
కరోనా కవిత: “విశ్వ విజేతలవుదాం”
-వంజారి రోహిణి
తిరుగుబాటు – పోరుబాటరణరంగంలో యుద్ధం…ప్రాచీన చరిత్ర లోరాజులకు రాజులకు మధ్యరాజ్యాలకు రాజ్యాలకు మధ్యరాజ్య కాంక్షతో రక్తాన్నిఏరులై పారించారు…చివరికి అందరి ప్రాణాలు గాల్లోఅన్నీ కట్టెలు మట్టిలో….ఆధునిక చరిత్ర లోప్రాంతానికీ ప్రాంతానికీ మధ్యదేశానికీ దేశానికీ మధ్యకులానికీ కులానికీ మధ్యమతానికీ మతానికీ మధ్యమనిషికి మనిషికి మధ్యఆధిపత్యం కోసం అణిచివేతవివేక రహిత విద్వేషం….ఫలితం…కొందరి గెలుపు కొందరి ఓటమిహత్యలు ఆత్మాహుతులువరదలై పారిన నెత్తుటి కన్నీరువర్తమాన ప్రపంచంలోఅందరికీ ఒకటే శత్రువుకరోనా వైరస్మనుషులంతా ఒకటైప్రాంతాలన్నీ ఒకటైదేశాలన్నీ ఒకటైవిశ్వ మంతా ఒకటైపోరుబాట పడదాంఅందరికీ ఏకైక శత్రువైఅందరి ప్రాణాలతో చెలగాటమాడుతున్నకరోనా వైరస్ పై యుద్ధంప్రకటిద్దాం….ఇంట్లో నే ఉందాంపరిశుభ్రత ను పాటిద్దాంమనసులన్నీ ఒకటిగా చేసుకునిమనుషుల మధ్య మాత్రంకాస్త ఎడం పాటిద్దాంకరోనా మహమ్మారిభరతం పడదాం…ప్రపంచం మొత్తాన్నివదిలి వేసేదాకతరిమి తరిమి కొడదాంఆరోగ్య ఆనందమయప్రపంచాన్ని చేజిక్కించుకుందాంమనమంతా విశ్వ విజేతలవుదాం”
*****
ఫోటో ఆర్ట్: రమేష్ పొతకనూరి

వంజారి రోహిణి హైదరాబాద్ లో నివాసం. వృత్తిరీత్యా సైన్స్ టీచర్ అయినా ప్రవృత్తి చదవటం, రచనలు చేయటం. ఇప్పటి వరకు 15 కధలు,20 కవితలు వివిధ పత్రికల్లో ప్రచురితం అయినాయి. రెండు కధలకు బహుమతి పురస్కారాలు లభించాయి. మానవత్వం, విజ్ఞానం, కరుణ కలిగిన సందేశాత్మక కథలను వ్రాయడమంటే మక్కువ.
