్చెలి
నెచ్చెలులందరికీ
ప్రపంచ
మహిళా
దినోత్సవ
శుభాకాంక్షలు!

****

నెచ్చెలి పాఠకులందరికీ సదవకాశం: 

ప్రతినెలా నెచ్చెలి  పత్రికలో వచ్చే   రచనలు / “నెచ్చెలి” యూట్యూబ్ ఛానెల్లో వచ్చిన ఆర్టికల్స్ వేటిపైనైనా వచ్చిన కామెంట్ల నించి ప్రతి నెలా ఒక ఉత్తమ విశ్లేషణాత్మక కామెంటుని ఎంపిక చేసి  ప్రకటిస్తాం. పాత రచనల మీద కూడా కామెంట్లు చెయ్యవచ్చు.

మరింకెందుకు  ఆలస్యం? రచనల్ని చదివి వివరంగా కామెంట్లు పెట్టడం ప్రారంభించండి.

వినూత్నం, వైవిధ్యం ప్రధాన నిలయాలైన  “నెచ్చెలి”లో  వస్తున్న వివిధ వినూత్న రచనల్ని తప్పక చూసి, చదివి ఆనందిస్తారు కదూ!

*****

ఫిబ్రవరి, 2025 లో ఎంపికైన ఉత్తమ కామెంటు రాసిన వారు:  సురేఖ పులి  

ఉత్తమ కామెంటు అందుకున్న పోస్టు:సక్సస్ (కథ)-తెలికిచెర్ల విజయలక్ష్మి

 ఇరువురికీ  అభినందనలు!

****

Leave a Reply

Your email address will not be published.