image_print

మౌనశిఖ ( కవిత)

మౌనశిఖ -లక్ష్మీ కందిమళ్ళ ఆమె మౌనశిఖ  ఆమెలోని సున్నితత్వమే ఆమె మాటలోని మాధుర్యం  తన మనసులోకి ఏది ఒంపుకోవాలో తెలిసిన సహృదయిని  తనకు ఎంతో ఇష్టమైంది స్వచ్ఛత ఆమె గురించి ఎంతో చెప్పాలనే ఉంటుంది  కానీ  వినిపించుకునేవారెవరు?? వినేవాళ్ళు లేరనే నేమోఎప్పుడో మూగబోయింది గొంతు. ***** కర్నూలు గృహిణి సాహిత్యాభిలాష (చదవడం,రాయడం) ప్రవృత్తి: కవిత్వం రాయడం

Continue Reading
Posted On :

నిశ్శబ్ద గ్రంథాలయం ( కవిత)

నిశ్శబ్ద గ్రంథాలయం -లక్ష్మీ కందిమళ్ళ ఇప్పుడు సత్యం పలికే చోటికి పయనం  అక్కడంతా సీతాకోకచిలుకల సందడి ఇంకా శంఖు శబ్దాలు మధురంగాఆ ముచ్చట ఎంత చెప్పినా తక్కువే మరిఇహ ఆ అనుబంధపు తడికి ఎండిన కొమ్మైనా చిగురించదూ ఆ మాటలు వినగలగడం ఒక వరంపాషాణమైనా కరిగి కదులుతుంది నదిలా  ఇహ, అలా బ్రతికేస్తే చాలనిపిస్తుందిఅప్పుడు అదంతా ఒక మురిపెం ఆ నిశ్శబ్ద గ్రంథాలయంలో.. ***** కర్నూలు గృహిణి సాహిత్యాభిలాష (చదవడం,రాయడం) ప్రవృత్తి: కవిత్వం రాయడం

Continue Reading
Posted On :

నిశ్శబ్ద శిలలు ( కవిత)

నిశ్శబ్ద శిలలు -లక్ష్మీ కందిమళ్ళ ఒట్టి శిలలు కాదవి కన్న కలలు  రాళ్ళలా పడివున్న అంతరాత్మలు  కన్నీటిలో తడిచిన కథలు చెబుతాయి  మరచిపోకు రాళ్ళల్లోనూ కన్నీళ్ళుంటాయి అవి శూన్యంలో నిలిచిన నిశ్శబ్ద శిలలు  గత చరిత్ర సాక్షాలు. ***** కర్నూలు గృహిణి సాహిత్యాభిలాష (చదవడం,రాయడం) ప్రవృత్తి: కవిత్వం రాయడం

Continue Reading
Posted On :

తడిలేని నవ్వు ( కవిత)

తడిలేని నవ్వు -లక్ష్మీ కందిమళ్ళ గరుక విలువ చేయని జీవితం ఎడారిలా మారిన గుండె గొంతులోనే ఆగిన మాటలు శాసిస్తున్న శాసనాల ఊబిలోఉక్కిరిబిక్కిరవుతూ… ఒక నిన్ను ఒక నన్ను తిరగవేస్తున్న చరిత్ర  ఒక సూర్యోదయంతో ఒక చంద్రోదయంతో తప్పని జీవిత పయనం తడిలేని నవ్వుతో అలా… ***** కర్నూలు గృహిణి సాహిత్యాభిలాష (చదవడం,రాయడం) ప్రవృత్తి: కవిత్వం రాయడం

Continue Reading
Posted On :
లక్ష్మీ కందిమళ్ళ

పద్మవ్యూహం (కవిత)

పద్మవ్యూహం -లక్ష్మీ కందిమళ్ళ అనగనగా ఒక కథముగింపు తెలీని కథ ఆ కథలో ఎన్నో విషయాలు న్యాయం, అన్యాయం సంతోషం, దుఃఖం స్వర్గం, నరకం  ఇకఆ కథలోకి ప్రవేశించాక తిరిగి బయటికి వచ్చే దారి వుండదు అదో పద్మవ్యూహం  అలా సాగుతూ వుంటుంది ఆ కథ  చివరికి ఆ కథ ఎక్కడికి తీసుకెళ్ళుతుందో నీకు తెలీదు తెలుసుకునే అవకాశం వుండదు  అందుకే అది ముగింపు తెలీని కథ. ***** కర్నూలు గృహిణి సాహిత్యాభిలాష (చదవడం,రాయడం) ప్రవృత్తి: కవిత్వం రాయడం

