image_print

నీవో బ్రతుకు మెట్టువు (కవిత)

నీవో బ్రతుకు మెట్టువు -డా. కొండపల్లి నీహారిణి టీ నీళ్ళు మరుగుతున్నాయి కమ్మని వాసన తన రుచులు అవి అని గొప్పలుబోతున్నది ఉదయం వెంటేసుకొచ్చే హుషారు సమయాలు చేయాల్సిన పని ఒక్కటే వెన్నంటి ఉన్న విషయాన్ని కాసేపు మరచిపొమ్మన్నది ఎల్లలు లేనిది ఆకాశానికే కాదు హృదయాలకు కూడా! కావాల్సినంత ఓపిక కాలేని విసుగు మసిగుడ్డను పక్కన్నే పడిఉన్న పట్కారును పక్క దిగని పిల్లలను పనికెళ్ళాల్సిన పెనిమిటినీ సముచిత భావముద్రలుగా ఆమెతోబాటు గాంభీర్యం ప్రదర్శిస్తున్నాయి తద్ధితాలో కృదంతాలో మాటమాటకు […]

Continue Reading

స్త్రీవాద గొంతుకను బలంగా వినిపిస్తున్న’అపరాజిత’

 స్త్రీవాద గొంతుకను బలంగా వినిపిస్తున్న’అపరాజిత’   -డా. కొండపల్లి నీహారిణి           కవిత్వం ఎమోషన్స్ ను, ఇమాజినేషన్ ను, థాట్స్ ను అంతర్భాగంగా కలిసి ఉండడంతో పాఠకులలో భావోత్ప్రేరణ కలిగించడంలో సఫలీకృతం కావాలి. అదే గొప్ప కవిత్వం అవుతుంది. గొప్ప కవిత్వం అంటే ఆ కవిత చెప్పే సంవేదన ఏమిటి ? పాఠకుల కు వస్తువు విశేషాలను సరిగ్గా చేరవేయడం అనేది ముఖ్యమైనటువంటి విషయం. ‘అపరాజిత ‘ కవితా సంపుటిలో స్త్రీల […]

Continue Reading

నల్లబడిన ఆకాశం (కవిత)

నల్లబడిన ఆకాశం – డా॥కొండపల్లి నీహారిణి కొంత చీకటి తలుపు తెరుచుకొని వచ్చాక నిన్నటి కారు మేఘం క్రోధమంతా మరచినప్పుడు కొత్త దారిలో చూపుగాలానికి చిక్కుతుంది మసక బారిన దృశ్యాలు కంటి తెరపై టచ్చాడి ఉచ్చులు విడదీసుకుంటూ పెనవేసుకుంటూ గది మొత్తం కథలా కదలాడుతుంది పెదవి విరిచిన ముసలినవ్వొక్కటి నువ్వు పుట్టినప్పటి సంగతులు గతితప్పనీయని మజిలీలనుకున్నది మబ్బులు కమ్మిన నింగి వెనుక ఏమి దాగుందో చీకటిలో కలవాలనే హృదయ జ్యోతులు వ్యధాభరిత వృద్ధాప్యానికి పెనుసవాళ్ళనేమీ విసరవు సన్నగిల్లిన […]

Continue Reading

ప్రముఖ రచయిత్రి కొండపల్లి నీహారిణి గారితో నెచ్చెలి ముఖాముఖి

https://youtu.be/nGYBA4SF3Rc?t=2 ప్రముఖ రచయిత్రి కొండపల్లి నీహారిణి గారితో నెచ్చెలి ముఖాముఖి -డా||కె.గీత  (నీహారిణిగారితో నెచ్చెలి ప్రత్యేక ముఖాముఖి వీడియోని పైన ఇస్తున్నాం. చూసి, మీ అభిప్రాయాలు తప్పక తెలియజెయ్యండి.) ***           డా॥ కొండపల్లి నీహారిణి కవయిత్రి, రచయిత్రి, సాహిత్య విమర్శకురాలు, వక్త . ‘మయూఖ’ అంతర్జాల ద్వై మాసిక సాహిత్య పత్రిక, ‘తరుణి’ స్త్రీ ల అంతర్జాల వారపత్రిక సంపాదకురాలు.           కవితా సంపుటులు, కథాసంపుటి, […]

Continue Reading
Posted On :

నెల పండుగ (కవిత)

నెల పండుగ – డా॥కొండపల్లి నీహారిణి రాతపూతల్లో కవి దోగాడి భావ ధూళి కనిపించిన కన్నులతో నిన్నటి రోజును దోసిట్లో పోసినప్పుడు నేల దాచిన రహస్యాల్ని వెలికి తీయాలి తరాల తరబడి ఎరుపు దుఃఖ సాగరాలను తనతో తెచ్చుకున్న జాతి అంతా నాలుగు రోజుల గుండె బరువు కన్నీటి మడుగులో కడిగి దింపలేని ఇరుకును మనసు గోడలకు తెలియని కడుపుదేనని ఐదు దశాబ్దాల నిశ్శబ్ద క్షుత్తు నొప్పి నుండి దాటిరాలేని బతుకు భ్రమ భ్రమలు బతుకైనప్పుడు దాటిరాగల […]

Continue Reading

మానవీయ కోణాల ఆవిష్కరణలతో నీహారిణి కవిత్వం…!

