ప్రముఖ రచయిత్రి కొండపల్లి నీహారిణి గారితో నెచ్చెలి ముఖాముఖి

-డా||కె.గీత 

(నీహారిణిగారితో నెచ్చెలి ప్రత్యేక ముఖాముఖి వీడియోని పైన ఇస్తున్నాం. చూసి, మీ అభిప్రాయాలు తప్పక తెలియజెయ్యండి.)

***

          డా॥ కొండపల్లి నీహారిణి కవయిత్రి, రచయిత్రి, సాహిత్య విమర్శకురాలు, వక్త . ‘మయూఖ’ అంతర్జాల ద్వై మాసిక సాహిత్య పత్రిక, ‘తరుణి’ స్త్రీ ల అంతర్జాల వారపత్రిక సంపాదకురాలు.

          కవితా సంపుటులు, కథాసంపుటి, వ్యాస సంపుటాలు, జీవిత చరిత్రలు, యాత్రా చరిత్ర, పరిశోధన గ్రంథం, సంపాదక పుస్తకాలు వంటి 13 పుస్తకాలను ప్రచురించారు.  ‘కాల ప్రభంజనం’ కవితా సంపుటి “Tempest Of Time” అనే పేరుతో  ఇంగ్లీష్ లోకి అనువదించబడింది. 

          నీహారిణి ఎం . ఏ. తెలుగు , తెలుగు పండిత శిక్షణ చేసి ఇరవై సంవత్సరాలు పాఠశాల బోధనా రంగంలో ఉద్యోగం చేసారు.” ఒద్దిరాజు సోదరురుల జీవితం సాహిత్యం” పైన ఉస్మానియా విశ్వవిద్యాలయం పరిశోధన చేసి డాక్టరేట్ పట్టా పొందారు. ఈ పరిశోధన సాహిత్యాన్ని 700 పేజీల గ్రంథంగా ప్రచురించారు. వీరు రచించిన కొండపల్లి శేషగిరిరావు గారి జీవిత చరిత్ర గ్రంథానికి తెలుగు విశ్వవిద్యాలయం వారి పురస్కారం అందుకున్నారు.  నీహారిణి ఎన్నో సాహిత్య సభలలో ఉపన్యాసాలు ఇచ్చారు, కవి సమ్మేళనాలలో పాల్గొన్నారు.

 రచనలు:

  1. అర్ర తలుపులు (కవితా సంపుటి)
  2. వ్యాసహారిక (వ్యాస సంపుటి)
  3. కళాతపస్వి కొండపల్లి శేషగిరిరావు (జీవిత చరిత్ర)
  4. బహుముఖ ప్రజ్ఞాశాలురు ఒద్దిరాజు సోదరులు (జీవిత చరిత్ర)-తెలుగు అకాడమి
  5. ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంలో ‘పెండ్యాల రాఘవరావు – జీవిత ప్రస్థానం’ – తెలుగు అకాడమీ
  6. జ్వలిత చేతనం-ఒక యోధుడి గాధ (జీవిత చరిత్ర)
  7. అమెరికాలో ఆరునెలలు (యాత్రా చరిత్ర)
  8. చిత్రశిల్ప కళా రామణీయకం (సంపాదకత్వం)
  9. నా ప్రజా జీవితం (సంపాదకత్వం)
  10. బందూక్ నవల – సమగ్ర విశ్లేషణ
  11. నిర్నిద్రగానం (కవితా సంపుటి)
  12. కళాసిరి – కొండపల్లి శేషగిరిరావు జీవిత చరిత్ర – తెలుగు అకాడమీ
  13. తెలంగాణ వేగుచుక్కలు ఒద్దిరాజు సోదరులు – పరిశోధనా గ్రంథం

బహుమతులు:

  1. ‘షీ’ అవార్డు (అర్ర తలుపులు)
  2. కవితా సాహితీ సాంస్కృతిక సంస్థ (అర్ర తలుపులు)
  3. మానస ఆర్ట్స్ థియేటర్స్ ప్రతిభా పురస్కారం (అర్ర తలుపులు)
  4. జి.వి.ఆర్. ఆరాధన కల్చరల్ ఫౌండేషన్ బహుమతి (అర్ర తలుపులు)
  5. కాళోజీ కవితా పురస్కారం (జగిత్యాల)
  6. ద్వానాశాస్త్రి అవార్డు (కొండపల్లి శేషగిరిరావు జీవిత చరిత్ర)
  7. లయన్స్ క్లబ్ అవార్డు (గురుపూజా దినోత్సవం)
  8. తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కారం
  9. ‘కమలమ్మ స్మారక’ ఆత్మీయ పురస్కారం

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.