Continue Reading
Posted On :
లక్ష్మీ కందిమళ్ళ

ఎరుక (కవిత)

ఎరుక -లక్ష్మీ కందిమళ్ళ ఎప్పటికప్పుడు ఎరుక కలిగించే సత్యం అదినిశ్చల తటాకంపై నిలిచిన ప్రశాంతతపక్షిలా విహరిస్తున్న వాక్యం సరికొత్త రాగంలో ఉదయాన్ని గుప్పిట పడుతూ ఋతువుల ఆగమనం  ఆశగా చిగురిస్తూ తుమ్మెదలాగా రెక్కలు ఆడిస్తూ బోసినవ్వుల అమాయకత్వంతో మళ్ళీ మళ్ళీ స్వచ్ఛంగా సహజంగా మత్తుగా కలల రంగులను అద్దుకొనిపూల రేకులను ముద్దాడుతూ శాంతి, సాంత్వనవెలుగు వచనాలుగా.. ***** కర్నూలు గృహిణి సాహిత్యాభిలాష (చదవడం,రాయడం) ప్రవృత్తి: కవిత్వం రాయడం

Continue Reading
Posted On :

ఆకాశంలో సగం(కవిత)

ఆకాశంలో సగం -లక్ష్మీకందిమళ్ళ నీ అడుగుతో నా అడుగు ఈ నడక కొత్తగా మొదలైంది కాదు బంధంతో బతుకు బతుకుకో బంధం ఎప్పుడో ముడిపడింది మనసు మనసు.మురిపెం హద్దులు దాటని పరిధి నదులుగా తడుస్తూ అహం తెలియని ఆసరాల ఆలింగనాలు ఆవేశం కాని ఆలోచనలు నువ్వు ఆకాశమై నీలో సగమై నేను. ***** కర్నూలు గృహిణి సాహిత్యాభిలాష (చదవడం,రాయడం) ప్రవృత్తి: కవిత్వం రాయడం

Continue Reading
Posted On :

అభినయ (కవిత)

అభినయ (కవిత) -లక్ష్మీ కందిమళ్ళ అది కాదు ఇంకేదో అనుకుంటూ కంటినుంచి కన్నీటిచుక్క రాలింది. కన్నీరు కనిపించకుండా ముఖం పక్కకు తిప్పుకొని తడిని  తుడుచుకుంటూ పెదవులపై, జీవంలేని నవ్వులను మొలిపించుకుంటూ కళ్ళల్లో లేని ఆనందాన్ని అభినయిస్తూ.. ఆమె. అందుకు తడిచిన గులాబీ సాక్ష్యం! ***** ఫోటో ఆర్ట్: రమేష్ పొతకనూరి కర్నూలు గృహిణి సాహిత్యాభిలాష (చదవడం,రాయడం) ప్రవృత్తి: కవిత్వం రాయడం

Continue Reading
Posted On :

అబ్బూరి ఛాయాదేవి గారి సాహిత్య అంతస్సూత్రం

అబ్బూరి ఛాయాదేవి గారి సాహిత్య అంతసూత్రం -డా|| కె.గీత అక్షరాస్యతే అరుదయిన  కాలంలో ఎం. ఎ.పొలిటికల్ సైన్స్ చదివి, లైబ్రరీ సైన్సెస్ లో డిప్లొమా తీసుకుని సమాజాన్నీ, సాహిత్యాన్ని కూడా లోతుగా అధ్యయనం చేసిన రచయిత్రి అబ్బూరి ఛాయాదేవి. అదే క్రమంలో ఆంగ్లసాహిత్యాన్ని కూడా ఔపోసన పట్టారు.  ‘చాయ’అంటే నీడ అని అర్థం. అయితే ఛాయాదేవి మాత్రం స్త్రీని వంటయిల్లు అనే చీకటి చాయనుండి తప్పించింది. ఆరు బయట విశాల ప్రపంచంలో ఏం జరుగుతోందో చూడమన్నారు. స్త్రీ చుట్టూ విస్తరించుకు […]

