- ‘నెచ్చెలి’ లో స్త్రీలు (లేదా) స్త్రీలకు సంబంధించిన రచనలు (పురుషులు రాసినవైనా) ప్రచురణకు తీసుకోబడతాయి. ఏ రచన అయినా స్త్రీలను కించపరిచేదిగా ఉన్నట్లయితే నిర్ద్వంద్వంగా తిరస్కరించబడుతుంది.
- మీ రచన విధిగా యూనీకోడ్ లో టైప్ చేసి ఉండాలి.
- రచనలు తప్పనిసరిగా అచ్చుతప్పులు లేకుండా ఉండాలి.
- రచనలు ఈ-మెయిలు కు వర్డ్ డాక్యుమెంట్ గా జతచేసిగానీ, డైరక్టుగా ఈ-మెయిలు లో రాసి గానీ పంపించాలి. పిడిఎఫ్ లు, చేతివ్రాత తో రాసి పంపిన ఫోటోలు వంటివి స్వీకరించబడవు.
- రచనలతో పాటూ ‘నెచ్చెలి’ లోప్రచురణకు హామీపత్రం తప్పనిసరిగా ఈ-మెయిలుకి జతచేయాలి.
- నెచ్చెలి ప్రతినెలా 10 వ తారీఖున వెలువడుతుంది.
- మీ రచనలను ప్రతినెలా ఒకటవ తారీఖుకు editor.neccheli@gmail.com కు తప్పనిసరిగా అందేలా పంపించండి. ఆ తరువాత అందిన రచనలేవైనా ప్రచురణార్హం అయినట్లయితే తరువాతి నెలలో ప్రచురింపబడతాయి.
- మొదటి సారి ‘నెచ్చెలి’ కి మీ రచనని పంపుతున్నట్టయితే మీ ఫోటో, 5 లేదా 6 వాక్యాల్లో బయోడేటా కూడా పంపించండి.
- ఇంతవరకు ఎక్కడా ప్రచురితం కాని రచనలు మాత్రమే పంపాలి.
- ‘నెచ్చెలి’ కి మీ అభిప్రాయాలూ, సూచనలూ editor.neccheli@gmail.com కు తెలియజేయండి.
- *‘నెచ్చెలి’ లో ప్రచురించిన వారం రోజుల లోపులో మీ రచనని మీ సొంత బ్లాగుల్లో, ఫేస్ బుక్ లాంటి సైట్లలో ప్రచురించుకోదలచుకుంటే ‘నెచ్చెలి’ లింక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు.
నమస్కారం
చాలా ఆలస్యంగా మహిళల కోసం నెచ్చెలి అనే పత్రిక ఉంది అని తెలుసుకున్నందుకు నన్ను నేను నిందించుకుంటున్న..
.ఎప్పుడో..చదివిన వనిత, వనితాజ్యోతి వంటి పత్రికల్ని మళ్ళీ చూస్తున్నంత ఆనందంగా ఉంది…అన్ని శీర్షికలు .చాలా…బావున్నాయి…..
థాంక్స్ అరుణ కుమార్ గారూ! మీకు నెచ్చెలి పత్రిక నచ్చుతుందని ఆశిస్తాను. – ఎడిటర్
సంవత్సరం పాటు దిగ్విజయంగా నడిచిన నెచ్చెలిని మొదటిసారి ఇప్పుడే చూసాను. నిజంగా చాల సంతోషంగా వుంది, స్త్రీల కోసం ఒక అంతర్జాల పత్రిక వుండడం. ప్రభుత్వ కళాశాలలో పని చేసిన అమ్మాయి అనగానే, ఒక ఆత్మీయత ( నేను ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్ గా రిటైర్ అయ్యాను), ప్రముఖ రచయిత్రి కె.వరలక్ష్మి గారమ్మాయి అనగానే మరింత అభిమానం. దుర్గ, మల్లమ్మ వంటి కథలు చాల బాగున్నాయి. గత సంచికలు అన్నీ చదవాలి అన్న ఉత్సుకతతో , ప్రస్తుతానికి సెలవు.
సుశీల గారూ! మీవంటి ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్ గారికి నెచ్చెలి నచ్చినందుకు గర్వకారణంగా ఉంది. పత్రికను చదివి, కామెంట్ పెట్టినందుకు చాలా సంతోషమండీ. మీకు నచ్చిన రచనల దగ్గర కూడా కామెంట్స్ పెట్టగలరా? రాసిన వారికి ఉత్సాహాన్ని ఇస్తాయి.