
పరవశాల_మత్తు
-లక్ష్మీ కందిమళ్ల
సాయం సంధ్యల కలయికలు
సంతోషాల సుర గీతికలు
పరవశపు మత్తులో
సుమ పరిమళ హాసాలు
ఋతువుల కేళీ విలాసాలు
పలకరింతల
పులకరింతలు
పిలుపు పిలుపు లో
మోహన రాగాలు
పదిలం గా
దాచుకునే
కానుకల వసంతాలు
వాలిన రెప్పల చాటున
రహస్యాలు
ఊపిరి పరిమళమై మురిపిస్తుంటాయి
ఒక
నిశ్చల
నిశ్చింతతో..!!
*****
Please follow and like us:

కర్నూలు
గృహిణి
సాహిత్యాభిలాష (చదవడం,రాయడం)
ప్రవృత్తి: కవిత్వం రాయడం