Continue Reading
Posted On :

కరోనా ఆంటీ (కథ)

కరోనా ఆంటీ (కథ) -లక్ష్మీ కందిమళ్ల  మా కిటికీకి చేతులు వచ్చాయిఅవునండీ బాబు ఈమధ్య మా హాల్లో కిటికీకి చేతులు వచ్చాయి. నిజంగా..నిజం.. మా అపార్ట్మెంట్ లో, ప్లోరుకు ఐదు ఇల్లు ఉంటాయి. అందునా మా ఇల్లు  ఫస్ట్ ప్లోర్ లో ..  అటు రెండు ఇల్లు, ఇటు రెండు ఇల్లు మధ్యలో మా ఇల్లు. కారిడార్ వైపు హాల్ కిటికీ వుంటుంది. ఆ కిటికీకి  అద్దాలున్న రెక్కలు బయటికి వుంటాయి. ఇంకో జత రెక్కలు మెష్ ఉన్నవి లోపలికి వుంటాయి.” అందునా […]

Continue Reading
Posted On :

నేను నేనేనా (కవిత)

నేను నేనేనా.. -లక్ష్మీ_కందిమళ్ళ నిశ్చింతకై వెతుకులాట శూన్యమైపోతున్నానేమోనన్న బెంగ. నిన్నటిలా నేడూ వుండాలని. నేటిలా రేపూ వుండాలని. ఎందుకో మరి తళుక్కున మెరిసీ మాయమవుతున్న వెలుతురు. నేనంటూ వున్నానా నేను నేనేనా నేను ఇంకోలా నా ఇంకోలా అంటే ఏమో?? మాటలన్నీ మౌనాలై ఊసులన్నీ భోషాణం లో చేరాయి. తలుపు తెరుచుకొని రాలేకున్నాయి. ఎదురు చూస్తూ.. నేను..!! ***** కర్నూలు గృహిణి సాహిత్యాభిలాష (చదవడం,రాయడం) ప్రవృత్తి: కవిత్వం రాయడం

Continue Reading
Posted On :

పరవశాల మత్తు(కవిత)

పరవశాల_మత్తు -లక్ష్మీ కందిమళ్ల  సాయం సంధ్యల కలయికలు సంతోషాల సుర గీతికలు పరవశపు మత్తులో సుమ పరిమళ హాసాలు ఋతువుల కేళీ విలాసాలు పలకరింతల పులకరింతలు పిలుపు పిలుపు లో మోహన రాగాలు పదిలం గా దాచుకునే కానుకల వసంతాలు వాలిన రెప్పల చాటున రహస్యాలు ఊపిరి పరిమళమై మురిపిస్తుంటాయి ఒక నిశ్చల నిశ్చింతతో..!! ***** కర్నూలు గృహిణి సాహిత్యాభిలాష (చదవడం,రాయడం) ప్రవృత్తి: కవిత్వం రాయడం

Continue Reading
Posted On :
లక్ష్మీ కందిమళ్ళ

ఆమె ధరణి(కవిత)

ఆమె ధరణి -కందిమళ్ళ లక్ష్మి  కొందరు అప్పుడప్పుడు కఠిన మాటలతో ఆమెను శిలగా మారుస్తుంటారు.  ఆమె కూడా చలనం లేని రాయిలా మారిపోతూ ఉంటుంది. ఆమె  ఒక మనిషని మరచిపోతుంటారు.  కానీ ఆమె మాత్రం చిరచిత్తంతో మమతానురాగాల వంతెనపైనే నడుస్తూ ఉంటుంది. ఆమెనుఒక చైతన్య మూర్తిగా ఎప్పుడు గుర్తిస్తారు?? మీకు తెలియదా??ఆమె ఎప్పుడూ లాలిత్యాన్ని వదలని ఒక ధరణని!!***** కర్నూలు గృహిణి సాహిత్యాభిలాష (చదవడం,రాయడం) ప్రవృత్తి: కవిత్వం రాయడం

Continue Reading
Posted On :