మానవీయ కోణాల ఆవిష్కరణలతో నీహారిణి కవిత్వం…! -దాస్యం సేనాధిపతి “ఖాళీఅయిన మౌనం నుండి కనులు మూయని నిద్ర నుండి నిండిన నింగిదుఃఖాగ్నిని అద్ది సమాంతరరేఖలకు ఎర్రని చెమటలు పట్టిస్తాను” అంటూ సవినయంగా, సగర్వంగా ప్రకటించుకున్న కవయిత్రి డా|| కొండపల్లి నీహారిణిగారు…. “కాలప్రభంజనం” పేరుతో తమ నాలుగో కవితాసంపుటిని వెలువరించారు. తమ మామగారైన  చిత్రకళా తపస్వి డా|| కొండపల్లి శేషగిరిరావు జీవిత చరిత్ర, వారి వ్యాసాలన్నింటినీ ఏర్చికూర్చి “చిత్రశిల్పకళా రమణీయము” పేరుతో ఓ గ్రంథాన్ని తీసుకొచ్చారు. ఒద్దిరాజు సోదరుల పై […]

Continue Reading

గృహవాసం (కవిత)

గృహవాసం – డా॥కొండపల్లి నీహారిణి అంతు తెలియని ఆలోచనలు ఆరబోస్తూ గుప్పిటబట్టని దినపత్రికయ్యింది నా మనసు ఇప్పుడు. వంటర్రకు ఏదో కొత్త వెలుగు సహాయజ్యోతి ప్రసరిస్తున్నది! కూరలో కారమెంతేయాలని కారణాన్ని వెతుకుతూ, గంటె తిప్పనీయక ఖాళీ సమయాన్నిచ్చిన విచిత్ర కాలానికో నమస్కారం!! నాలో నేను రంగులేసుకున్న బొమ్మనై, నవ్వుల్ని విచ్చుకుంటుంటే, మరో ఆశ్చర్యం ముందటర్ర వరకూ తీసుకుపోయింది. వాళ్ళమ్మకు అందిచ్చినట్టే మా అమ్మకూ ఆయన చాయగిలాసనిస్తుంటే, ఇనుమడించిన గౌరవాలకు హృదయ ఛాయ ఒకటేదో చెప్పని సాక్ష్యమయ్యింది నేను […]

Continue Reading

కలలు (కవిత)

కలలు – డా॥కొండపల్లి నీహారిణి వెన్నెల కాసారపు వన్నెల రేడు కలల తీరపు కనుల కొలనులో కలువల విలాసంలా మునకలేస్తు ప్రశ్నల పరంపరను సంధిస్తున్నాడు విజయ రథం మోసిన పనుల పూరెమ్మలు రోజు ఒక్క పరిమళాన్ని వెదజల్లి అధికార అనధికార గాజు పాత్రలో నింపినప్పుడు అభివృద్ధి ఒత్తిడీ విడదీయరాని బాంధవ్యాల సుగంధాలు మోసుకొస్తూ చెమట చుక్కల లెక్కలు ఎందుకు అన్నప్పుడు సాయం సమయపు యానం ఏమీ ఆనంద విమానం ఎక్కనప్పుడు నిమిషాలు గంటలుగా విరాజిల్లే నాలుగు చక్రాల […]

Continue Reading

రసహృదయాలు – రాగ రంజితాలు

రసహృదయాలు – రాగ రంజితాలు -డా. కొండపల్లి నీహారిణి గరికపూలెత్తిన నేలమీద నడకలు నేర్చిన నీవు జాతి వైరుధ్యాల మాటలనే మూటలుగా ఎత్తుకోవుగానీ గోడకేసిన బంతి నీచేతికే వచ్చినట్లు ఇక్కడేవో కొన్ని ఉత్తుంగ తరంగ భావాలు శుభారంభాల కోసం ఓ పండగ కొత్తగా మళ్ళీ వచ్చింది. ఇంటిముందు పూలమొక్కను ఎందుకు నాటుతున్నామో తెలిసీ తెలియనితనంతో మొత్తం సముద్రాన్నంతా ఎత్తిపోసినట్లు పెళ్ళి గురించి ఏవేవో అధిక ప్రసంగాలు షడ్రసోపేతమైన జీవితాన్ని కావాలనుకునేప్పుడు ఒకరికోసం ఒకరు వస్తు గుణేపంతంగా మారుతుండాలి […]

Continue Reading

నెట్టింట్లగాదు, నట్టింట్ల (కవిత)

నెట్టింట్ల గాదు, నట్టింట్ల -డా. కొండపల్లి నీహారిణి మాటతూలుల మూటలుగట్టే మాయాజాల మర్మాల లోహ లోకంలో ఇప్పుడు వెలగాల్సింది నెట్టింట్లగాదు , నట్టింట్ల ! అరాచక క్రియా విధ్వంసకాల్లో అరచేతి అందాలబొమ్మగా గాదు మెట్టినింటి కీర్తికి, పుట్టినింటిప్రతిష్టవుగా! నెట్టింట్లగాదు నట్టింట్ల ! మనోమందిర ప్రాంగణాన , మానవమాన తీరంపై నిలిచిన నావ సంసారసాగరానిదే గనక అయితే మెత్తటిమాటై, గట్టి నిర్ణయమై శక్తియుక్తుల నాన్నవై , వెరవని పనివై నెరసిన తలలకు తల్లీదండ్రివై , ఈ నిరాదరణ అలల […]

Continue Reading