Expiration (కవిత)

Expiration -బండి అనూరాధ వెళ్ళిపోతే వెళ్ళిపోయావు. ఈ దిగులునూ పట్టుకునివెళ్ళవలసింది.చేతులు ఖాళీలేకపోతేనేం.మనసు అరలో కుక్కుకునైనాపోవలసింది. ఏకాంతాలదొంతరని తివాచీలా పరచి రాజసంగా నడిచి వెళ్ళిపోయావు. దేదీప్యమాన జ్ఞాపకాల రత్నాలు నలిగి అలిగి ప్రకాశించడం మానేసాయి.  మళ్ళీ వస్తావని నా చుట్టూ ఉన్న ఏ పరిసరమూ నమ్మదు. నేనెలా నమ్మేదీ.  మోహం సడలి మైకం వదిలిహ్మ్ ..మజిలీలుండవు.  ముగింపులే Continue Reading

Posted On :